తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - తెలంగాణ తాజా వార్తలు

ETV BHARAT
ఈటీవీ భారత్

By

Published : Nov 25, 2021, 5:57 AM IST

Updated : Nov 25, 2021, 10:01 PM IST

21:56 November 25

టాప్​ న్యూస్​ @10PM

  •  తెలుగు రాష్ట్రాలకు కేఆర్​ఎంబీ లేఖ

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ (KRMB letter to telangana, andhrapradesh) రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలాశయాల్లో విద్యుదుత్పత్తి(power generation in nagarjuna sagar)ని వెంటనే నిలిపివేయాలని లేఖలో పేర్కొంది.

  • పాతబస్తీలో ఫేక్ ఫకీర్

మార్కెట్​లో మరో కొత్త బాబా(fake baba in hyderabad) బాగోతం బయటపడింది. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వాళ్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకునే స్వామీజీలు కొందరైతే.. భక్తి ముసుగులో రక్తి సాగిస్తున్న బాబాలు మరికొందరు పుట్టుకొస్తూనే ఉన్నారు.

  • ' కొత్త వేరియంట్​తో జాగ్రత్త'

విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది.

  • 'తెరాసను ఎదగనీయొద్దు...'

తెరాస ప్రభుత్వంపై సంయుక్త కిసాన్​ మోర్చా నేత రాకేష్​టికాయత్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు ఒక్కొక్కరి 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న టికాయత్​.. ముందుగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు.

  • శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​

తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవీంద్ర జడేజా(50) ఉన్నారు.

20:56 November 25

టాప్​ న్యూస్​ @9PM

  • రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్​జీటీ ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలులో జాప్యంపై మండిపడింది. 

  • సింగరేణిలో సమ్మె .!

సింగరేణి బొగ్గు గనుల్లోని 4 బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం సమ్మె సైరన్​ మోగించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సమ్మె నోటీసిచ్చింది

  • 'తెరాసను ఎదగనీయొద్దు...'

తెరాస ప్రభుత్వంపై సంయుక్త కిసాన్​ మోర్చా నేత రాకేష్​టికాయత్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు ఒక్కొక్కరి 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న టికాయత్​.. ముందుగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు.

  • 'అఖండ'  గెస్ట్​గా ఐకాన్ స్టార్

నందమూరి బాలయ్యతో పాటు బన్నీ ఫ్యాన్స్​కు అదిరిపోయే వార్త ఇది. ఈ హీరోలిద్దరూ ఒకే వేదికపై అభిమానులకు కనువిందు చేయనున్నారు.

  • శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​

తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవీంద్ర జడేజా(50) ఉన్నారు.

19:51 November 25

టాప్​ న్యూస్​ @8PM

  • సింగరేణిలో సమ్మె .!

సింగరేణి బొగ్గు గనుల్లోని 4 బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం సమ్మె సైరన్​ మోగించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సమ్మె నోటీసిచ్చింది

  • 'తెరాసను ఎదగనీయొద్దు...'

తెరాస ప్రభుత్వంపై సంయుక్త కిసాన్​ మోర్చా నేత రాకేష్​టికాయత్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు ఒక్కొక్కరి 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న టికాయత్​.. ముందుగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు.

  • 'వారిని ఉరి తీయొద్దు.. జీవితాంతం అలాగే...'

2013 నాటి ముంబయి శక్తి మిల్స్ గ్యాంగ్​రేప్​ కేసులో (shakti mills case) దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది బాంబే హైకోర్టు. దోషులు పశ్చాత్తాపపడడానికి జీవిత ఖైదు తప్పనిసరని పేర్కొంది. సమాజంలో బతకడానికి దోషులు అనర్హులని స్పష్టం చేసింది.

  •  చిన్నపిల్లలకు ఫైజర్​ వ్యాక్సిన్​

 5 నుంచి 11 ఏళ్లు ఉండే చిన్న పిల్లలకు ఫైజర్​ టీకాను ఇవ్వాలని ఐరోపా సమాఖ్య నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తుండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • ఆ మ్యాచ్​కు రికార్డ్​ 'వ్యూస్' 

టీమ్​ఇండియా​- పాకిస్థాన్ మ్యాచ్​(IND vs PAK T20) కోసం అభిమానులు ఎంతలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే టీ20 ప్రపంచకప్​ టోర్నీలో జరిగిన భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​కు రికార్డు స్థాయిలో వ్యూస్​ వచ్చాయి. టీ20 చరిత్రలోనే ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్​ ఈ మ్యాచ్​కు రావడం విశేషం.

18:50 November 25

టాప్​ న్యూస్​ @7PM

  • రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్​జీటీ ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలులో జాప్యంపై మండిపడింది. 

  • సింగరేణిలో సమ్మె సైరన్‌

సింగరేణి బొగ్గు గనుల్లోని 4 బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం సమ్మె సైరన్​ మోగించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సమ్మె నోటీసిచ్చింది

  • ఆసుపత్రిలో అన్నా హజారే

 ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆసుపత్రిపాలయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు.

  • ఆ కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు

చట్టసభ్యులపై చిన్న నేరాలకు సంబంధించిన కేసులు విచారించేందుకు ప్రత్యేక మేజిస్టీరియల్​ కోర్టులు(Sc on special magesterial courts) ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల చేయాలని అలహాబాద్​ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర తీవ్రతను బట్టి.. ఈ కేసులను సెషన్స్​ కోర్టుకు, లేదా మేజిస్టీరియల్​ కోర్టుకు కేటాయించాలని సూచించింది.

  • 'మీరు నాలుగే.. మేం 15 సార్లు'

భారత పర్యటనలో తమ జట్టు వరుసగా నాలుగో సారి టాస్​ ఓడిపోవడంపై న్యూజిలాండ్​ ప్లేయర్​ నీషమ్​ తమాషాగా ట్వీట్​ చేశాడు. వైరల్​గా మారిన ఈ ట్వీట్​కు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

17:48 November 25

టాప్​ న్యూస్​ @6PM

  • మరో డేరాబాబా

మార్కెట్​లో మరో కొత్త బాబా(fake baba in hyderabad) బాగోతం బయటపడింది. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వాళ్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకునే స్వామీజీలు కొందరైతే.. భక్తి ముసుగులో రక్తి సాగిస్తున్న బాబాలు మరికొందరు పుట్టుకొస్తూనే ఉన్నారు.

  • పెన్సిల్​ పోయిందని పీఎస్​లో  బాలుడు

సాధారణంగా చిన్న పిల్లలు పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. వారి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కర్నూలు జిల్లా పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ఓ బుడతడు.. పెన్సిల్​ను తన స్నేహితుడు దొంగిలించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెన్సిల్​ను తస్కరించిన చిన్నారిని అరెస్టు చేయాలని పట్టుబట్టాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన పోలీసులు..వారికి సర్దిజెప్పి అక్కడినుంచి పంపించేశారు.

  • ఉన్నతాధికారులకు కరోనా​.. ఒకరు పరార్​!

ఉత్తరాఖండ్​లోని ఎఫ్​ఆర్​ఐలో కరోనా కలకలం సృష్టించింది. శిక్షణ కోసం వెళ్లిన 11మంది ఐఎఫ్​ఎస్​ అధికారులకు కొవిడ్​ సోకింది(fri dehradun covid news). కరోనా పాజిటివ్​ అని తేలిన వెంటనే ఓ సీనియర్​ అధికారి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.

ఆ ఎన్నికల్లో చైనాకు షాక్​..

 భారత్​ నుంచి ప్రవీణ్​ సిన్హా అనే అధికారి ఇంటర్​పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా నుంచి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో స్పెషల్​ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

  • అందుకు చాలా భయపడ్డా

అభిమానులతో పాటు 'అఖండ' సినిమా కోసం తాను కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. ఇందులో క్రూరమైన విలన్​గా నటించానని అన్నారు.

16:46 November 25

టాప్​ న్యూస్​ @5PM

  • ఆ వ్యక్తితోనే పెళ్లి.. అయినా హైకోర్టు 'నో'

తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని తాను పెళ్లి చేసుకుని, ఓ పిల్లాడికి జన్మనిచ్చానని.. కాబట్టి నిందితుడిపై నమోదైన కేసును కొట్టివేయాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. న్యాయస్థానం ఆమె పిటిషన్​ను తిరస్కరించింది.
 

  • ఇసుకే ఆమెకు ఆహారం!

యూపీకి చెందిన కుష్మావతి దేవి అనే వృద్ధురాలు ఇసుకను ఆహారంగా(Sand eating lady) తీసుకుంటోంది. చాలా ఏళ్లుగా ఆమె ఇలా చేస్తున్నప్పటికీ.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతుండటం విశేషం. నిజానికి తన ఆరోగ్య రహస్యం ఇసుక తినడమేనని అంటోంది.

  • ఈటీవీ భారత్​ ఆఫీసులో సీఎం

కర్ణాటక బెంగళూరులోని ఈటీవీ భారత్​ కార్యాలయాన్ని సందర్శించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై(cm bommai visits etv bharat office). డిజిటల్​ మీడియాలో ఈటీవీ భారత్​కు మంచి భవిష్యత్తు ఉందని, అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు(etv bharat kannada).

  • 'శ్రీదేవి డ్రామా కంపెనీ'పై మాధవన్ ట్వీట్

ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్​టైన్​మెంట్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ కార్యక్రమంలోని ఓ అద్భుతమైన సింగింగ్​ వీడియోను ప్రముఖ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. భలే పాడారు ఎలా సాధ్యమైందంటూ ప్రశంసించారు.

  • శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​

తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవిచంద్రన్​ అశ్విన్​(50) ఉన్నారు.

15:52 November 25

టాప్​ న్యూస్​ @4PM

  •  'వారికి ఓటేయొద్దు'

తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతామని సంయక్త కిసాన్​ మోర్చా నేత రాకేశ్​ టికాయత్(rakesh tikait latest news)​.. స్పష్టం చేశారు. ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. 

  • 7 దశాబ్దాల తర్వాత  సాకారం

ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో(jewar airport news) ఒకటి కానున్న జెవార్​ ఎయిర్​పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు(pm modi news today live). 2024 సెప్టెంబర్​ నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.

  • ఆకాశంలో కవిత ఫ్లెక్సీ

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా కల్వకుంట్ల కవితకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్(para gliding wishes) ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు.

  •  'వారి గుర్తింపుపై కేంద్రం పునఃసమీక్ష'

నీట్​ రిజర్వేషన్ల విషయంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) (Ews category reservation in neet) వారిని గుర్తించడంపై పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై ఓ కమిటీ​ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.

  •  క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు

ఇండోనేషియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(pv sindhu enters quarter finals) క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించింది. జర్మనీ ప్లేయర్​ వొన్ని లిపై(Yvonne Li) 21-12, 21-18 తేడాతో గెలుపొందింది.

14:31 November 25

టాప్​ న్యూస్​ @3PM

  • ధరలపై పునరాలోచించాలి

సినిమా టిక్కెట్ల ధరపై చిరంజీవి స్పందించారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ బిల్లు ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తున్నానని తెలిపారు. అయితే టికెట్ల ధరలపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. 

  • కొనసాగుతున్న ఏకగ్రీవాల జోరు

స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కొక్కొటిగా అధికార తెరాస ఏకగ్రీవం చేసుకుంటోంది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిని తెరాస ఖాతాలో వేసుకుంది.

  •  ఎస్సై కావాల్సిన మహిళపై దారుణం

ఎస్సై ఉద్యోగం కోసం రాత పరీక్షకు హాజరై వస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఫేస్​బుక్​లో పరిచయమైన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

  • ఆ చిత్రంలో సామ్​కు ఛాన్స్​!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హాట్​ బ్యూటీ పూజా హెగ్డే.. క్రేజీ ప్రాజెక్టును వదులుకున్నట్లు సమాచారం. సూపర్​స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ (Mahesh Babu Trivikram Movie) కాంబోలో రానున్న చిత్రం నుంచి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె స్థానంలో హీరోయిన్​గా సమంత నటించనుందని తెలుస్తోంది.

  • పెవిలియన్​కు చేరిన టాప్ ఆర్డర్

న్యూజిలాండ్​తో కాన్పుర్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమ్​ఇండియా(IND vs NZ 1st test) ఆచితూచి ఆడుతోంది. టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

13:39 November 25

టాప్​ న్యూస్​ @2PM

  • రైతుసంఘాల మహాధర్నా

Farmers Associations Dharna at Indira park: హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాలు మహాధర్నాకు దిగాయి. సాగు చట్టాల రద్దును, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి పార్లమెంట్​లో ఆమోదించాలనే డిమాండ్​లతో ఆల్ ఇండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు.

  • రాష్ట్రానికి వర్షసూచన 

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(today weather report) వెల్లడించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ శ్రీలంక వైపునకు వెళ్లిపోయిందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

  • ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​

ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​బీర్ సింగ్ చాలా రోజుల తర్వాత నగరంలో ప్రత్యక్షమయ్యారు. బలవంతపు వసూళ్ల కేసులో విచారణ కోసం అధికారుల ఎదుట హాజరయ్యారు(parambir singh news).

  • రాజమౌళి కీలక వ్యాఖ్యలు 

ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్న ఆర్​ఆర్​ఆర్​లోని 'జనని' పాటను నవంబర్​ 26న విడుదల చేయనుంది చిత్రబృందం. అయితే ఆలోపే మీడియాకు ఆ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli RRR) కీలక వ్యాఖ్యలు చేశారు.

  • శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

12:46 November 25

టాప్​ న్యూస్​ @1PM

  • తెరాస ఖాతాలో మరో రెండు.. 

TRS Won Mahabubnagar MLC Seats : స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కొక్కొటిగా అధికార తెరాస ఏకగ్రీవం చేసుకుంటోంది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఐదింటిని తెరాస తన ఖాతాలో వేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు కూడా గులాబీ ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒకే ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది.

  • వరదల్లో 38 మంది గల్లంతు 

ఏపీని వరుణుడు వణికించాడు. వరద బీభత్సం సృష్టించాడు. వరుణుడి ప్రకోపానికి రాష్ట్రం అల్లకల్లోలం అయింది. వర్షాలు తగ్గి మూడ్రోజులవుతున్నా.. ప్రజలు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వాన విలయం సృష్టించింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఎందర్నో రోడ్డున పడేసింది. ఎంతో కష్టపడి కట్టుకున్న గూడును చెదరగొట్టింది. ఎంతోమందిని వారి కుటుంబాలకు దూరం చేసింది.

  • భారీగా గంజాయి పట్టివేత 

రాచకొండ పరిధిలో రూ.3 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి 1,820 కిలోల గంజాయి, లారీ, కారు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

  • అమ్ములపొదిలో ఐఎన్​ఎస్​ 'వేలా'యుధం!

భారత్‌ స్టెల్త్ స్కార్పీన్‌ శ్రేణి నాలుగో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వేలా (INS vela) విధుల్లోకి చేరింది. నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్ సింగ్ సమక్షంలో జలాల్లోకి ప్రవేశించింది. ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఐఎన్‌ఎస్ వేలా సొంతం. ఫ్రాన్స్‌ నావల్‌ గ్రూప్‌తో కలిసి ముంబయిలోని మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్‌ దీనిని తయారు చేశాయి.

  • మంత్రి సీడీ కేసులో కమిషనర్​కు చిక్కులు

బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా ఇతర అధికారులపై దర్యాప్తు జరపాలని కర్ణాటక కోర్టు ఆదేశించింది. భాజపా మాజీ మంత్రి సీడీ వ్యవహారం కేసులో వీరు ఎఫ్​ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని దాఖలైన పిటిషన్​ను విచారించి ఈ మేరకు తీర్పునిచ్చింది(karnataka minister cd case).

11:53 November 25

టాప్​న్యూస్​ @12PM

  • సభాపతికి కరోనా పాజిటివ్

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. నిన్న రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న స్పీకర్‌కు కరోనా వచ్చినట్లు తేలింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

  • కుటుంబమంతా దుర్మరణం

మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైహర్ (Maihar road accident​) ఠాణా పరిధిలోని జీత్​నగర్​ వద్ద ఓ కారును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

  • కోడలిని కడతేర్చిన మేనమామలు

ప్రేమించిందన్న కారణంతో 16 ఏళ్ల యువతి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య(up killing news) చేసిన ఘటన వెలుగుచూసింది. మేనమామలే ఈ ఘాతూకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో యువతి మేనమామ సహా.. మృతురాలి ప్రియుడు సిరాజ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

  • కలెక్టర్​ తిట్టారని మొక్కలు పీకేశారు

Vikarabad Municipality news today : అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. పనులు మెరుగుపరచడానికి సిబ్బంది ఆలోచిస్తారు. కానీ.. వికారాబాద్ పురపాలక సిబ్బంది మాత్రం.. దానికి భిన్నంగా వ్యవహరించారు. నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలను చూసి ఎందుకు నాటలేదని కలెక్టర్ ప్రశ్నిస్తే.. ఆ మొక్కలు నాటడానికి బదులు వాటిని ఏకంగా బయట పడేశారు.

  • ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్

వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL 2022)​ నిర్వహణ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవంబర్ 30 నాటికి ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఫ్రాంఛైజీలకు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిసింది. దీంతో ధోనీని మరో మూడేళ్ల పాటు రిటైన్ చేసుకొనే ఆలోచనలో సీఎస్కే(CSK team 2022) ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

10:46 November 25

టాప్​న్యూస్​ @11AM

  • తగ్గిన బంగారం ధర -ఎంతంటే?

బంగారం ధర (Gold price Today) తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.50 తగ్గింది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • ఆ పోస్టుకు మహిళలూ అర్హులే

 జైళ్ల శాఖలో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌లు.. సూపరింటెండెంట్‌ పదోన్నతికి అర్హులేనని హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కేవలం పురుషులకు మాత్రమే వర్తించేలా ఉన్న జీవోలోని నిబంధనను కొట్టివేసింది. పదోన్నతి కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వరంగల్‌ మహిళా జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.వెంకటలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేయగా.. ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • పెచ్చరిల్లుతున్న పోలీసు హింస

అత్యాధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించి అనేక కేసుల చిక్కుముడులను ఛేదిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో తమ అధీనంలో ఉన్న నేరస్తులను విచారించే క్రమంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు విచారణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులపై థర్డ్‌ డిగ్రీ (Third degree In lockup) ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 

  • ఫ్రాంఛైజీపై కన్నేసిన రిలయన్స్

ఐపీఎల్​లో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టు ముంబయి ఇండియన్స్​. ఈ జట్టుకు యాజమానిగా ఉన్న రిలయన్స్​ తమ క్రికెట్ సామాజ్రాన్ని విస్తరించే పనిలో పడింది. తాజాగా యూఏఈ టీ20లీగ్​లో(UAE t20 league) ఓ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

  • సముద్రం మధ్యలో పూజా హొయలు

కాస్త విరామం దొరికితే విహార యాత్రలకు వెళ్లిపోతుంటారు సినీ తారలు. ఇటీవలే మాల్దీవులకు వెళ్లిన పూజా హెగ్డే.. అక్కడ ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో వీడియో రూపంలో పంచుకుంది. చాలా రొమాంటిక్​గా ఉన్న ఈ వీడియోకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోతున్నారు!

10:01 November 25

టాప్​న్యూస్​ @10AM

  • కుమార్తెను గర్భవతి చేసిన తండ్రి

కస్తూర్బాలో చదువుకుంటున్న ఆ బాలిక లాక్​డౌన్ కారణంగా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లేవారు. తండ్రి మాత్రం మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవాడు. అలా ఒకరోజు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన అతను.. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. 

  • కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే.. కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు పడిపోయాయి.

  • బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

IND vs NZ Test Series 2021:భారత్, న్యూజిలాండ్​ మధ్య టెస్టు సిరీస్​కు వేళైంది. తొలి టెస్టులో భాగంగా టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో స్పిన్నే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగుతున్నాయి ఇరుజట్లు.

  • ఓఆర్​ఆర్​పై పొగమంచు

Fog at ORR Hyderabad : హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అబ్దుల్లాపూర్‌మెంట్‌ నుంచి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఉండడం వల్ల నెమ్మదిగా వెళ్తున్నారు.

  • బిట్​కాయిన్​పై 'బేర్' పంజా..

దేశీయంగా క్రిప్టో కరెన్సీ(cryptocurrency news) విలువ బుధవారం అమాంతంగా పతనమైంది. ఈ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ యత్నాల ఫలితంగా ప్రముఖ ఊహాజనిత కరెన్సీలైన బిట్ కాయిన్, ఎథేరియమ్ వంటి కాయిన్ల విలువ కుప్పకూలిపోయింది.

08:47 November 25

టాప్​న్యూస్​ @9AM

  • ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐసోలేషన్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడం వల్ల రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. 

  • ప్రతి పల్లెలో దవాఖానా

Minister Harish Rao Interview : రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 4 వేల గ్రామాల్లో దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్నింటిలోనూ ఎంబీబీఎస్‌ వైద్యులు సేవలందిస్తారని వెల్లడించారు. జిల్లాకో రేడియాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.5 లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి హరీశ్ రావుతో ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి...

  • మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్​

కాంగ్రెస్​ పార్టీకి (Meghalaya congress) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో (Meghalaya politics) ఆ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. ఈ చేరికతో రాత్రికి రాత్రే టీఎంసీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించినట్లయింది. 2023లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

  • అలలపై అందాల నగరం!

సముద్రమట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదల వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకుగాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్‌ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని(floating city South Korea) నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. 2025 నాటికి పూర్తి చేయనున్నారు.

  • ఆమిర్‌ఖాన్‌ తర్వాత ఆ పని చేసింది నేనే

ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయికి రావడం తన అదృష్టమని చెప్తున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu Movies). 'హృదయ కాలేయం' నుంచి కామెడీ సినిమాలతో అలరిస్తున్న సంపూ.. 'క్యాలీఫ్లవర్​' (Sampoornesh Babu New Movie) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు చెప్పిన విశేషాలు..


 

07:52 November 25

టాప్​న్యూస్​ @8AM

  • దిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం

KCR Delhi Tour Ends: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు, విభజన చట్టంలో హామీలు, నీటి వాటా కేటాయింపుల్లో స్పష్టత తదితర విషయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ వెళ్లారు. కానీ ప్రధానిని కలిసేందుకు వీలు లేకపోవడంతో దిల్లీ పర్యటనను (CM KCR Delhi Tour) ముగించుకుని హైదరాబాద్​ వచ్చేశారు.

  • మహాధర్నాకు రాకేశ్‌ టికాయత్

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నేడు రైతు సంఘాలు మహాధర్నా చేయనున్నాయి. సాగుచట్టాల రద్దును, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి పార్లమెంట్​లో ఆమోదించాలనే డిమాండ్లతో ఆల్ ఇండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్ పాల్గొననున్నారు.

  • సంపన్నుడిగా గౌతమ్ అదానీ

రోజుకు రూ.1000 కోట్లు సంపాదిస్తే.. అలా ఏడాదంతా కనకవర్షం కురిస్తే.. అది కూడా ఒక్క వ్యక్తి సాధిస్తే, ఆయనే అదానీ అవుతారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా గౌతమ్‌ అదానీ (Gautam Adani Net Worth) నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ వెల్లడిస్తోంది.

  • భారత కుర్రాళ్లకు షాక్‌

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో(Junior Hockey World Cup 2021) భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫ్రాన్స్ చేతిలో భారత్ 4-5 తేడాతో ఓటమిపాలైంది. భారత్‌ తరఫున సంజయ్‌ సాధించిన హ్యాట్రిక్‌ గోల్స్‌ వృథా అయ్యాయి.

  • 'దృశ్యం2' థ్రిల్​ చేసిందా?

Drushyam 2 Telugu Review: 'దృశ్యం' భారీ విజయంతో దానికి సీక్వెల్​గా తీసిన 'దృశ్యం2'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్​లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సారీ కూడా ఈ సినిమా ప్రేక్షకుడిని ఉత్కంఠకు లోనుచేసిందా? లేదా? తెలుసుకోండి.

06:42 November 25

టాప్​న్యూస్​ @7AM

  • మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

సచివాలయ ప్రాంగణంలో మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి ఇప్పటికే నమూనా ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేయనున్నారు.

  • మంటగలుస్తున్న ఆత్మగౌరవం

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా... స్వచ్ఛభారత్‌లో తెలంగాణ దూసుకుపోతున్నా... అక్కడ మాత్రం శౌచాలయాలు (Toilet Problems) లేక మహిళల ఆత్మగౌరవం మంటగలుస్తోంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకూ బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. సమస్య గురించి తెలిసినా పరిష్కారం చూపడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారు.

  • యాచకురాలి గొప్ప మనసు

దాతలు భిక్షం వేసిన ప్రతీ రూపాయిని కూడబెట్టుకుంది ఆమె. తన అన్నపానీయాలకు పోగా మిగిలిన సొమ్మును పెద్దమొత్తంగా దాచింది. ఒక్కొక్క రూపాయిని నోట్లుగా మార్చింది. దానితో ఆమె అవసరాలను తీర్చుకోవాలి అనుకోలేదు. భిక్షం ఎత్తుకోవడం వృత్తి అయినా.. మనసు గొప్పదని రుజువు చేసుకుంది. తాను రోజు బిక్షం ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు రూ. 20 వేలు దానంగా ఇచ్చింది ఆ వృద్ధురాలు. 

  • ఈ జెర్సీ ధరిస్తే ప్రపంచకప్ మనదే

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్ విజేతగా నిలవాలంటే పసుపు రంగు జెర్సీ ధరించాలంటూ ఫన్నీ మీమ్​ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. అసలు ఈ ఎల్లో జెర్సీ కథేంటంటే?

  • విక్కీ-కత్రిన రిజిస్టర్ మ్యారేజ్

బాలీవుడ్​ ప్రేమజంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్​ వచ్చే నెలలో రాజస్థాన్​లో పెళ్లి చేసుకోన్నున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అంతకంటే ముందే వచ్చే వారంలో ముంబయిలో రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకోనున్నట్లు ఈ జంటకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. 

05:45 November 25

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • రెండు చోట్ల మినహా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు (Mlc Elections) రసవత్తరంగా మారాయి. రెండు మినహా మిగతా జిల్లాల్లో పోలింగ్ అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

  • సాగునీరే ప్రధాన లక్ష్యం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Rangareddy Lift Irrigation Scheam) పనుల్లో అక్రమ మైనింగ్‌ జరగలేదని... పర్యావరణ ఉల్లంఘన మాత్రమే చోటు చేసుకుందని... నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం తాగునీటికే అన్న హామీని ఉల్లంఘించి సాగునీరే ప్రధాన లక్ష్యంగా పనులు చేపట్టారని తెలిపింది. 

  • అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌

దుబాయ్‌.. పాకిస్థాన్‌ దేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కొన్ని అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై కేంద్ర నిఘావర్గాలు దృష్టి కేంద్రీకరించాయి.

  • అన్నదాతల అష్టకష్టాలు

వడ్లు విక్రయించేందుకు అన్నదాతలు అష్టకష్టాలు (Farmers Problems) పడుతున్నారు. పంటకోసి నెల రోజులు దాటినా ధాన్యం కొనట్లేదని వాపోతున్నారు. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి ఎప్పుడెప్పుడు కొంటారా అని కళ్లకు వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. 

  • అమలు కాని మధ్యాహ్న భోజన పథకం

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meals) సక్రమంగా అమలు కావడంలేదు. పెరిగిన కూరగాయల ధరలకుతోడు, మూణ్నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడం వల్ల ఏజెన్సీలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వారికి అందించే వేతనం తక్కువ కావడం వల్ల పని వదిలేసి కూలీకి వెళ్తున్నారు.

  • స్థానికల సంస్థల పోరుకు సర్వం సిద్ధం

త్రిపురలో నేడు 20 స్థానిక సంస్థలకు ఎన్నికలు (Tripura Civic Polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

  • జాలరిని లక్షాధికారి

కర్ణాటక జాలరికి అరుదైన 'ఘోల్ ఫిష్​' వలలో చిక్కింది. మాల్పే ఓడరేవులో దీని ధర రూ.1.8 లక్షలు పలికింది.

  • వలసదారుల పడవ బోల్తా

వలసదారుల పడవ బోల్తా కొట్టిన ఘటనలో 31 మంది (boat capsized) దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని అరెస్ట్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  • శివశంకర్​ మాస్టర్​ ఆరోగ్య పరిస్థితి విషమం

కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • బలంగా కివీస్.. కుర్రాళ్లతో భారత్!

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​(IND vs NZ t20)ను క్లీన్​స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్​లో(IND vs NZ 1st Test) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 

Last Updated : Nov 25, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details