తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​ న్యూస్​ 7PM - టాప్​ న్యూస్​ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Aug 15, 2022, 6:59 PM IST

  • గల్లంతైన జవాన్ ఆచూకీ ఇన్నేళ్లకు లభ్యం, దారి చూపిన డిస్క్​లు

ఆ జవాను కనిపించకుండా పోయి 38 ఏళ్లు దాటింది. ఏమైపోయారో, అసలు ఉన్నారో లేదో తెలియకుండానే అనేక సంవత్సరాలుగా దిగులుతో గడుపుతోంది ఆయన కుటుంబం. అలాంటి వారికి ఇప్పుడు కీలక వార్త చెప్పారు ఇండియన్ ఆర్మీ అధికారులు.

  • సామూహిక జాతీయ గీతాలాపనకు భారీ ఏర్పాట్లు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రేపు సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ట్రాఫిక్​ పోలీసులు మంగళవారం ఉదయం పదకొండున్నరకు అన్ని కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు.

  • త్వరలోనే జగదీశ్వర్ రెడ్డి అవినీతి చిట్టా వెల్లడిస్తానని రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్

మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి, అక్రమ ఆస్తులను బయటపెడతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. మంత్రి ఆస్తులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు చౌటుప్పల్​లో ప్రకటించారు.

  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ వ్యాపారి మృతి

గ్రేటర్ హైదరాబాద్ కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మి విల్లాస్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జెండా వందనం అనంతరం ప్రసంగిస్తూ ఓ వ్యాపారి గుండెపోటుతో చనిపోయారు.

  • డిసెంబర్‌లో మునుగోడు ఉపఎన్నిక, గెలుస్తామని ఉత్తమ్ ధీమా

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ముసలం మొదలైంది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు గెలుపు దిశగా ప్రయత్నాలు, వ్యూహాలు పన్నుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్‌లో మునుగోడు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

  • భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతమైంది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

  • న్యాయం చేసే బాధ్యత మూడు వ్యవస్థలది, కోర్టులది మాత్రమే కాదు

ప్రజలకు న్యాయాన్నిఅందించడం కేవలం న్యాయస్థానాలదే బాధ్యత అనే భావనను రాజ్యాంగం తొలగిస్తుందని జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

  • దళిత విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసిన టీచర్​, 18 గంటలు అలానే

11 ఏళ్ల విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు ఓ ఉపాధ్యాయుడు. సుమారు 18 గంటలపాటు బాలుడు టాయిలెట్​లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం వేరే ఉపాధ్యాయులు బాత్​రూమ్​ డోర్​ను తెరవగా బయటకొచ్చాడు బాలుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • 78ఏళ్ల వయసులో దిగ్గజ​ క్రికెటర్​ రిటైర్మెంట్​

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ ఇయాన్​ చాపెల్​​.. తన 78వ ఏట రిటైర్మెంట్​ ప్రకటించారు. అయితే అది క్రికెట్​కు కాదు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు తెలిపారు.

  • లైగర్​ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన పాన్​ ఇండియా చిత్రం 'లైగర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details