'చెత్త నుంచి సంపాదన'
చెత్త నుంచి సంపాదన సృష్టించేలా కృషి జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. చెత్తను పునర్వినియోగించేలా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నాగోల్ సమీపంలో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుతో.. దిల్లీ, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలతో పాటు సీ అండ్ డీ ప్లాంట్‌ను కలిగిన ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హాజరు కాని నామా..
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ రుణాల కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈడీ ఎదుట విచారణకు ఎంపీ నామా హాజరు కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్రమంత్రికే ఝలక్
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. గంట పాటు మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకునే వీలు లేకుండా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆక్సిజన్' రగడ
కరోనా రెండో దశ ఉద్ధృతిలో దిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై రాజకీయంగా దుమారం రేగింది. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పి, అవసరానికి మించి ప్రాణవాయువు పొందిందని భాజపా ఆరోపించగా.. ఆప్ తిప్పికొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న విమాన వాహక నౌకను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా దీనిని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.