1.'సమస్యల్ని పరిష్కరిస్తాం'
సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి, సుపరిపాలన కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.'కొట్లాడైనా పరిష్కరిస్తా'
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.అవినీతి సెగ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఐలను అనిశా అరెస్టు చేసింది. కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా.. అనిశా తనిఖీల్లో దొరికిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.కాగితపు ముక్క పట్టించింది..
ఏపీలోని.. నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సినిమాలు చూసి ఈ దొంగతనానికి పాల్పడిన దొంగలు... ఓ చిన్న కాగితపు ముక్కను క్లూగా వదిలేశారు. అదే వారిని సులువుగా దొరికిపోయేలా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.పరిశుభ్రంగా ఉంచడం ఎలా?
హైదరాబాద్లో జనాభా పెరిగేకొద్ది వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీ అధికారులు వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. రహదారులు, కాలనీల్లో అనేక చోట్ల చెత్త కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అసలు చెత్త నిర్వహణలో లోపం ఎక్కడ వస్తోంది.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎలా అనే అంశాలపై ఈటీవీ భారత్ కథనం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.