1.హైదరాబాద్‌లో జేపీ నడ్డా
బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు రాష్ట్ర నాయకులు ఘనస్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.'ప్రభుత్వం ఊరుకుంటుందా?'
జీహెచ్ఎంసీ పరిధిలో లేని అంశాలను భాజపా మేనిఫెస్టోలో పెట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఉంటే రూ.25వేల వరదసాయం ఎలా ఇస్తారని, ప్రధానితో జీవో ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.'పట్టం కట్టండి'
తెరాసపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటు వేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే.. భాజపాకు పట్టం కట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.ఎంఐఎం జోరు
బల్దియా బరిలో ఎంఐఎం ప్రచారం ప్రత్యేక పంథాలో సాగుతోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు ప్రచార తారలతో ఓటర్లను ఆకట్టుకుంటుంటే.. మజ్లిస్ గెలుపుబాధ్యతను ఓవైసీ సోదరులు తమ భుజాన ఎత్తుకున్నారు. అధికార తెరాసతో స్నేహపూర్వక పోటీ చేస్తున్న ఎంఐఎం గతంలో కంటే ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.'వారిని ఏజెంట్లుగా అనుమతించొద్దు'
గ్రేటర్ ఎన్నికల ఏజెంట్ల నియామక నిబంధనలను ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా అనుమతించవద్దని ఆదేశించారు. ఏజెంట్లు అదే ప్రాంతానికి చెందినవారై ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.