సచివాలయంలో కరోనా
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కట్టడి వ్యూహం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. దేశ రాజధానిలో ఉద్ధృతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఈ మహమ్మారి కట్టడిపై చర్చించిన అంశాలివే..
'కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. చంపేశారు'..
సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని ఎక్సెల్ ఆసుపత్రిలో కడుపు నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న మూడ్రోజుల అనంతరం ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడని ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ 90మంది వైద్యులకు కరోనా
చెన్నైలోని రాజీవ్ గాందీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. అయితే వీరిలో వైరస్ రోగులకు చికిత్స అందించినవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈ కరోనా బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఓ వైపు కరోనా భూతం ప్రజలను అల్లాడిస్తుంటే... మరోవైపు ఆసుపత్రుల బిల్లు వారి ఇళ్లను గుల్లచేస్తోంది. అమెరికా సియాటెల్‌కు చెందిన ఓ 70 ఏళ్ల పెద్దాయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకున్నారు. వ్యాధి నుంచి అయితే కోలుకున్నారు కానీ బిల్లు చూసి గండెలు బాదుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. అసలు బిల్లు కథంటో మీరే చూడండి.