తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9AM - telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

etv bharat
etv bharat

By

Published : Jun 14, 2020, 8:59 AM IST

'మహా'ను మించిన మరణాలు

దిల్లీలో మృత్యుకేళి దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో కొత్త సారథి!

నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. వారం పదిరోజుల్లో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ ముఖ్యనాయకుడి మాటల ద్వారా అర్థమవుతోంది. ఎవరిని ఎంపిక చేయనున్నారు?

‘కొండపోచమ్మ’కు గోదారి

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలోకి శనివారం ఒక టీఎంసీ నీరు చేరినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కడప సెంట్రల్ జైలుకు జేసీ

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్​ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వారిరువురిని అనంతపురం జైలు నుంచి కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి కోసం

మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా... అయితే ఈ కథనం మీ కోసమే. పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి.

8 ప్రధాన లక్షణాలివే

కరోనా బాధితుల్లో 8 ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు నుంచే బాధితుల్లో ఇబ్బందులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఆ 8 లక్షణాలు ఇవే...

భగవద్గీతతో ప్రశాంతత

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి, కర్మయోగాలను అనుసరించడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోబలాన్ని పొందవచ్చని అమెరికా కాంగ్రెస్​కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలైన తులసీ గబార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో భగవద్గీత పారాయణ ద్వారా విజయవంతమైన జీవనాన్ని గడపగలుగుతారని ఆమె స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారంటే...

సోనూసూద్​ అరుదు

ముంబయిలో చిక్కుకుపోయిన ఓ ప్రముఖ నటుడిని, త్వరలో తన స్వస్థలానికి చేర్చుతానని హామీ ఇచ్చారు సోనూసూద్. ఈ విషయమై స్పందించిన నటుడు.. సోనూసూద్​ను ఇలా ప్రశంసించారు.

ఆ ప్రదేశమైతే అనుకూలం

కరోనా వల్ల వేసవిలో ఐపీఎల్‌ వినోదాన్ని కోల్పోయారు క్రికెట్‌ ప్రేమికులు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ లీగ్‌ నిర్వహణ జరిగేలా కనిపించడం లేదు. మరి ఐపీఎల్ ఎప్పుడు జరపొచ్చు? ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ఈ అంశాలపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రత్యేక విశ్లేషణ.

సెయిల్‌ ఛైర్మన్​కు కరోనా!

సెయిల్​ ఛైర్మన్​ అనిల్​ కుమార్​ చౌదరికి కొవిడ్​-19 సోకింది. ఆ సంస్థ కార్పొరేట్​ కార్యాలయంలో 25 మందికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే.. డైరెక్టర్ మృతికి కారణాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు నిరాధారమైనవని కంపెనీ పేర్కొంది. ఇలా వివరణ ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details