తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ 10 వార్తలు @ 9AM - undefined

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

etv bharat telangana top ten news
etv bharat telangana top ten news

By

Published : Jun 10, 2020, 9:00 AM IST

జులై ఆఖరుకు దేశంలో భారీగా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జులై చివరినాటికి 10 లక్షలకుపైగా కేసులు నమోదవ్వొచ్చని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఇంకా ఏమన్నారంటే..

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

షోపియాన్​ జిల్లా సుగూలో జరుగుతోన్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

పదో తరగతి గ్రేడ్లపై అధికారులు కసరత్తు చేశారు. అంతర్గత మార్కుల ప్రకారం గ్రేడింగ్‌ తదితర అంశాలపై ముసాయిదా రూపొందించినట్లు సమాచారం. గ్రేడ్లు ఎలా ఇస్తారంటే..

ప్రాజెక్టులపై కరోనా ప్రభావం

కరోనా, లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతో ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై పడింది. నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులతో సహా మిగిలిన వాటికి నామమాత్రంగానే ఖర్చు చేశారు.ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారంటే...

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...

ఈ బ్యాటరీతో భూమిని 100 సార్లు చుట్టేయొచ్చట!

ఎలక్ట్రిక్ కార్ల రంగానికి మంచి ఊపునిచ్చే ఆవిష్కరణ చేసింది చైనాకు చెందిన సీఏటీఎల్‌ కంపెనీ. 20 లక్షల కి.మీ సామర్థ్యం, 16 సంవత్సరాల వారెంటీతో ఓ బాహుబలి కారు బ్యాటరీని రూపొందించింది. అంటే భూమిని 100 సార్లు చుట్టి వచ్చినా బ్యాటరీ ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..

టీ20 ప్రపంచకప్​ ఆతిథ్యానికి అమెరికా రెడీ

టీ-20 ప్రపంచకప్​-2023ను అమెరికాలో నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్​ బోర్డు ఆసక్తి చూపుతోంది. భారత్​, పాకిస్థాన్​ల మధ్య జరిగే మ్యాచ్​లకూ తటస్థ వేదికగా ఉంటామని యూఎస్​ఏ క్రికెట్​ బోర్డు సీఈఓ ఇయాన్​ హెగ్గిన్స్​ తెలిపారు. రాబోయే పదేళ్లలో ఐసీసీలో శాశ్వత సభ్య దేశంగా ఉండాలన్నది వారి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..

'తను నన్ను బాలా అని పిలుస్తాడు'

తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో 'బాలయ్య'గా, 'యువరత్న'గా పేరు తెచ్చుకున్నారు. నేడు ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగాబాలకృష్ణ గురించి ప్రత్యేక విశేషాలు మీకోసం..

మల్టీస్టారర్ మలయాళం రీమేక్​లో రానా-రవితేజ!

త్వరలోనే రవితేజ-రానా ఓ మల్టీస్టారర్​ సినిమా చేయనున్నట్లు టాక్​. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' తెలుగు రీమేక్​లో నటించనున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details