తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - etv bharat top news

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS

By

Published : Aug 23, 2021, 6:12 AM IST

Updated : Aug 23, 2021, 10:03 PM IST

21:58 August 23

టాప్​ న్యూస్ ​@ 10PM

  • ఇన్ఫోసిస్​కు​ డెడ్​లైన్​..

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​ విధించారు. ఆదాయపు పన్ను పోర్టల్​లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్​ 15లోపు పరిష్కరించాలని కోరారు.

  • సర్టిఫికెట్ల జారీపై కేంద్రం కీలక నిర్ణయం!

కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలో తయారుచేసిన వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారంతా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని కేంద్రం ప్రకటించింది. ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

  • తొలి టీకా ఇదే..

కరోనా నివారణకు ఫైజర్- బయోఎన్​టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన టీకాకు అమెరికాలో పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. ఇప్పటివరకు అత్యవసర వినియోగార్థం ఈ టీకాను పంపిణీ చేస్తుండగా.. తాజాగా పూర్తిస్థాయి అనుమతులు ఇస్తూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఏ ప్రకటన జారీ చేసింది. టీకాపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

  • అంతా సిద్ధం..

టోక్యో ఒలింపిక్స్​లో గతంకన్నా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. పారాలింపిక్స్​కు సిద్ధమైంది. మంగళవారమే టోర్నీ ఆరంభంకానుంది.

  • రూబిక్‌ క్యూబ్స్‌తో 'చిరంజీవి' ఆర్ట్..

మెగాస్టార్​ చిరంజీవికి తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ అశేష అభిమానులున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా రూబిక్ క్యూబ్స్​తో ఆయన బొమ్మను తయారు చేశారు తమిళనాడుకు చెందిన ఫ్యాన్స్. మరి ఈ ఫీట్‌ కోసం వాళ్లెంత శ్రమించారో చూడండి..

20:49 August 23

టాప్​ న్యూస్ ​@ 9PM

  • టూరిస్టు పోలీస్​ స్టేషన్లు..

అన్ని రాష్ట్రాల్లో ఉండే పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టు పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భద్రత ఉంటేనే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్​లో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీసు స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు.

  • నిరుద్యోగ భృతి అమలు చేయరేం.?

భాజపాపై మంత్రి హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తిప్పికొట్టారు. ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేని హరీశ్​రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా నేతలు లేరని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • టాప్​ కమాండర్​ హతం

జమ్ము కశ్మీర్​లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)​కు చెందిన టాప్ కమాండర్లు ఇద్దరిని బలగాలు మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. మృతులు టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహచరుడు సాకిబ్ మం​జూర్​ అని వెల్లడించారు.

  • బుమ్రా, షమీకి ఘనస్వాగతం..

లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించారు టీమ్ఇండియా పేసర్లు బుమ్రా(jasprit bumrah), షమీ(Mohammed Shami). అయితే లంచ్ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్​కు వచ్చినప్పుడు భారీ ఎత్తున ఘనస్వాగతం లభించింది. దీనికి కారణం కోహ్లీ అని వెల్లడించాడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ వెల్లడించాడు.

  • బిస్లరీ వాటర్​తో స్టార్ హీరోయిన్ స్నానం

షూటింగ్​ల్లో హీరోయిన్లు ఏది డిమాండ్​ చేస్తే అది తెచ్చి పెట్టాల్సిందే. అలా ఔట్​డోర్​ షూటింగ్​లో అందరూ గోదావరి నది నీటితో స్నానం చేస్తే ఓ నటి మాత్రం బిస్లరీ వాటర్ డిమాండ్ చేశారట. ఇంతకీ ఆమె ఎవరంటే?

19:45 August 23

టాప్​ న్యూస్ ​@ 8 PM

  • '30 లోపు విద్యాసంస్థలను శానిటైజ్‌ చేయాలి'

కరోనా వల్ల విద్యారంగంలో అయోమయం నెలకొందని సీఎం కేసీఆర్​ అన్నారు. విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎక్కువకాలం పాఠశాలలు మూసివేస్తే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని వైద్యశాఖ అధికారులు చెప్పారన్నారు. అన్ని అంశాలపై సమీక్షించి విద్యాసంస్థలు పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పారు.

  • తగ్గినట్లే కనిపిస్తున్నా..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా... మరోసటి రోజుకు వచ్చేసరికి వీటి నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా మరో 354 కేసులు వెలుగుచూశాయి.

  • హైదరాబాద్​లో భారీ వర్షం..

హైదరాబాద్​లో ఉదయం నుంచి వర్షం విడతల వారీగా కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వాన వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడురోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • ఇంగ్లాండ్​కు ఎదురుదెబ్బ

ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ భారత్​తో జరగనున్న మూడో టెస్టుకు దూరమయ్యాడు.

  • 'మాస్ట్రో' ట్రైలర్‌..

అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రం నుంచి మరో అప్​డేట్ వచ్చింది. అలాగే నితిన్ 'మాస్ట్రో' చిత్ర ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది.

18:47 August 23

టాప్​ న్యూస్ ​@7 PM

  • విద్యా సంస్థలు పునఃప్రారంభం

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 

  • 'వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలి'

కృష్ణా బోర్డుకు రాష్ట్ర ఈఎన్‌సీ లేఖ రాశారు. తాగునీటికి వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని, ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని  కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ పేర్కొన్నారు ఈఎన్‌సీ.

  • రహదారులను పునఃప్రారంభించండి

దిల్లీ సరిహద్దుల్లో రహదారుల పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. నోయిడా-దిల్లీ మధ్య ట్రాఫిక్​ ఇబ్బందులు తలుత్తున్నాయని ఓ వ్యక్తి వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర్వులు జారీ చేసింది.

  • రూ. 6లక్షల కోట్ల సమీకరణే లక్ష్యం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్రం 6 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • విడుదల తేదీ ఖరారు

ఇప్పటికీ ఒక్క చిత్రం కూడా విడుదల కాకముందే మరో చిత్రాన్ని మొదలుపెట్టేశాడు బెల్లకొండ గణేశ్(bellamkonda ganesh). తన మూడో సినిమా పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. అలాగే, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా రూపొందిన 'తలైవి' (Thalaivi) విడుదల తేదీ వచ్చేసింది.

17:46 August 23

టాప్​ న్యూస్​@ 6PM

  • 11,500 అడుగుల ఎత్తు నుంచి పడినా..

ఐఫోన్​ కొనాలంటే కిడ్నీలు అమ్మేసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ తెగ వైరల్​ అవుతుంటాయి. అదే ఐఫోన్​లో సమస్యలు వచ్చి వాటిని బాగు చేయాలన్నా.. అంతే మొత్తంలో ఖర్చు అవుతుంది! ఇక సాధారణ ఫోన్​ చేతిలో నుంచి కిందపడితే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఐఫోన్​​ చేతిలోంచి జారి నేల మీద పడితే? ఆ బాధ వర్ణణాతీతం. కానీ ఓ ఐఫోన్​ మాత్రం అద్భుతం చేసింది. 11,500 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా.. చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఫోన్​ స్క్రీన్​పై ఒక్కటంటే.. ఒక్క గీత కూడా పడలేదు. ఎప్పటిలాగే పని కూడా చేస్తోంది. ఇది ఎలా సాధ్యం?

  • 100 మిలియన్ల ఫాలోవర్లు!

టిక్​టాక్​లో అనతికాలంలోనే 100 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుని సంచలనం సృష్టించాడు ఖాబీ లేమ్​. వంద మిలియన్ల ఫాలోవర్లు కలిగిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఒక్క మాట మాట్లాడకుండా.. కేవలం తన హావభావాలతో కోట్ల మందిని ఆకట్టుకుంటున్నాడు. 21 ఏళ్ల అతనికి ఈ స్థాయిలోఆదరణ లభించడానికి కారణమేంటంటే..

  • కల్నల్ ర్యాంకు!

భారత సైన్యంలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్​ ర్యాంకు పదోన్నతి కల్పించడానికి సంబంధిత బోర్డు అంగీకరించింది. సైన్యంలో మరిన్ని విభాగాలకు మహిళా అధికారుల పదోన్నతిని విస్తరించడం.. లింగ వివక్షత పట్ల సైన్యం విధానాన్ని తెలియజేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

  • రేసులో 16 బ్యాంకులు

ఎల్ఐసీ ఐపీఓ(LIC IPO)కు నిర్వహణకు దీపమ్..​ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానించగా.. అందుకు భారీ స్పందన లభించింది. దాదాపు 16 సంస్థలు (race for managing LIC IPO ) ఇందుకు ఆసక్తి కనబర్చాయి. ఇందులో ఏడు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నాయి.

  • నెట్టింట సందడి చేస్తున్నారు.. 

పలువురు హీరోయిన్లు నెట్టింట వారి ఫొటోలతో సందడి చేస్తున్నారు. వారెవరో చూద్దాం.

16:45 August 23

టాప్​ న్యూస్​@ 5PM

  • నిండా ముంచేశాడు

బంగారు నగల తయారీలో నలుగురి దగ్గర నమ్మకం సంపాదించాడు. దీంతో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారుల వద్ద నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇదే అదనుగా భావించి భారీ ఎత్తున బంగారంతో పరారయ్యాడు ఓ ఆభరణాల తయారీదారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల 9 మంది వ్యాపారులు ఆభరణాలు తయారుచేసేందుకు 10 కేజీల బంగారాన్ని దిలీప్​ కుమార్​ అనే నగల తయారీదారుకు ఇచ్చారు. వాటిని కాజేయాలని చూసిన దిలీప్​.. ఆ బంగారాన్ని తీసుకొని ఇంట్లో లేఖ పెట్టి పారిపోయాడు.

  • డిష్యుం..డిష్యుం..

కరీంనగర్‌ జిల్లా ఈటల రాజేందర్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వీణవంక మండలం వల్బాపూర్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐతో భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా.. ఏఎస్‌ఐ చొక్కా చిరిగిపోయింది.  

  • సీఎం కానుక

విద్యార్థినుల కోసం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి రోజు సోదరుడి అవతారమెత్తిన ఆ రాష్ట్ర సీఎం.. బాలికల ఉన్నత చదువుల కోసం మరో పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా కళాశాలల్లో చేరబోయే విద్యార్థినులకు రూ.20,000 చొప్పున కానుక అందజేయనున్నట్లు వెల్లడించారు.

  • టెస్ట్ పాసైతేనే ఎయిర్​పోర్ట్​లోకి ఎంట్రీ

అఫ్గాన్​ను విడిచేందుకు కాబుల్​ విమానాశ్రయానికి(kabul airport) పోటెత్తుతున్న ప్రజలకు అక్కడ కూడా అగ్నిపరీక్ష తప్పడం లేదు. విమానాశ్రయం చుట్టూ తాలిబన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎయిర్​పోర్ట్ లోపల సైనికులు శరణార్థుల జాబితాను రూపొందిస్తుంటే.. బయట ఏర్పాటు చేసిన స్క్రీనింగ్​ పరీక్షలను తాలిబన్​ ఫైటర్లు(taliban news) పరిశీలిస్తున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు యత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనిస్తున్నారు. తాలిబన్లు తమకు సహకరిస్తున్నారని సైన్యం చెబుతున్నా.. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

  • సందడే సందడి

మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు(chiranjeevi birthday celebrations) కన్నుల పండగగా జరిగాయి. పవర్​స్టార్​ పవన్ కల్యాణ్(Pawan Kalyan)​, రామ్​చరణ్ సహా మెగా కుటుంబం చేసిన సందడి ఆకట్టుకుంటోంది. చిరు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్​కు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.

15:45 August 23

టాప్​ న్యూస్​@ 4PM

  • విద్యాసంస్థల పున:ప్రారంభంపై ప్రభుత్వం దృష్టి

విద్యాసంస్థల పున:ప్రారంభంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో మంత్రి సబిత, అధికారులు భేటీ అయ్యారు. సమావేశంలో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

  • నిర్మాతల గిల్డ్ ఆగ్రహం

సినిమా థియేటర్స్ అసోసియేషన్‌పై తెలుగు నిర్మాతల గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని సూచించింది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేయాలో నిర్మాత ఇష్టమన స్పష్టం చేసింది. 

మూడు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.

  • సెన్సెక్స్@ 55,555

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 226 పాయింట్లు పెరిగి.. 55,550 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 46 పాయింట్లు బలపడి.. 15,500 మార్క్​కు చేరువైంది.

  • ప్రముఖ బాలీవుడ్ నటుడికి క్యాన్సర్!

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్​కు ఇటీవలే కీలక సర్జరీ జరిగింది. ఆయన.. యూరినరీ బ్లాడర్​ క్యాన్సర్​ బారినపడినట్లు సమాచారం.

14:36 August 23

టాప్​ న్యూస్​@ 3 PM

  • అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా 3.0

అనేక రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి, ప్రత్యక్ష బోధనను మొదలుపెడుతున్నాయి. అయితే.. అక్టోబరు నాటికి కరోనా థర్డ్​ వేవ్ తారస్థాయికి చేరుకునే​ ప్రమాదం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్న వేళ.. పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలను పునఃప్రారంభించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే సమయంలో పిల్లలు వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు చేయాల్సిందేంటి?

  • నలుగురు పోలీసుల దుర్మరణం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

  • పాములకు రాఖీ కట్టేందుకు యత్నం

రక్షా బంధన్(raksha bandhan)​ రోజున ఓ వ్యక్తి అత్యుత్సాహం అతని ప్రాణాలు పోయేలా చేసింది. బిహార్​ సారణ్​​ జిల్లాలోని మాంజీ సీతల్​పుర్​ గ్రామానికి చెందిన మన్మోహన్​ అలియాస్​ భూవర్​ అనే వ్యక్తి పాములు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాము కాటుకు(Snake bite) గురైన వారికి చికిత్స చేయటంలో చుట్టుపక్కల మంచి పేరుంది. రక్షా బంధన్​ రోజున స్థానికుల సమక్షంలో పాములకు రాఖీ కట్టే సాహసానికి పూనుకున్నాడు. తర్వాత ఏమైందో చూడండి. 

  • కాబుల్​లో కాల్పుల మోత

అఫ్గాన్​లో ఎక్కడ చూసిన తాలిబన్లే(Afghanistan Taliban). ఏ ప్రాంతంలో తూటా పేలిన వారి పనే అని యావత్​ ప్రపంచం భావిస్తుంది. సోమవారం కాబుల్​ విమానాశ్రయం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే.. ఆ కాల్పులు చేసింది తాలిబన్లేనా? లేక మరో కొత్త గ్యాంగ్​ వచ్చిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

  • సినిమా ముచ్చట్లు.. 

'కొండపొలం', 'ఇచ్చట వాహనములు నిలుప రాదు' సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. కొండపొలంలో రకుల్​ ఫస్ట్​లుక్​ను రిలీజ్​ కాగా.. సుశాంత్​ కొత్త సినిమా ట్రైలర్​ విడుదలైంది. మరోవైపు 'ఎస్​ఆర్​ కల్యాణమండపం' ఓటీటీ రిలీజ్​ డేట్​ ఖరారు అయింది.

14:16 August 23

టాప్​ న్యూస్​@ 2 PM

  • ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్, అధికారులతో చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయింది.

  • తెలంగాణ భేష్​

కరోనా(corona) కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధిరేటు సాధించిందని మంత్రి హరీశ్ రావు(harish rao) వెల్లడించారు. ఆరేళ్లలో దేశం కంటే 3 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించామని తెలిపారు. సీఎం కేసీఆర్(cm kcr) విధానాల వల్లే ఈ వృద్ధిరేటు సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గణాంకాలతో సహా మంత్రి వివరించారు.

  • అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా

అనేక రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి, ప్రత్యక్ష బోధనను మొదలుపెడుతున్నాయి. అయితే.. అక్టోబరు నాటికి కరోనా థర్డ్​ వేవ్ తారస్థాయికి చేరుకునే​ ప్రమాదం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్న వేళ.. పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలను పునఃప్రారంభించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే సమయంలో పిల్లలు వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు చేయాల్సిందేంటి?

  • ఓబులమ్మగా రకుల్

'కొండపొలం', 'ఇచ్చట వాహనములు నిలుప రాదు' సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. కొండపొలంలో రకుల్​ ఫస్ట్​లుక్​ను రిలీజ్​ కాగా.. సుశాంత్​ కొత్త సినిమా ట్రైలర్​ విడుదలైంది. మరోవైపు 'ఎస్​ఆర్​ కల్యాణమండపం' ఓటీటీ రిలీజ్​ డేట్​ ఖరారు అయింది.

  • వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్​బై

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా (Vodafone Idea crisis).. జూన్​లో దాదాపు 43 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అయితే ఇదే సమయంలో టెలికాం దిగ్గజం జియో (Jio users gain in June) 54 మంది యూజర్లను రాబట్టుకోవడం గమనార్హం. ట్రాయ్​ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.

13:12 August 23

టాప్​ న్యూస్​@ 1 PM

  • తాలిబన్ల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా?

అఫ్గానిస్థాన్​ వైమానిక దళం సహా.. లక్షల కొద్దీ ఆయుధాలు, అధునాతన సైనిక మౌలిక వసతులు తాలిబన్లు చేజిక్కించుకున్నారు. వారి వద్ద ఏకంగా 2 వేలకుపైగా సాయుధ వాహనాలు, 40 యుద్ధవిమానాలు, మిలటరీ డ్రోన్లు ఉన్నాయంట. పెను విధ్వంసానికి దారితీసే అణ్వాయుధాలూ తాలిబన్ల వద్ద ఉన్నాయా? ఉంటే ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా?

  •  మోదీతో బిహార్ నేతల భేటీ

కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

  • 'సలార్'​ క్రేజీ అప్డేట్..

యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న 'సలార్​'లోని కీలకపాత్రను పరిచయం చేశారు. రాజ​మనార్​గా జగపతిబాబు (jagapathi babu salaar) కనిపించనున్నట్లు వెల్లడించారు.

  • క్రికెట్​కు తాలిబన్ల మద్దతు..

13:04 August 23

టాప్​ న్యూస్​@ 12 PM

హైదరాబాద్‌లో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గ్రేటర్‌లో 18 ఏళ్లు నిండినవారికి ఇప్పటికే 70 శాతానికిపైగా టీకా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.

  • మూడోదశ ముప్పు

దేశంలో కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. కరోనా మూడోదశ అక్టోబర్‌లో తారస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది. 

  • ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

టాలీవుడ్​లో సినిమాల సందడి కొనసాగుతోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల్లో కొన్ని థియేటర్​లో విడుదల అవుతుండగా, మరికొన్ని ఓటీటీ బాట పట్టాయి. మరి ఈ వారం థియేటర్​/ఓటీటీలో విడుదల(this week movie releases telugu) అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

  • సానుకూల సంకేతాలతో సూచీల జోరు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, ఆర్థిక షేర్ల దన్నుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు (Stock Market Today) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.  

  • 'పంజ్​షేర్'​ తాలిబన్లకు లొంగుతుందా?

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghanistan Taliban).. మెల్లగా పంజ్​షేర్​వైపు(Panjshir valley) కదిలారు. ఈ లోయను తమ వశం చేసుకునేందుకు వందలకొద్దీ ఫైటర్లు భారీ ఆయుధాలతో తరలివెళ్లారు. అయితే.. అక్కడ కాచుకుకూర్చున్న పంజ్​షేర్​ బలగాలు ఏమాత్రం వెనక్కితగ్గేది లేదంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రపంచం దృష్టి ఈ ప్రావిన్సుపైనే ఉంది. అసలు పంజ్​షేర్​లో ఏం జరుగుతోంది?

13:04 August 23

టాప్​ న్యూస్​@ 11 AM

  • హుజూరాబాద్​కు మరో రూ.500 కోట్లు

దళితబంధు పథకం కింద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల(Corona Update) సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25 వేల మందికి వైరస్(Covid-19)​ సోకింది. మరో 389 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • పాక్ వల్లే తాలిబన్ల విజయం

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghanistan Taliban) తమ హస్తగతం చేసుకోవటంలో పాకిస్థాన్​ కీలక పాత్ర పోషించిందని ఆరోపించారు అమెరికాలోని రిపబ్లికన్​ చట్టసభ్యుడు. పాక్​ సంబరాలు చేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్గాన్​లో మైనార్టీలుగా ఉన్న(Afghanistan minority groups) సిక్కులు, హిందువులకు భారత్‌ స్వాగతం పలకడాన్ని ఆయన మెచ్చుకున్నారు.

  • యువ హీరో కార్తికేయకు నిశ్చితార్థం

తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయకు నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

  • కోపంతో కెమెరాను తన్ని..

ఆటమధ్యలో ఓ టెన్నిస్​ ఆటగాడు అక్కడే ఉన్న కెమెరాను తన్ని.. దానిని తొలగించమని అంపైర్​తో వాగ్వాదానికి దిగాడు. ఆ కెమెరా వల్ల తన చెయ్యి విరిగినంత పనైందని అన్నాడు.

09:53 August 23

టాప్​ న్యూస్​@ 10 AM

  • తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు

తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించనున్నట్లు తానా నూతన అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సహాయం అందిస్తామని, ‘రైతు కోసం’ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు.

  • గడువు ముగిసినా వాడుకోవచ్చు!

డబ్బు పెట్టి కొన్ని ఆహార పదార్థాలు ఎక్స్​పైరీ డేట్​ అయిపోతే పారేస్తుంటాం. కానీ వాటిని కూడా కొన్ని అవసరాలకు ఉపయోగించొచ్చట. ఇంతకీ అలాంటి పదార్థాలు ఏంటి? ఏయే పనులకు వాడొచ్చు.

  • మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today), వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి.

  • సైబర్ దొంగల కొత్త తెలివి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉంటున్నాయి. కానీ ఏటీఎంలలో డబ్బులు మాయమవుతున్నాయి. కొన్నాళ్లుగా ఈ విషయం బ్యాంకు అధికారులకు తలనొప్పి రప్పిస్తోంది. ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు.. ఇది హరియాణా మూఠా పనిగా నిర్ధారించారు.

  • కారులో మంటలు

దిల్లీ, కేశవపురమ్​ ప్రాంతంలో మెట్రో స్టేషన్​కు సమీపాన ప్రధాన రహదారిపై వెళుతున్న ఓ కారు ఇంజిన్​లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. మంటలు చెలరేగిన క్రమంలో కారును రోడ్డుపైనే నిలిపేసి.. బయటపడ్డారు. 

09:04 August 23

టాప్​ న్యూస్​@ 9 AM

  • ఉపాధి రంగాలు విలవిల

లాక్​డౌన్ ఎత్తివేసినా కొన్ని ఉపాధి రంగాలు ఇంకా కోలుకోలేదు. ఇతర రంగాల్లో తగ్గుదల ఉన్నా... వ్యవసాయ, వాటి అనుబంధ రంగాల్లో ఉత్పత్తి భారీగా పెరగడం వల్ల జీఎస్​డీపీలో పెరుగుదల నమోదైంది. గతేడాది కంటే పలు రంగాల్లో ఉత్పత్తి బాగా తగ్గి... దారుణంగా దెబ్బతిన్నాయి.

  • ఆలోచన మంచిదే కానీ..

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో తాజాగా సమావేశమైన 19 పార్టీలు- సమష్టి కార్యాచరణకు ఓటేశాయి. కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సెప్టెంబరులో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపిచ్చాయి. అయితే.. అధికారమే లక్ష్యంగా పురుడుపోసుకునే కూటములతో దేశానికి ఎటువంటి మేలూ ఒనగూరదన్నది నిష్ఠుర సత్యం. 

  • విమానం తయారు చేసిన ఆటోడ్రైవర్ కొడుకు!

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు విమానం తయారు చేశాడంటే నమ్మగలరా? కానీ ఒక్క విమానమేమిటి? బోట్లు, మోటారు సైకిళ్లు, జేసీబీలు, రోబోలు, సైకిళ్లను తయారు చేశాడు 14 ఏళ్ల ఆదిత్య. అతనో ఆటో డ్రైవర్​ కుమారుడు.

  • గాయపడ్డ హీరో అభిషేక్​ బచ్చన్!

తమిళ సినిమా రీమేక్​ చిత్రీకరణలో పాల్గొంటున్న హీరో అభిషేక్ బచ్చన్ గాయపడ్డారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేకపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • పతకాలు తీసుకొస్తారా?

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించాలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను వృథా చేసుకుంటుంటారు. అలాంటివాళ్లు ఒక్కసారి ఈ వీరుల గురించి తెలుసుకుంటే.. ఈ యోధుల కథలు వింటే జీవితంపై కొత్త ఆశ చిగురించడం ఖాయం.

08:00 August 23

టాప్​ న్యూస్​@ 8 AM

  • కట్నంగా ముంబయి నగరం

వరకట్నం(Dowry) కింద డబ్బులు, నగలు, స్థిర, చరాస్తులను ఇస్తారు. కానీ, కట్నం కింద ఏకంగా ఓ మహానగరాన్నే ఇవ్వటం తెలుసా? అవును భారత్​ను పాలించిన బ్రిటిషర్లు(British) కట్నం కింద ముంబయి నగరాన్నే(Mumbai history) తీసుకున్నారు. చరిత్రను ఓసారి పరిశీలిస్తే...

  • మాదకద్రవ్య కర్మాగారంగా అఫ్గాన్‌

ప్రపంచంలో అతిపెద్ద నల్లమందు తయారీదారు అయిన అఫ్గానిస్థాన్‌ను మాదకద్రవ్య ఉత్పత్తి, అక్రమ రవాణాకు కేంద్రం కానివ్వబోమని తాలిబన్లు ప్రకటించినా, వారి మాటలు నీటిపై రాతలేనని పలుమార్లు నిరూపితమైంది. ప్రపంచ నల్లమందు, హెరాయిన్‌ ఉత్పత్తిలో 80 నుంచి 90శాతం అఫ్గానిస్థాన్‌ నుంచే వస్తోంది.

  • వెలుగులోకి మరో భూబాగోతం...

హైదరాబాద్ మహానగరం చుట్టూ రోజుకో భూ అక్రమం బయటపడుతోంది. ధరలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు తాయిలాలకు అలవాటు పడి.. వారికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 150 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి.

  • ప్రతిభను కొలిచే సాధనం

సీబీఎస్‌ఈ (CBSE latest news) రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం మంచి పరిణామమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడం సులువవడంతో పాటు పరీక్ష పట్ల నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని అంటున్నారు.

  • పుష్ప'కు లీకుల బెడద.. 

బన్నీ 'పుష్ప' షూటింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతోంది. ఇటీవల చిత్ర వీడియోలు లీక్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

07:19 August 23

టాప్​ న్యూస్​@ 7AM

  • పీఆర్‌సీ కోసం ఎదురుచూపులు

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లకు వేతన సవరణ అందని ద్రాక్షగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల్లో పీఆర్‌సీ అమలుకు అనుమతించినా వాటి పాలకమండళ్లు దానిపై నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో పనిచేసే 30వేల మంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

  • ఇక్కడ పండవు!

రాష్ట్రంలో ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల్లో అత్యధికం ఇక్కడ పండేవి కావు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సన్నబియ్యం మొదలు... పప్పులు, కూరగాయలు, పండ్లు, వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు... అన్నీ దిగుమతులే. 

అఫ్గానిస్థాన్ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై(CAA Act) కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పురి. మైనారిటీలను సీఏఏ ఆదుకుంటుందని అన్నారు.

  • జనాభా నియంత్రణ బిల్లుతో మరింత ముప్పు!

జనాభా స్థిరీకరణ కోసం అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లు.. జనాభా నియంత్రణ బిల్లును (Population control bill) ప్రతిపాదించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరగడం లేదని బిల్లును ప్రతిపాదించిన ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే దేశంలో ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

  • హీరో సూర్య వల్లే...

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ప్రేక్షకుల ముందు త్వరలో రానున్న దర్శకుడు దర్శన్.. చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత అంశాల్ని చెప్పారు. తాను డైరెక్టర్​గా మారడానికి సూర్యనే ప్రధాన కారణమని అన్నారు.

04:59 August 23

టాప్​ న్యూస్​@ 6AM

వ్యాక్సినేషన్​ ప్రత్యేక డ్రైవ్​లు..

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి పెద్ద ఎత్తున వాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్​ఎంసీ, కంటోన్మెంట్‌ బోర్డు ఉమ్మడిగా వాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి అర్హులందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు.

48 గంటల దీక్షకు రెడీ...

దళిత, గిరిజనుల పక్షాన పోరు బాట పట్టిన కాంగ్రెస్‌ 48 గంటల దీక్షకు సిద్దమైంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబడుతున్న కాంగ్రెస్‌... రెండు రోజుల దీక్ష ద్వారా పోరు ఉద్ధృతం చేయనుంది. ఏకంగా ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడు చింతలపల్లెనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దీక్షకు వేదికగా ఎంచుకున్నారు.

పాదయాత్ర వాయిదా...

ఈనెల 24 నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసినట్లు బండి సంజయ్‌ తెలిపారు. కాగా యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.పార్టీపరంగా సంతాపదినాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు.

మార్కెట్​లోకి 23 విజయ నిత్యావసరాలు..

వంటనూనెల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో.... రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య మరో మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ చర్యలు ఫలితంగా ఆయిల్‌ఫెడ్‌ లాభాలబాటలోకి వచ్చింది. ఇప్పటికే 8 రకాల నూనెలు విక్రయిస్తున్న ఆ సంస్థ... ఇవాళ్టి నుంచి మరో 23 నిత్యావసరాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

కాటేదాన్​లో భారీ అగ్నిప్రమాదం...

హైదాబాద్​ కాటేదాన్​ పారిశ్రామికవాడలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రెండు గోదాములు మంటలకు ఆహుతయ్యాయి. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. రెండు గంటల పాటు నాలుగు ఫైరింజన్లు శ్రమించి మంటలను అదుపు చేశాయి.

నిండు గర్భిణి మృతి...

ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవటం... అతికష్టం మీద ఆస్పత్రికి చేరినా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవటం... ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటు నుంచి ఇంకో ఆస్పత్రికి తరలించినా చికిత్స చేయకుండా.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటం.. వీటన్నింటి వల్ల ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.

అఫ్గాన్​ పరిస్థితులపై జీ-7 సమావేశం...

అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు(Afghan news), అక్కడి నుంచి స్థానికులతో పాటు అమెరికా తదితర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

మరోసారి బాంబుల మోత...

గాజా ప్రాంతంలో మరోసారి బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధాల తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

కోచ్​లకు కొత్త పాఠాలు..

రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని ఎన్​సీఏలో వినూత్న శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీల్డ్​ బయట సమస్యలను ఎదుర్కోవడం సహా క్లిష్ట సమయాల్లో భిన్న వర్గాలతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఆశావహ కోచ్​లకు శిక్షణ ఇస్తున్నారు.

రాంచరణ్​, జూ.ఎన్టీఆర్​ ఫ్యాన్స్​కు పండగే...

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' తొలి ఎపిసోడ్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ అతిథిగా విచ్చేసి సందడి చేశారు. షో ఆద్యంతం వీరి మధ్య సాగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.


 

Last Updated : Aug 23, 2021, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details