తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ 10 వార్తలు @ 9AM

ఇప్పటివరకున్న ప్రధాన వార్తలు

etv bahart
etv bahart

By

Published : Jun 9, 2020, 9:00 AM IST

చిరుత ఏం చేసిందో చూడండి

హైదరాబాద్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఓ ఇంటి కిటికీ ఎక్కి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

పది గ్రేడింగ్ ఇలా..

కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఆ గ్రేడింగ్ ఎలా ఇస్తారో చూడండి.

ఏజెన్సీ బంద్‌

తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది జీవో 3 సాధన కమిటీ. ఎందుకంటే..

జగన్​తో సినీప్రముఖుల భేటీ

సినీ రంగ సమస్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ భేటీ కానున్నారు. ఏ అంశాలపై చర్చిస్తారో తెలుసా..

సుజాత కస్టడి!

హైదరాబాద్ షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి వివాదం కేసులో లంచం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

దిల్లీ ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా అనుమానంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయిన ఆయన అన్ని అధికారిక సమావేశాలను రద్దు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

నీటిపై తేలిన కోతుల మృతదేహాలు

అసోంలోని కాఛార్​ జిల్లాలో కోతుల మృతదేహాలు కలకలం రేపాయి. దాదాపు 13 వానరాలు.. ఓ నీటి సరఫరా ప్లాంట్​లో తేలుతూ కనిపించాయి. కారణాలు ఏమై ఉండొచ్చు..

బాలయ్య నో యాడ్

తన జీవితంలో ఇప్పటివరకు వాణిజ్య ప్రకటనల్లో కనిపించకపోవడానికి బలమైన కారణముందని అంటున్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఇంతకీ ఏంటా కారణం.

స్టీరింగ్ వదిలింది పోర్న్​స్టారయింది..

తను ఎంతో ఇష్టపడ్డ కార్ రేసింగ్​ను వదిలిపెట్టి.. పోర్న్​స్టార్​గా మారింది. అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది?ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా?

న్యూయార్క్ పునఃప్రారంభం

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరం పునఃప్రారంభమైంది. నిబంధనల మేరకు మరణాల రేటులో తగ్గుదల నమోదు చేసిన నేపథ్యంలో నగరాన్ని పునఃప్రారంభించేందుకు మొగ్గు చూపింది ప్రభుత్వం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details