తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS

By

Published : Nov 18, 2021, 6:34 AM IST

Updated : Nov 18, 2021, 10:11 PM IST

22:02 November 18

టాప్​​ న్యూస్​@ 10PM

  • వారికి గౌరవ వేతనాలు పెంపు

మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మున్సిపాలిటీ పాలకవర్గం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

  • ' కేంద్రం భయపెడితే కేసీఆర్ భయపడతాడా..? '

పోరాటం చేయడంలో దేశంలో తెరాస(TRS party)ను మించిన పార్టీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ఉద్ఘాటించారు. ఆ పోరాటం రైతుల కోసమైతే అసలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 

  • ఆగని చైనా దురాక్రమణలు.. !

అరుణాచ‌ల్​ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో చైనా ఓ గ్రామం(China village in arunachal) నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 భవనాలు నిర్మించిన‌ట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇటీవ‌ల అరుణాచ‌ల్‌లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీట‌ర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ఎన్‌క్లేవ్‌ను నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

  • బాలకృష్ణతో కొరటాల మల్టీస్టారర్‌.. ?

బాలకృష్ణతో ఓ మల్టీస్టారర్​ సినిమా చేయాలని దర్శకుడు కొరటాల శివ ఓ కథ సిద్ధం చేశారట! రెండో హీరోగా మహేశ్​బాబు నటిస్తారని టాక్​ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  •  పుజారాకు  ఆ క్రికెటర్ క్షమాపణలు 

జాతి విద్వేషపూరిత వ్యాఖ్యల ఉదంతంలో టీమ్​ఇండియా క్రికెటర్​​ పుజారాకు (Pujara News) క్షమాపణలు చెప్పాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జాక్ బ్రూక్స్ (Jack Brooks). పుజారాను స్టీవ్​ అని పిలవడం అమర్యాదకరమని తాను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు.

20:49 November 18

టాప్​​ న్యూస్​@ 9PM

  • ' కేంద్రం భయపెడితే కేసీఆర్ భయపడతాడా..? '

పోరాటం చేయడంలో దేశంలో తెరాస(TRS party)ను మించిన పార్టీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ఉద్ఘాటించారు. ఆ పోరాటం రైతుల కోసమైతే అసలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 

  • తిరుమలలో భారీ వర్షం

ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.

  • తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. 

2019 ఛత్తీస్​గఢ్​ బస్తర్ ఎన్​కౌంటర్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు(NIA raids in Telugu states) ముగిశాయి. మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో ఎన్ఐఏ పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 14 చోట్ల సోదాలు జరిగాయి.  

  • వాటిని భారత్​లో తయారు చేయండి

కరోనా కాలంలో ప్రపంచ దేశాలకు భారీ స్థాయిలో ఔషధాలు, టీకాలు అందించడం ద్వారా భారత్.. 'ఫార్మసీ ఆఫ్​ ద వరల్డ్​'గా గుర్తింపు దక్కించుకుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫార్మా రంగంలో తొలి గ్లోబల్​ ఇన్నోవేటివ్​ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

  • 'ఆర్​ఆర్​ఆర్'​ కౌంట్​డౌన్​..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా మరో 50రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్​ చేసింది చిత్రబృందం.

19:57 November 18

టాప్​​ న్యూస్​@ 8PM

  • నేడు, రేపు  భారీ వర్షాలు..!

రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది (Rain Alert for telangana) . నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ప్రకటించింది (weather updates).

  • 'కొత్త పెట్టుబడులకు సరైన అవకాశం'

కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కొవిడ్​ అనంతర పరిణామాలను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని.. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థ ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

  •  కారు ఆపిన పోలీస్ వేలు కట్!

నిబంధనలు ఉల్లంఘించి సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తున్నందుకు పోలీసులు (attack on delhi police) అడ్డుకున్నారని.. ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగాడు. ఓ పోలీసుపై దాడి (Attack on Police today) చేసి.. గాయపరిచాడు.

  • తెలుగులో 'స్క్విడ్‌గేమ్‌'.. ?

నెట్‌ఫ్లిక్స్‌లో(squid game characters) విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌'(squid game netflix review). ఇప్పుడీ సిరీస్​ను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డబ్‌ చేసింది నెట్​ఫ్లిక్స్​. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

  • ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం

భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెను (Prakash Padukone Badminton) మరో అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది (BWF News) ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య.

18:56 November 18

టాప్​​ న్యూస్​@ 7PM

  • తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమల (Rains in tirumala) కనుమ దారిలో కొండచరియలు పడ్డాయి. అప్రమత్తమైన తితిదే (TTD) అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని మూసివేసింది.

  •  త్వరలో శంకుస్థాపన

హైదరాబాద్‌లో కొత్తగా మరో 4 ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(harish rao) తెలిపారు. సీఎస్ఆర్ పథకం కింద హుందాయి సంస్థ (Hyundai company) అందజేసిన ఏడు అంబులెన్సులను హైదరాబాద్​ కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త ఆస్పత్రులకు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని హరీశ్‌ రావు వెల్లడించారు.

  • కుమార్తె కేసులో తల్లికి  జైలు శిక్ష

డబ్బు కోసం కూతురిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన తల్లికి ప్రత్యేక కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను మద్రాస్​ హైకోర్టు సమర్థించింది. నిందితురాలికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

  • సైనిక చర్చల్లో  కీలక నిర్ణయం!

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై(India China border dispute) చైనా సైన్యంతో చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ (WMCC India China) తెలిపింది

  •  మూడో స్థానంలో అతడే ఆడాలి

సూర్యకుమార్​ యాదవ్​ను మూడో స్థానంలో ఆడించడం టీమ్‌ఇండియాకు కలిసివస్తుందని అన్నాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. తిరిగి జట్టులోకి వచ్చినా అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని సూచించాడు.

17:49 November 18

టాప్​​ న్యూస్​@ 6PM

  • 'అందుకే బయటికొచ్చారు'

రైతులు సన్న వడ్లు వేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పినా సీఎం కేసీఆర్.. ఇప్పుడేందుకు కొనడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన ఏకపక్ష నిర్ణయాలతో రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. రైతు సంఘాల నేతలను, మిల్లర్ల సూచనలను పట్టించుకోలేదని ఆరోపించారు.

  • రండి.. భారత్​లో తయారు చేయండి

ఫార్మా రంగానికి సంబంధించి భారత్​లో ఆవిష్కరణలు చేయాలని, దేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఫార్మా రంగంలో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధిలో ఫార్మా రంగానిది కీలక పాత్రని అన్నారు. తొలి గ్లోబల్​ ఇన్నోవేటివ్​ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఆ ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నై(chennai rain today) సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంత జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ. పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

  • 'ఆ విమానాలు ఇప్పట్లో కష్టమే!'

అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు (Normal International flights resume) ప్రయత్నిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అయితే, ఇప్పట్లో ఇది సాధారణ స్థితికి (normal international flight news) చేరే అవకాశాలు లేవని సంకేతాలిచ్చారు. పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

  • వివాహ బంధంలోకి  హీరోయిన్‌

నటి శ్రద్ధా ఆర్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీకి చెందిన నావికదళ అధికారి రాహుల్‌ శర్మను ఆమె పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు శ్రద్ధా.

16:53 November 18

టాప్​​ న్యూస్​@ 5PM

  •  ఆయన రాజీనామాపై పిల్ 

వెంకట్రామిరెడ్డి రాజీనామాను (Venkatramireddy) ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వ్యాజ్యం దాఖలు చేశారు

  • ' ఇక కల్లాల్లోకి కాంగ్రెస్ '

తెరాస, భాజపా నాటకలాడుతూ ధాన్యం కొనకుండా రైతుల మోసగిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (tpcc president revanth reddy)విమర్శించారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద కార్యాచరణ ఏంటో సీఎం చెప్పాలన్న రేవంత్‌... ధైర్యముంటే పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని డిమాండ్‌ చేశారు.

  • 'అవి అధికార దుర్వినియోగానికి నిదర్శనం'

కేంద్ర దర్యాప్తు సంస్థల డైరెక్టర్ల పదవీ కాలంపై ఇటీవల కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​లను (Randeep Surjewala News) సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సుర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ ఆర్డినెన్స్​లు.. అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించారు.

  • నలుగురిపై రేప్.. అయినా జైలుశిక్ష లేదు!

నలుగురు బాలికలపై అత్యాచారం చేసి, దోషిగా తేలిన ఓ యువకుడు ఎలాంటి జైలు శిక్ష లేకుండానే బయటపడ్డాడు. దోషికి ఎనిమిదేళ్ల ప్రొబేషన్ విధించిన కోర్టు.. జైలులో ఉండాల్సిన అవసరం లేదని తేల్చింది. అసలు ఏం జరిగిందంటే..

  •  తెలుగమ్మాయికి స్వర్ణం

ఆసియా ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో పసిడి పతకం కైవసం చేసుకుంది భారత ఆర్చర్ జ్యోతి సురేఖ. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్​ యూహ్యూన్ పై(Yoohyun) గెలుపొందింది ఈ మెడల్​ను అందుకుంది.

15:54 November 18

టాప్​​ న్యూస్​@ 4PM

  • ' కేంద్రం భయపెడితే కేసీఆర్ భయపడతాడా..? '

పోరాటం చేయడంలో దేశంలో తెరాస(TRS party)ను మించిన పార్టీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ఉద్ఘాటించారు. ఆ పోరాటం రైతుల కోసమైతే అసలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 

  •  గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన తెరాస నేతలు

వరి సాగు, వడ్లు కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద ముఖ్యమంత్రి ధర్నా అనంతరం తెరాస నేతలు కె.కేశవరావు, మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్​భవన్​ వెళ్లారు

  •  సేకరణ ముగిసింది.. ఇక కొత్తగా తీసుకోం

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం పార్​ బాయిల్డ్​ బియ్యం తీసుకోదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ (Central Food and Consumer Affairs)తెలిపింది. 

  • రవికి సూపర్​పవర్​.. సన్నీ అసహనం

బిగ్​బాస్​ హౌస్​లో(nagarjuna bigboss 5) కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరుగుతున్న 'నీ ఇల్లు బంగారం కాను' టాస్క్‌ ఉత్కంఠంగా కొనసాగుతోంది.

  •  'కెప్టెన్​గా అరుదైన తప్పిదం '

న్యూజిలాండ్​తో (India Vs New Zealand) జరిగిన మ్యాచ్​లో కెప్టెన్​గా తొలిసారి పూర్తి స్థాయి బాధ్యతలు అందుకున్న రోహిత్​ శర్మ.. జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​(Rohit Sharma News) ఓ అరుదైన తప్పిదం చేశాడని అన్నాడు వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.

14:42 November 18

టాప్​​ న్యూస్​@ 3PM

  •  'మా ఓపికకు ఓ హద్దుంటుంది..! '

పోరాటం చేయడంలో దేశంలో తెరాస(TRS party)ను మించిన పార్టీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ఉద్ఘాటించారు. ఆ పోరాటం రైతుల కోసమైతే అసలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 

  • 'ఏళ్లు గడుస్తున్నా అందట్లేదు'

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాలకు ఎనలేని ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు... సింగిల్‌ విండో పద్ధతిలో(single window system) అనుమతులివ్వడంతోపాటు.... పెట్టుబడి రాయితీలు (Subsidies to Industries) కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నాయి. ప్రకటనలు బాగానే ఉన్నా... రాయితీలు మాత్రం రావడం లేదన్న నిరుత్సాహం ఆయా వర్గాల్లో కనిపిస్తోంది.

  • 'అలాంటి వారికే బ్యాంకులు మద్దతివ్వాలి'

ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటే.. అందుకు కారణం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలేనని ప్రధాని మోదీ అన్నారు(pm modi latest news). సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతుగా నిలవాలని సూచించారు(modi news today).

  • ఆ సినిమాలో మెగాస్టార్ సోదరిగా ఎవరంటే..!

'సైరా'లో మెగాస్టార్ చిరు(chiranjeevi movies) సరసన హీరోయిన్​గా చేసిన నయన్(nayanthara movie list).. ఇప్పుడు సోదరిగా నటిస్తోంది. ఈ విషయం గురువారం రిలీజ్ చేసిన ఓ పోస్టర్​తో ఖరారైంది.

  • ఆ టీ20పై హైకోర్టులో పిల్

టీమ్​ఇండియా-కివీస్​ రెండో టీ20ని(ind vs nz t20) వాయిదా వేయాలని ఝార్ఖండ్​ హైకోర్టులో ఓ న్యాయవాది పిల్ వేశారు. ఒకవేళ అది కుదరకపోతే 50 శాతం వీక్షకులనే అనుమతించేలా చూడాలని కోరారు.

13:48 November 18

టాప్​టెన్​ న్యూస్​@2PM

  • వడ్లు కొంటారా.. కొనరా..?: కేసీఆర్

సాఫ్‌ సీదా ముచ్చట.... వడ్లు కొంటారా.. కొనరా..? అని సీఎం కేసీఆర్ తెరాస మహాధర్నాలో కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని పేర్కొన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా అనే అడుగుతున్నారని వెల్లడించారు. కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోందని ఆరోపించారు. 

  • బ్యాంకులు మద్దతివ్వాలి

ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటే.. అందుకు కారణం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలేనని మోదీ అన్నారు. సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతుగా నిలవాలని సూచించారు.

  • రైతులతో ఆడుకుంటున్నాయి

ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు పబ్లిక్ గార్డెన్​ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

  • టీ20 వాయిదా వేయాలని పిల్

భారత్-న్యూజిలాండ్​ మధ్య జరగాల్సిన రెండో టీ20ని(ind vs nz t20) వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్​.. ఝార్ఖండ్​ హైకోర్టులో పిల్​ వేశారు. మ్యాచ్​ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని అన్నారు.

  • ప్రీతి జింటాకు కవలపిల్లలు

12:38 November 18

టాప్​టెన్​ న్యూస్​@1PM

  • అవసరమైతే దిల్లీకి

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో చేపట్టిన మహాధర్నాలో స్వయంగా పాల్గొన్న ముఖ్యమంత్రి.... కేంద్రం వైఖరిపై మండిపడ్డారు.

  • అందుకే ఈ మహాధర్నా

మంత్రి నిరంజన్​రెడ్డి(Minister Niranjan reddy latest news) కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో (trs maha dharna at Indira park ) తెరాస చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న మంత్రి... రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ మహాధర్నా అని పేర్కొన్నారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

  • మళ్లీ ఎన్నికైన భారత్​

ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విద్యా విభాగం యునెస్కో (UNESCO India 2021) ఎగ్జిక్యూటివ్​ బోర్డులో భారత్​ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో (UNESCO executive board elections 2021) 164 ఓట్ల తేడాతో విజయం సాధించింది భారత్​.

  • పేటీఎం షేర్లు డీలా

దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా (Paytm ipo) స్టాక్​మార్కెట్లో లిస్ట్​ అయిన పేటీఎం తొలిరోజే ఒడుదొడుకులకు లోనైంది. గురువారమే బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టింగ్​ అయిన ఈ సంస్థ.. ఇష్యూ ధర (Paytm listing price) కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్​ను మొదలుపెట్టింది.

  • భయపెట్టేలా చూసిన క్రికెటర్

భారత్​, న్యూజిలాండ్​ టీ20 సిరీస్​ తొలి మ్యాచ్​లో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. కివీస్​ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో 18వ ఓవర్లో.. దీపక్​ చాహర్ చూసిన చూపు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే ఆ సీరియస్​ లుక్​కు దీపక్​ రూ. లక్ష గెలుచుకోవడం విశేషం.

11:52 November 18

టాప్​టెన్​ న్యూస్​@12NOON

  • ఆరంభం మాత్రమే.. అంతం కాదు

వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ తెరాస మహా ధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్​, మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు పాల్గొన్నారు.

  • అలా తాకడం లైంగిక వేధింపే

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

  • పెరిగిన కరోనా కొత్త కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus update) బుధవారంతో పోలిస్తే కాస్త పెరిగింది. తాజాగా 11,919 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. మహమ్మారి​ ధాటికి మరో 470 మంది మృతి చెందారు. తాజాగా 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • నా భార్యకు కానుక ఇచ్చాడు

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​లో(IND vs NZ T20) తొలి మ్యాచ్​లో సూపర్​ ఇన్నింగ్స్​ ఆడాడు టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(surya kumar yadav news). అయితే, సూర్య ఇచ్చిన ఓ క్యాచ్‌ను బౌల్ట్‌ జారవిడిచాడు. దీనిపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన సూర్య.. తన భార్య పుట్టినరోజున బౌల్ట్‌ ఇచ్చిన కానుక అది (క్యాచ్‌ వదలడం) అని సరదాగా వ్యాఖ్యానించాడు.

  • కృతిశెట్టి 'నాగలక్ష్మి' ఫస్ట్​లుక్

*కింగ్ నాగార్జున 'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మి ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఈ పాత్రలో నటిస్తున్న కృతిశెట్టి.. తన అందంతో అలరిస్తోంది. ఈమెకు జోడీగా నాగచైతన్య బంగార్రాజుగా కనిపించనున్నారు. త్వరలో తన ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు.

10:46 November 18

టాప్​టెన్​ న్యూస్​@11AM

  • తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్​ఐఏ(NIA raids in Telugu states) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో 14 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్ల (NIA raids in ex Naxalites house)లో తెల్లవారుజాము 5 గంటల నుంచే సోదాలు చేశారు.

  • నరేంద్ర మోదీ కీలక ప్రసంగం

సిడ్నీ డైలాగ్​లో వర్చువల్​గా హాజరై కీలక ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాంకేతిక రంగంలో భారత్​ అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ తప్పుడుమార్గంలో వెళ్లేవారి చేతుల్లోకి రాకుండా చాడాలని ప్రజాస్వామ్య దేశాలకు పిలుపునిచ్చారు.

  • స్వల్పంగా తగ్గిన పసిడి ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

  • సిరాజ్​ను కొట్టిన రోహిత్ శర్మ!

టీ20 సిరీస్​లో భాగంగా న్యూజిలాండ్​తో(IND vs NZ T20 Series) తొలి మ్యాచ్​లో ఓ అనుకోని సంఘటన జరిగింది. టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేసర్ సిరాజ్​ను కొట్టాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

  • 'శ్యామ్​సింగరాయ్' టీజర్

నాని 'శ్యామ్​సింగరాయ్' టీజర్ వచ్చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇందులోని నాని రెట్రో లుక్​ ఫ్యాన్స్​ పండగ చేసుకునేలా ఉంది! 'స్త్రీ ఎవడికీ దాసి కాదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబద్దార్' అంటూ బెంగాలీలో నాని చెప్పిన డైలాగ్.. ఆకట్టుకుంటోంది.

09:52 November 18

టాప్​టెన్​ న్యూస్​@10AM

  •  భాగస్వామ్యం.. ప్రపంచానికి మేలు

సిడ్నీ డైలాగ్​లో వర్చువల్​గా హాజరై కీలక ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాంకేతిక రంగంలో భారత్​ అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. డిజిటల్​ వ్యవస్థ రాజకీయాలు, ఆర్థికం, సమాజాన్ని పునర్నిర్వచించిందన్నారు. భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. భారత్​లో ఐదు కీలక మార్పులు జరిగాయని చెప్పారు.

  • గాంధీ, ఉస్మానియాల్లో ఆ సేవలు బంద్‌

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో గత కొంతకాలంగా క్యాథ్‌ల్యాబ్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల పంట పండుతోంది. ఆసుపత్రుల వద్ద దళారులు తిష్ఠ వేసి మరీ పేద రోగులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • వార్నర్‌కే 'ప్లేయర్ ఆఫ్​ ది టోర్నీ'

టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్​కు ప్లేయర్ ఆఫ్​ ది టోర్నమెంట్ రావడంపై కొందరు పాక్​ మాజీలు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇచ్చాడు పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్(wasim akram on babar azam). మ్యాన్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌ ఎంపిక కోసం అత్యధిక పరుగులనే కాకుండా ఇతర అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుందని చెప్పుకొచ్చాడు.

  • గ్రూప్​-బిలో టీమ్​ఇండియా

అండర్-19 ప్రపంచకప్(Under 19 Worldcup 2022)​ షెడ్యూల్​ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ పోటీలకు అతిథ్యం ఇవ్వనుంది వెస్టిండీస్.

  • చలికాలంలో క్యారట్​ హల్వా తింటే..

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే హల్వా (Gajar ka halwa recipe) చేసుకుంటాం.. సాధారణ హల్వా బోర్‌ కొట్టినా క్యారట్‌ హల్వాకే (Carrot halwa recipe) ఓటేస్తుంటారు చాలామంది. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను(Carrot halwa with jaggery) తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇలాంటి యమ్మీ స్వీట్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు. క్యారట్‌ హల్వా తినడం వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలేంటో (Carrot halwa benefits) తెలుసుకోండి..

09:02 November 18

టాప్​టెన్​ న్యూస్​@9AM

  • ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్

కరడుగట్టిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు (Jaish e mohammed news) సహకరిస్తున్న ముగ్గురు అనుచరులను జమ్ముకశ్మీర్​ (Kashmir terror news) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్​ నుంచి దక్షిణ కశ్మీర్​కు డబ్బు తరలిస్తుండగా.. సిధ్రా బ్రిడ్జి వద్ద పట్టుబడ్డారు నిందితులు.

  • గాంధీ, ఉస్మానియాల్లో ఆ సేవలు బంద్‌

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో గత కొంతకాలంగా క్యాథ్‌ల్యాబ్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల పంట పండుతోంది. ఆసుపత్రుల వద్ద దళారులు తిష్ఠ వేసి మరీ పేద రోగులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • విమాన టికెట్లు మరింత చౌక

లగేజీ, చెక్‌ఇన్‌ బ్యాగేజీ లేని ప్రయాణికులకు టికెట్​ ధరలో రాయితీ లభించనుంది. ఈ తరహా ప్రయాణికులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించవచ్చని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో.. విమానయాన సంస్థలు త్వరలోనే ఈ పద్దతిని అమలు చేయనున్నాయి.

  • టెన్నిస్ ప్లేయర్ మాయం

ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిపై లైంగిక హింస ఆరోపణలు చేసిన తర్వాత చైనాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి(peng shuai missing) కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో జపాన్‌ టెన్నిస్‌ తార నవోమి ఒసాక(naomi osaka news) కూడా పెంగ్‌ ఎక్కడుందని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేసింది.

  • డిసెంబరు రేసులో మరో నందమూరి హీరో!

టాలీవుడ్​ డిసెంబరు రేసులోకి మరో సినిమా వచ్చింది. నందమూరి కల్యాణ్​రామ్​ కూడా తన కొత్త సినిమా 'బింబిసార'తో బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు! ప్రస్తుతం ఈ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

07:23 November 18

టాప్​టెన్​ న్యూస్​@8AM

  • పెరగని పాల ఉత్పత్తి

రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది (milk shortage). చలికాలం వచ్చినా.. పాల ఉత్పత్తి పెరగలేదు. రైతుల నుంచి ఆశించినంత పాల సేకరణ లేకపోవడంతో విజయ డెయిరీ (Vijaya dairy) సైతం... కర్ణాటక (Karnataka)నుంచే లక్ష లీటర్లు పాలను నిత్యం కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 20 లక్షల లీటర్ల కొనుగోలు చేస్తోంది.

  • పర్యావరణానికి పెనుముప్పు

రెండు వరుసలుగా ఉన్న హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి(Hyderabad Srisailam Road Expansion)ని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ(National Highway Authority of India)) రంగం సిద్ధం చేస్తోంది. మధ్యలో ఉన్న అటవీభూములను బదలాయింపునకు దరఖాస్తు చేయగా.. వన్యప్రాణులు, పర్యావరణ పరంగా అది సరికాదని తిరస్కరిస్తూ అమ్రాబాద్ ఎఫ్​డీవో అటవీశాఖకు నివేదిక అందజేశారు.

  • దహనానికి పరిష్కారమేది?

దిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం (Delhi Pollution News) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో పలువురు రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుండటం కొంతవరకు వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. అయినా పరిస్థితి మెరుగుపడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • మసాలాకు బదులు మట్టి

కూరల్లో మట్టి వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును మరి ఓ చోట కూరల్లో మసాలాకు బదులు మట్టి వాడుతుంటారు. వంటలో మట్టిని వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట. ఇదెక్కడంటే?

  • ఆ ఛాన్స్ రావడం చాలా అరుదు

'బంటీ ఔర్ బబ్లీ 2' రిలీజ్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఒకప్పుడు పోషించిన పాత్రలో మళ్లీ నటించడం తనకు దక్కిన అదృష్టమని తెలిపింది.

06:54 November 18

టాప్​టెన్​ న్యూస్​@7AM

  • సమస్య పరిష్కారానికి దరఖాస్తులు

పోడు భూముల(Podu land issue) సమస్య పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ దరఖాస్తులు(Podu land registration) వస్తున్నాయి. ఈనెల 8 నుంచి మొదలైన దరఖాస్తు పంపిణీ, స్వీకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అటవీహక్కుల చట్టం(forest rights act 2005) 2005 నిబంధనలకు లోబడి సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

  • 'సర్దార్' బిరుదు ఎలా వచ్చిందంటే?

భారత స్వాతంత్య్రోద్యమంలోని కీలక ఘట్టాల్లో తప్పక వినిపించే పేరు 'బర్దోలి'. ప్రలోభాలకు లొంగకుండా రైతులంతా కలసికట్టుగా బ్రిటిష్‌ ప్రభుత్వ మెడలు వంచిన ఘనత.. వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను సర్దార్‌గా మార్చిన చరిత.. బర్దోలి సత్యాగ్రహానిది!

  • కుప్పలుతెప్పలుగా మత్తుమందులు

పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాలతో (Drug menace) యువశక్తులు నిర్వీర్యమైపోతూ పెను విషాద దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశీయంగా గంజాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే- హెరాయిన్‌ వంటి మత్తుమందులు విదేశాల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల నుంచి సముద్ర మార్గంలో గుజరాత్‌లోకి(Gujarat drugs news) మాదకద్రవ్యాలు వెల్లువెత్తుతున్నాయి.

  • వింబుల్డన్‌కూ ఫెదరర్‌ దూరం!

టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ వచ్చే ఏడాది జరగనున్న వింబుల్డన్​కూ(Wimbledon 2022) దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్​ నుంచి తప్పుకొంటున్నట్లు అతడు ఇటీవలే ప్రకటించాడు. మరోవైపు ఏటీపీ ఫైనల్స్‌ టెన్నిస్‌ టోర్నీలో(ATP Tennis Finals 2021) ప్రపంచ నం.1 నొవాక్‌ జకోవిచ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మెద్వెదెవ్‌ సెమీస్‌కు అర్హత సాధించారు.

  • బాలయ్య కొత్త సినిమా

బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం.. ఇటీవల ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ కలిసి నిర్మిస్తున్నారు.

05:04 November 18

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • నేడే తెరాస మహాధర్నా..

యాసంగి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in telangana)పై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ తెరాస ఇవాళ మహాధర్నా(trs maha dharna)కు సిద్ధమైంది. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న ధర్నాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.

  • ఎంత కొంటారో చెప్పండి..

పంజాబ్ తరహాలో రాష్ట్రంలో వానాకాలంలో పండిన వరి ధాన్యాన్ని 90 శాతం భారత ఆహార సంస్థ కొనుగోళ్లు చేసేలా చూడాలని, యాసంగిలో తెలంగాణలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

  • ఎమ్మెల్యీ అభ్యర్థుల ఆస్తులెన్నంటే..

తెరాస తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన నేతల(trs mlc candidates list in telangana 2021)పై ఎలాంటి కేసులున్నాయి..? వాళ్లకు ఎంత ఆస్తి ఉంది..? వాళ్లు సమర్పించిన అఫిడవిట్​లు ఏం చెబుతున్నాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరూ చూసేయండి.. ఎవరిపై ఎన్ని కేసులున్నాయో..? ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయో..?

  • వైన్సుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

రాష్ట్రంలో మద్యం దుకాణాల(application for liquor license)కు భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 16 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండడం వల్ల పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. రద్దీ అధికంగా ఉన్నట్టయితే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరిండెంట్​లకు ఆదేశాలు అందాయి.

  • మంత్రి కేటీఆర్​ మానవత్వం..

మంత్రి కేటీఆర్​.. మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు మీద జరిగిన ప్రమాదాన్ని గమనించి.. కాన్వాయి ఆపి దగ్గరికెళ్లి చూశారు. క్షతగాత్రులను తన ఎస్కార్ట్​ వాహనంలో ఆస్పత్రికి తరలించి.. వాళ్ల ప్రాణాలు కాపాడారు.

  • సరిహద్దులో డ్రోన్ల కలకలం..

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​.. భారత్​ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్​సర్​ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్​ డ్రోన్​పై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్​ వెనక్కువెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

  • వేదాంతా వ్యాపారాల విభజన..

వేదాంతా వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆ సంస్థల ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. అల్యూమినియం, ఇనుము- ఉక్కు, చమరు-గ్యాస్‌ వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా విడదీసి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుచేసే ఉద్దేశంతో ఉన్నామన్నారు.

  • సాయ్​ పురస్కారాల పంపిణీ..

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసిన 246 మంది అథ్లెట్లు, కోచ్​లకు అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి (SAI Institutional Awards) ఇన్​స్టిట్యూషనల్​ అవార్డులను ప్రదానం చేసింది.

  • ప్రముఖ ర్యాపర్​ మృతి..

అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్(36)​ను కాల్చిచంపాడు ఓ దుండగుడు. ఈ ఘటన టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో​ జరిగింది. ఈ ఘటనపై మెంఫిస్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యంగ్ డాల్ఫ్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

  • హ్యపీ బర్త్​డే నయన్​..

అందం, అభినయం కలయికతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కథానాయిక నయనతార. తెలుగుతో పాటు ఇతర భాషల్లో చిత్రాలు చేస్తూ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గురువారం(నవంబరు 18) ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

Last Updated : Nov 18, 2021, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details