1.'సచివాలయానికి వెళ్తే కదా తెలిసేది'
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు అవకాశమివ్వాలని ప్రజలను కోరారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన...ఎంఐఎం, తెరాసపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.'ఉద్వేగాలకు లోను కావద్దు'
దిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు... కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తున్నారని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జుమ్మేరాత్ బజార్లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలు ఉద్వేగాలకు లోనుకాకుండా తమ వెంట ఉండే నాయకులకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.'105 గెలుస్తాం'
జియాగూడ బైక్ ర్యాలీలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 సీట్లు గెలుచుకుంటామని మహమూద్ అలీ జోస్యం చెప్పారు. కార్వాన్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, మిత్ర కృష్ణలకు మద్దతుగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.'భాజపా ఎదుగుదలకు సహకరిస్తున్నాయి'
తెరాస, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో భాజపా ఎదుగుదలకు సహకరిస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.'విముక్తి కోసం ఓటేయండి'
డిసెంబర్ 1న జరగనున్న గ్రేటర్ పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. అంబర్‌పేటలో భాజపా తరఫున చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.