తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - టాప్​న్యూస్​@6AM

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS

By

Published : Aug 22, 2021, 6:27 AM IST

Updated : Aug 22, 2021, 9:53 PM IST

21:50 August 22

టాప్​ న్యూస్​ @ 10PM

  • 24 జిల్లాలో పదిలోపే కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 40 వేలకు పైగా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తుండగా పాజిటివిటీ రేటు 0.58 శాతం కంటే తక్కువగా ఉంటోంది. 98 శాతానికి పైగా రికవరీ రేటు నమోదవుతోంది.

  • మెగాస్టార్​ బర్త్​డే సర్​ప్రైజ్​లు ఇవే

ఇవాళ(ఆగస్టు 22) మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డెట్స్​ ప్రకటించాయి ఆయా చిత్రబృందాలు. దీంతో అభిమానుల్లో జోష్​ పెరిగింది. ఓ సారి ఆ అప్డేట్స్​పై లుక్కేద్దాం..

  • తీపి కబురు చెప్పిన చిరు

కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మెగాస్టార్​.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని 24 విభాగాల్లోని సినీకార్మికులకు తీపి కబురు అందించారు.

  • కోహ్లీ తాగే వాటర్‌ బాటిల్​ ధర తెలిస్తే షాక్​!

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ ఫిట్​నెస్​కు​ ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక డైట్​ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తాడు. అయితే అతడు​ తాగే నీళ్ల బాటిల్​ ధర తెలిస్తే మీరు షాక్​ అవ్వాల్సిందే. ఇంతకీ దాని ధర ఎంతంటే..

  • ఈ బిట్‌కాయిన్‌ యాప్స్‌తో జాగ్రత్త..!

బిట్‌కాయిన్‌ కొనుగోలుకు సంబంధించి యాప్‌లను రూపొందించి అమాయకులైన వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు కొందరు సైబర్​ నేరగాళ్లు. వీరు రూపొందించిన యాప్​ను గుర్తించి తాజాగా ప్లేస్టోర్​ నుంచి తొలగించింది గూగూల్​.

20:52 August 22

టాప్​ న్యూస్​ @9PM

  • అది తప్పుడు ప్రచారం..

 పెండింగ్​ చలానాలు ఉన్న వాహనాలు జప్తు చేస్తామని.. సైబరాబాద్​ పోలీసులు స్పష్టం చేశారు. చలానాలు కట్టకపోయినా.. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం తప్పని తేల్చారు.

  • పార్టీ గిఫ్ట్​

తమిళనాడులోని కొందరు నేతలకు ఓ పార్టీ ఇన్నోవా కార్లను గిఫ్ట్​గా ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచేందుకు.. వారు చేసిన కృషికి గాను ఈ కార్లు దక్కించుకున్నారు.

  • సింహాలతో చెలగాటం..

అఫ్గాన్​ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నా.. పంజ్​షీర్​ ప్రాంతం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ ఈసారి తాలిబన్లు ధైర్యం చేశారు. అక్కడి ప్రజలకు అల్టిమేటం జారీచేశారు. తక్షణమే లొంగిపోవాలని లేకపోతే విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

  • ఇదే తొలిసారి...

భారత్​ తరపున టోక్యో పారాలింపిక్స్​లో 54 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్​ నుంచి ఇంత మంది పారాలింపిక్స్​కు వెళ్లడం ఇదే తొలిసారి. పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.

  • మెగా సందడి..

'మెగా'ఫ్యామిలీలో చిరంజీవి పుట్టినరోజు, రక్షా బంధన్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాబ్రదర్స్​ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్ కలిసి​ సందడి చేయడం చూడ ముచ్చటగా ఉంది. ఆ వీడియోను మీరు చూసేయండి..

19:48 August 22

టాప్​ న్యూస్​ @8PM

  • చిన్నారులకు తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా న్యుమోకోకల్ కాంజుగేట్​ వ్యాక్సిన్​ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అసలు న్యుమోకోకల్ వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు.? ఏ వయసు వారు ఈ టీకా తీసుకోవచ్చు. న్యుమోకోకల్ టీకా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • మాలేకు విమాన సర్వీస్​

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవులలోని మాలేకు విమాన సర్వీసు పున:ప్రారంభమైంది. ఇండిగో విమాన సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది.

భారత్​ మాకు రెండో ఇళ్లు

అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దాదాపు 400 మంది ఆదివారం భారత్​ చేరుకున్నారు. వారిలో 329 మంది భారతీయులు కాగా ఇద్దరు అఫ్గానిస్థాన్​ చట్టసభ సభ్యులున్నారు. స్వదేశం చేరుకున్న అనంతరం ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు.

  • వారితో ఈజీ కాదు..

అమెరికా ఉనికి కారణంగా ఇన్నేళ్లు అఫ్గాన్​కు దూరంగా ఉండిపోయిన చైనా.. ఆ ప్రాంతం నుంచి శత్రుదేశం వెనుదిరగడాన్ని మంచి అవకాశంగా భావిస్తోంది. సహజంగానే విస్తరణ కాంక్షతో ఉండే చైనాకు ఇది నిజంగా మంచి అవకాశమే(china taliban alliance). కానీ ఇతర దేశాల్లోలాగా.. అఫ్గాన్​పై గురిపెట్టడం చైనాకు కష్టంతో కూడుకున్న వ్యవహారం. 

వాడీ-వేడీగా

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. 'మా' భవనం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్‌ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్‌లు తెలిపారు. 

18:51 August 22

టాప్​ న్యూస్​ @7 PM

  • వర్ష సూచన..

 రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం (weather report) ప్రకటించింది. రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపారు.

  • అలా వస్తే నో ఎంట్రీ..

బిహార్​ భాగల్​​పుర్​లోని ఓ మహిళా కళాశాల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. లూజ్​ హెయిర్​తో కాలేజ్​ ఆవరణలో కనిపించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది యాజమాన్యం.

  • దారికాచిమరీ..

 వేలాది అఫ్గాన్ పౌరులు, విదేశీయులు అఫ్గానిస్థాన్​ వదిలి పారిపోవడానికి పరుగులు తీస్తున్నకొద్దీ కాబుల్ విమానాశ్రయం బయటి దృశ్యాలు మరింత భయానకంగా మారుతున్నాయి. కాల్పులు జరపటంతో పాటు తాళ్లు, కర్రలతో కొట్టి తరుముతున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా ప్రతినిధి చెప్పడం భయాందోళనకు గురిచేస్తోంది. 

  • అదుపులో ఉండాలి..

మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉండటం ఇష్టమైనప్పటికీ.. అతడు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచించాడు మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫరూక్‌ ఇంజినీర్‌. ప్రపంచంలోనే విరాట్​ మేటి బ్యాట్స్​మన్​, సారథి అని కితాబిచ్చాడు.

  • 'మా' భవనం ఎందుకమ్మేశారు..?

'మా' ఎన్నికల విషయమై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎలక్షన్స్​పై ఓ నిర్ణయానికి వచ్చేందుకు 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఇందులో పాల్గొన్న నటుడు మోహన్​బాబు.. గతంలో 'మా' కోసం కొనుగోలు చేసిన భవనం ఎందుకు అమ్మేశారంటూ ప్రశ్నించారు.

17:28 August 22

టాప్​ న్యూస్​ @6PM

  • పోరుబాట 

సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. సీఎం (kcr) దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష చేపడతామని.. ఆ గ్రామం దుస్థితిని మీడియాకు చూపిస్తామన్నారు. గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

  • పాదయాత్ర వాయిదా

ఈనెల 24 నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసినట్లు బండి సంజయ్‌ తెలిపారు. పార్టీపరంగా సంతాపదినాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు.

  • ఆ అంకెలను బట్టీపట్టండి

క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు సంబంధించిన నిబంధనలను భారతీయ రిజర్వ్​ బ్యాంక్ కఠినతరం చేయనుంది. కార్డుపై ఉండే 16 అంకెల నంబర్లలతో పాటు గడువు ముగిసే తేదీ, సీవీవీ వంటి వాటిని వినియోగదారులు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ రూల్స్‌ అమల్లోకి తేవాలని యోచిస్తోంది ఆర్​బీఐ​.

  • లైక్స్​ వద్దనుకుంటే..

 ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో ఉన్న లైక్​ ఫీచర్​ కొంత మంది యూజర్స్​కు ఉపయోగకరంగా ఉంటే మరికొందరికి చికాకు తెప్పిస్తుంది. ఇందుకోసమే లైక్స్​ హైడ్​ చేసే ఫీచర్​ను (instagram hide likes) ప్రవేశపెట్టాయి ఆ సంస్థలు. మరి ఈ లైక్‌ సంఖ్యను ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం.

  • మెగాస్టార్​ 154 చిత్రం అప్​డేట్​

మెగాస్టార్​ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కనున్న సినిమా నుంచి అప్టేట్ వచ్చింది. ఆదివారం (ఆగస్టు 22) చిరు బర్త్​డే సందర్భంగా ఈ చిత్ర పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాస్​లుక్​లో చిరు గెటప్​ అదిరిపోయింది.

16:50 August 22

టాప్​ న్యూస్​ @5PM

  • కేసీఆర్​కు రక్షాబంధన్​

ప్రగతిభవన్​లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్​కు వారి సోదరీమణులు రాఖీకట్టి.. శుభాకాంక్షలు చెప్పారు.

  • కొత్త ఫీచర్లు

డిస్​అపియరింగ్​ మెసేజింగ్​ ఫీచర్​కి వాట్సాప్​ మరిన్ని ఆప్షన్లు (Whatsapp update) జోడించనున్నట్లు సమాచారం. దీంతో పాటు వెబ్​ లింక్​ షేర్​కు సంబంధించి ఓ అప్డేట్​ను తీసుకొస్తున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నాయి.

  • వివరణ ఇవ్వండి..

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్​ పరేఖ్​కు ఆర్థిక శాఖ సమన్లు జారీ చేసింది. కొత్త ఐటీ పోర్టల్​ అందుబాటులోకి వచ్చి 2 నెలలు దాటినా.. ఇంకా సాంకేతిక సమస్యలను పరిష్కరించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

  • తలరాత మారేనా..?

కాబుల్​ విమానాశ్రయం, సరిహద్దులు అఫ్గాన్(Afghan news)​ ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా దేశాన్ని వీడాలన్న లక్ష్యంతో ప్రజలు ఉన్నారు కానీ.. ఆ తర్వాత ఏంటి? అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

  • కేజీఎఫ్​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​

  సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'కె.జి.ఎఫ్‌2'(KGF 2).  తాజాగా ఈ చిత్ర కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2022 ఏప్రిల్​ 14న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

15:51 August 22

టాప్​ న్యూస్​ @4PM

  • ప్రగతి భవన్​లో... రక్షా బంధన్

రక్షా బంధన్​ వేడుకల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. పలువురు తెరాస మహిళా నేతలు ప్రగతి భవన్​కు చేరుకుని కేటీఆర్​కు రాఖీ కట్టారు.

  • గూడ్స్​రైలు ఢీకొని..

గుజరాత్​లోని అమ్రేలీ జిల్లాలో గూడ్స్​ రైలును ఢీకొట్టి ఓ మగ సింహం మరణించింది. చనిపోయిన సింహానికి సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉండొచ్చని అటవీ అధికారులు తెలిపారు.

  • వందల కోట్లు మోసం

మైక్రోసాఫ్ట్​ అధినేత, అపర కుబేరుడు బిల్​ గేట్స్​ను పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి వందల కోట్లు మోసం చేశారంటే నమ్ముతారా? అయితే.. అదే నిజం. ఓ వ్యక్తి.. బిల్​ లాంటి వ్యాపార దిగ్గజాన్ని అంత సునాయాసంగా ఎలా మోసం చేయగలిగాడు? అసలు ఏం జరిగింది?

  • ఛాన్స్​ ఎవరికి

ఇంగ్లాండ్​లో భీకర ఫామ్​లో ఉంది టీమ్​ఇండియా. అయితే తొలి రెండు టెస్టుల్లో అంతగా ఆకట్టుకోని ఆల్​రౌండర్​ జడేజాను మాత్రం మూడో టెస్టుకు పక్కనే పెట్టే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే?

  • ఎన్నికలు జరిపించండి

'మా' ఎన్నికలు త్వరితగతిన జరిగేలా చూడాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌ కోరారు. వీలైతే సెప్టెంబర్‌ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు.

14:45 August 22

టాప్​ న్యూస్​ @3PM

  • ప్రధాని నివాళి

 ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్ భౌతికకాయానికి(Kalyan Singh death) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి నమస్కరించారు.

  • ఆస్పత్రులే లక్ష్యంగా

దేశంలోనే ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరతీశారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఆస్పత్రి అధికారులు గుర్తించిన సైబర్​ మోసం.. ఈ అనుమానాలకు తావునిస్తోంది. ప్రసూతి వార్డు లేకపోయినా.. ఓ ఆస్పత్రి నుంచి 41 జనన ధ్రువీకరణ పత్రాలను సైబర్​ మోసగాళ్లు జారీ చేశారు.

  • వరద విలయం

అమెరికాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా టెన్నెస్సీ రాష్ట్రంలో 10 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది.

  • చెక్కు చెదరని రికార్డులు

ఒలింపిక్స్​ క్రీడలు వచ్చాయంటే చాలు పాత రికార్డులను బద్దలు కొట్టి ఆటగాళ్లు సరికొత్త ఫీట్లు సాధిస్తారు. ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తారు. కానీ, విశ్వక్రీడల్లో ఇప్పటికీ కొన్ని రికార్డులు మారకుండా ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్​లోనూ అవి అలాగే ఉండనున్నాయి! మరి ఆ ఘనతలు ఏంటీ? వాటిని సాధించిన అథ్లెట్లు ఎవరనేది తెలుసుకుందాం.

  • ప్రభాస్​ అభిమానులకు శుభవార్త

రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న సలార్​ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి రాజమన్నార్​ ఫస్ట్ లుక్​ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పాన్​ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

13:56 August 22

టాప్​ న్యూస్​ @2PM

రాఖీ సంబురాలు..

రాష్ట్రవ్యాప్తంగా రక్షా బంధన్​ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. అక్కాచెల్లెల్లు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి తమ జీవితంలో వారెంతో ముఖ్యమో చెబుతున్నారు. ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నాతమ్ముళ్లు వారి తోబుట్టువులకు భరోసానిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నాయకులను సోదరులుగా భావిస్తూ మహిళా కార్యకర్తలు, సోదరీమణులు రాఖీ కట్టి.. మిఠాయిలు తినిపించారు.

వడ్డీతో సహా చెల్లించండి

ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చిన ఆఫర్​ ప్రకారం తమకు డబ్బు తిరిగి ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్​ ప్రయాణికుడికి ఆఫర్​ ప్రకారం డబ్బు చెల్లించడంతో పాటు వడ్డీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంతకి ఆ ఆఫర్​ ఏంటీ.. ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏదో చూద్దాం పదండి.


లెక్కల వల్లే అఫ్గాన్ ఇలా...

అఫ్గాన్‌ ప్రభుత్వం వద్ద 3,00,000 మందికి పైగా సైన్యం ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పగటికలలు కంటూ వాటి శక్తిని అభివర్ణించి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. అఫ్గాన్‌ సైన్యంలో(Afghanistan Ghost Soldiers) ఉన్న అవినీతి దళం చేసిన అక్రమాల ఫలితం ఇప్పుడు సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు.


భారత బ్యాట్స్​మెన్ వీళ్లే

12:56 August 22

టాప్​ న్యూస్​ @1PM

  • విమానాశ్రయంలో తొక్కిసలాట

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో.. వారి చెర నుంచి బయటపడాలని అఫ్గాన్​ పౌరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కాబుల్​ విమానాశ్రయానికి (Kabul Airport) పెద్దఎత్తున చేరుకుంటున్నారు. విమానాశ్రయంలో (Kabul Airport) జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారని బ్రిటన్​ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.

  • చంపి, పూడ్చిపెట్టారు..

అదృశ్యమైన హైదరాబాద్‌ చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ముగ్గురు మిత్రులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • డ్లబండిపై ప్రసవ వేదన!

నిండు గర్భిణీ ఓవైపు ప్రసవ వేదన అనుభవిస్తూనే... మరోవైపు పొంగుతున్న వాగును ఎడ్లబండిపై దాటాల్సిన దయనీయ పరిస్థితి(Miserable condition) ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా రాజుల తండాకు చెందిన ఓ మహిల పురిటి నొప్పులను(labour pains) పంటిబిగువున బిగబట్టి వాగు దాటారు. సరైన రోడ్డు లేక గర్భిణీలకు దినదినగండంగా ఉందని స్థానికులు వాపోయారు.

  • ఏజెన్సీకి వినియోగదారుల కమిషన్ షాక్​

ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చిన ఆఫర్​ ప్రకారం తమకు డబ్బు తిరిగి ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్​ ప్రయాణికుడికి ఆఫర్​ ప్రకారం డబ్బు చెల్లించడంతో పాటు వడ్డీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంతకి ఆ ఆఫర్​ ఏంటీ.. ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏదో చూద్దాం పదండి.

  • తాలిబన్ల తూటాల వర్షం

అఫ్గాన్​ను హస్తగతం చేసుకున్న తర్వాత.. దేశానికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించిన తాలిబన్లు(Afghan Taliban) తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాడిన వారిని చంపేస్తున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారిపై తూటాల వర్షం కురింపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

11:47 August 22

టాప్​ న్యూస్​ @12PM

  • 3 నెలల పాటు వడ్డీ ఉండదు!

ఫిన్​టెక్ సంస్థ యూని.. తాజాగా 'పే వన్​ థర్డ్' అనే సరికొత్త కార్డును(Credit card) తీసుకొచ్చింది. దీన్ని 'పే లేటర్' కార్డుగా(pay later credit card) వ్యవహరిస్తున్నారు. భారత్‌లో అత్యధిక కాలం వడ్డీ రహిత నగదు సదుపాయాన్ని అందిస్తున్న కార్డుగా దీన్ని పేర్కొంటున్నారు.

  • హత్య కేసులో మరో ట్విస్ట్​

మెదక్ జిల్లాకు చెందిన వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్‌ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అతని హత్యకు వివాహేతర సంబంధమో, ఆర్థిక లావాదేవిలో కాదని తెలుస్తోంది. ఇది పూర్తిగా కిరాయి హత్యగా పోలీసులు ఒక స్పష్టతకు వచ్చారు.

  • సురక్షితంగా స్వదేశానికి..

అఫ్గానిస్థాన్​ సంక్షోభం(Taliban Crisis in Afghanistan) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న 168 మందితో బయలు దేరిన సీ-17 విమానం భారత్​కు చేరుకుంది. గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం దిగింది.

  • ఇండియన్ సినిమా బాద్​షా

ఆజాను బాహుడు, ఆరడుగుల.. మూడు అంగుళాల అందగాడు, ఆకర్షణీయమైన కళ్లు, చురుకైన చూపులు. పైకి దువ్విన క్రాఫు.. నుదుట నిలువు బొట్టు. ఛాతీ అంతా పరుచుకునే షాలు.. కోటు వేసినా, హ్యాటు పెట్టినా.. తలపాగా చుట్టినా.. అదిరేటి ఆ స్టయిలే అమితాబ్ బచ్చన్. గళమెత్తితే గర్జించే సింహంలా ఉంటారు. హిందీ చిత్రసీమలో ఈ డెబ్భయి ఎనిమిదేళ్ల కుర్రవాడు.. తన సినిమాలతో అందరికీ ఆత్మీయుడయ్యాడు. భారతీయతకే ఒక ఐకాన్‌గా మారాడు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకొని ఉత్తుంగ తరంగంలా ఎగసిన అమితాబచ్చన్ జీవనయానమే ఓ స్ఫూర్తిదాయక సినిమా కథను తలపిస్తుంది.

  • ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదట!

28 ఏళ్లకే క్రికెట్​కు వీడ్కోలు పలికి అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆటగాడు ఉన్ముక్త్​ చంద్​.. రిటైర్మైంట్​ వెనక గల కారణాలు వెల్లడించాడు. గత రెండేళ్ల నుంచి అవకాశాలు లేక మానసిక క్షోభ అనుభవించానని తెలిపాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం యూఎస్​ లీగ్​లో ఆడుతున్నాడు ఉన్ముక్త్​.

10:56 August 22

టాప్​ న్యూస్​ @11AM

  • అడ్మిట్‌ కార్డులు విడుదల

నాలుగో విడత జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు(JEE MAIN Admit Cards) విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల మండలి తన వీటిని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

  • పొట్టలో రూ.11కోట్లు విలువైన కొకైన్​

కొకైన్​ను(cocaine) అక్రమంగా తరలిస్తున్న(drug smuggling) ఆఫ్రికా​ దేశస్థుడిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు అధికారులు. రూ. 11 కోట్ల విలువైన మత్తుపదార్థాన్ని(Narcotics) పొట్టలో దాచుకుని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

  • సూపర్​ వుమెన్

అఫ్గాన్‌ తాలిబన్ల(Afghanistan Taliban) వశమైనప్పటి నుంచీ.. అక్కడి అమ్మాయిలు, మహిళల భవిష్యత్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పడుతునే ఉన్నారు. అయితే.. అలిసన్‌ రెన్యూ ఓ అడుగు ముందుకేసి పదిమందిని ఆ చెర నుంచి తప్పించి, వాళ్ల జీవితాల్లో సూపర్‌ వుమన్‌గా(Super Woman) నిలిచింది.

  •  తండ్రైన మహిళ క్రికెటర్​

ఆస్ట్రేలియా స్వలింగ జంట మేగాన్​ స్కట్​- జెస్​ హోలియోక్​కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఆసీస్​ మహిళ క్రికెటర్​ మేగాన్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

  • పవన్​, చరణ్​ స్పెషల్ విషెస్

అగ్రకథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు నటీనటులు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్​ కల్యాణ్​, రామ్​చరణ్​ మాత్రం స్పెషల్ విషెస్​ చెబుతూ, మెగాస్టార్​తో తమకున్న అనుబంధాన్ని తెలిపారు.

10:03 August 22

టాప్​ న్యూస్​ @10AM

  • 30,948 మందికి వైరస్

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona virus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,948 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 403 మంది కొవిడ్(Covid-19)​ బారిన పడి మరణించారు.

  • ట్రయల్ రన్ ప్రారంభం

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​కు ట్రయల్ రన్ ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అధికారులు మోటార్లను ప్రారంభించారు. ప్రస్తుతం మూడు మోటర్లతో ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా నీటిని జలాశయంలోకి మళ్లీస్తున్నారు. 

  • పసికందును పారేయాలనుకుంది!

మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నా.. ఆడశిశువులను వద్దనుకునేవారు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆడపిల్ల అని ఎంతోమంది పసికందులను పురిట్లోనే వదిలేస్తున్న ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. ఇటీవలే భర్త చనిపోయిన ఓ మహిళ.. శనివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది ఆడపిల్ల(BABY GIRL) అనే కారణంతో పురిట్లోనే పారేయాలనుకుంది. పొత్తళ్లలో ఒదిగిపోవాల్సిన ఆ పసిగుడ్డును ముట్టుకోవడానికి సైతం ఆ తల్లి(MOTHER) అంగీకరించకపోవటం గమనార్హం. పుట్టగానే ఎంతో ప్రేమతో తగిలే నులివెచ్చని తల్లి స్పర్శ ఆ బిడ్డకు కరవైంది. ఈ హృదయ విదారక ఘటన(TRAGEDY) ఎక్కడ జరిగిందంటే..!

  • మోదీ శుభాకాంక్షలు..

రాఖీ పౌర్ణమిని(raksha bandhan) పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు.. ఈసారి మార్కెట్లో రాజకీయ నేతల బొమ్మలతో తయారు చేసిన రాఖీలు (Rakhi 2021) సందడి చేస్తున్నాయి. మహిళలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

  • బంగారం ధర ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today) , వెండి ధరలు ఇలా ఉన్నాయి.

08:46 August 22

టాప్​ న్యూస్​ @9AM

  • జన హృదయ విజేత..

ఆంధ్రకేసరి(Andhra Kesari) బిరుదు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు(Prakasam pantulu garu) దేశ సేవకోసం ఎన్నోకష్టాలను, దారిద్య్రాలను వరించిన విశిష్ట త్యాగమూర్తి. ఆగస్టు 23న ఆయన 150వ వర్థంతి సందర్భంగా.. ప్రకాశం పంతులు బాల్యం, యవ్వనం, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

  • 'కరోనా'రుణ గ్రహీతలు

కొవిడ్ చికిత్స(Covid treatment) కోసం దేశవ్యాప్తంగా 1.33 లక్షల మంది బ్యాంకుల నుంచి అప్పులు(Covid related loans) తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. రుణ గ్రహీతల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆసుపత్రుల్లో చేరిన ఖాతాదారుల కుటుంబ సభ్యుల కోసం బ్యాంకులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఇచ్చాయి.

  • పాలనను గుర్తిస్తామని కాదు

అఫ్గాన్‌(Afghan news) ప్రజలు సురక్షితంగా తరలించే అంశంపై మాత్రమే తాలిబన్లతో(Taliban) తాము మాట్లాడుతున్నామని యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్(European Union commission)​ తెలిపింది. అయితే.. దానర్థం తాలిబన్ల పాలనను తాము గుర్తిస్తామని(Taliban international recognition) మాత్రం కానేకాదని స్పష్టం చేసింది. మరోవైపు, కాబుల్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని అఫ్గాన్‌లో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ జంతు సంరక్షకుడు, మాజీ రాయల్‌ మెరైన్‌ పాల్‌ ఫార్థింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

  • రోల్స్ రాయిస్ కారు.. అందరికీ అమ్మరు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన 'రోల్స్​రాయిస్​' గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కారును ఎవరికి పడితే వాళ్లకు అమ్మరు. అవునా అని అవాక్కయ్యారా? దీని వెనకున్న కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

  • వెరైటీ హల్వా

రక్షా బంధన్​ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రాఖీలతో పాటు స్వీట్లు. మరి రాఖీ కట్టాక నోరు తీపి చేయాలి కదా! దీంతో మిఠాయిలకు కూడా చాలా గిరాకీ ఉంటుంది. బయటకొనే స్వీట్ల కన్నా ఈసారి మీ ఇంట్లోనే మీకు నచ్చిన విధంగా హల్వా రెడీ చేయండి. మరి విభిన్న రకాల హల్వా తయారు చేయడమేలాగో తెలుసుకోండి.

07:52 August 22

టాప్​ న్యూస్​ @8AM

  • దాడికి వందేళ్లు

1922లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) బ్రిటిష్​ అధీనంలో ఉన్న పలు పోలీసు స్టేషన్ల​పై(attack on police station) వరుస దాడులు చేశారు. గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి ఆ పోలీసు స్టేషన్లపై సాయుధ దాడులు చేపట్టారు. చింతపల్లి స్టేషన్​పై దాడి జరిగి నేటికి వందేళ్లు.

  • మళ్లీ మేం బందీలైపోయాం

'తాలిబన్లు రాకముందు మాకు హక్కులు ఉండేవి. కానీ, వారి రాకతో అంతా మారిపోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. హాలీవుడ్​ నటి ఏంజెలినా జోలీకి ఓ అఫ్గాన్(Afghan news)​ యువతి లేఖ రాసింది. దీన్ని ఏంజెలినా జోలీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేశారు. తాలిబన్ల దురాక్రమణతో(Afghanistan Taliban) అఫ్గాన్​ ప్రజలు అనుభవిస్తున్న వెతలకు సాక్ష్యంగా నిలుస్తోందీ లేఖ!


 

  • జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!

ద్విచక్ర వాహన విభాగంలో విద్యుత్‌ వాహనాల(Electric vehicles) జోరు పెరిగింది. ఈ క్రమంలో అనేక అంకుర సంస్థలు ఈవీల తయారీకి ముందుకు రావడం ప్రారంభించాయి. దీంతో అనేక రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్‌ వాహన అంకుర సంస్థలు.. తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సంప్రదాయ డీలర్‌ మోడల్‌కు బదులు ఆన్‌లైన్‌లో విక్రయాలకే(electric vehicles buy online) ప్రాధాన్యం ఇస్తున్నాయి.

  • స్వీట్లు మానేశా

టోక్యో ఒలింపిక్స్​లో అదరగొట్టిన నీరజ్ చోప్డా.. 100 ఏళ్ల కలను సాకారం చేశాడు. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం.


 

  • కరెక్ట్ అనుకున్నా

'ఖిలాడి'తో బిజీగా ఉన్న దర్శకుడు రమేశ్​వర్మ.. చిత్ర విశేషాలు చెప్పారు. తన తర్వాత చిత్రాల గురించి కూడా వెల్లడించారు.


 

06:48 August 22

టాప్​ న్యూస్​ @7AM

  • సర్కారు దృష్టి

రైసు మిల్లుల సంఖ్య, సామర్థ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వరి ధాన్యం సాగు, దిగుబడి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేలా కసరత్తు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమైన సర్కార్... రైసు మిల్లుల విషయమై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఆధునిక యంత్రాల సహాయంతో ఎక్కువ సామర్థ్యంతో మిల్లింగ్ చేసేలా ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నారు.

  • కులాలవారీ జనగణన!

దేశంలో కులాలవారీగా జనాభా(caste census) లెక్కించాలంటూ విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఓ ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కలు (census) పూర్తి చేయటంపైనే దృష్టి సారించింది.

  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

కాబుల్​ విమానాశ్రయం వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్​ వదిలెళ్లడానికి ఎయిర్​పోర్టు బయట చిన్నారులతో కలిసి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ఆకలిదప్పికలు మరచి, ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.

  • వైకల్యాన్ని జయించి.. విశ్వ క్రీడలకు కదిలి

జపాన్ మరో విశ్వసమరానికి వేదిక కానుంది. ఇప్పటికే ఒలింపిక్స్​ను విజయవంతంగా నిర్వహించగా, ఇప్పుడు పారాలింపిక్స్ సిద్ధమైంది. చరిత్రలోనే అత్యధికంగా ఈ సారి భారత్ నుంచి 54 మంది ఈ విశ్వక్రీడల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 24న ప్రారంభమై​ 12 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

  • 'హీరో' అన్నయ్యలు

సోదర సోదరీమణులకు ఎంతో ఇష్టమైన రాఖీ పండగ వచ్చేసింది. అయితే తెలుగు చెల్లెళ్లకు హీరో అన్నయ్యలు కొందరు ఉన్నారు. వారి గురించే ఈ కథనం.

03:14 August 22

టాప్​ టెన్​న్యూస్​@6AM

  • రాఖీట్ల పున్నానికి కథలెన్నో...

రాఖీ (rakhi) అంటే రక్షణనిచ్చే బంధం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్షాబంధనాన్ని (Raksha Bandhan 2021) కడుతుంది. సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు అండగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన ఈ వేడుక శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలిపే కథలు బోలెడున్నాయి..

  • సట్టుబండలైతున్న సదువులు..

ప్రస్తుత తరగతి గది విధానంలోనే లోపముంది. పలు రకాల స్థాయులున్న వారిని ఒక తరగతిలో చేర్చి చదువు చెబుతున్నారు. అందులో 15 శాతం మందికే పాఠం అర్థమవుతుంది. మిగిలిన 85 శాతం మంది గురించి పట్టించుకోం. నెమలి, చేప, కోతి, ఏనుగుకు కలిపి ఈత పందెం పెడితే ఎలా ఉంటుందో.. ఇప్పటి తరగతి గది బోధన అలాగే ఉంది. విద్యార్థుల కేంద్రంగా విద్య అందించే విధానం రావాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు.

  • జనాశీర్వాద యాత్ర సక్సెస్​..

రాష్ట్రంలో మరో రెండేళ్లలో తెరాస ప్రభుత్వ అడ్రస్‌ గల్లంతు కావటం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సచివాలయమే లేకుండా... తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా పాలన సాగుతోందని మండిపడ్డారు. జనఆశీర్వాద యాత్రలో తెరాస వైఫల్యాలపై విమర్శలు గుప్పించిన కిషన్‌రెడ్డి.... కేంద్రప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. మూడ్రోజుల పాటు పలుజిల్లాల్లో సాగిన ఈ యాత్ర.... హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంతో ముగిసింది.

  • పండుగ వేళ విషాదం..

జిరాక్స్ కోసం బయటకు వచ్చిన అక్కాతమ్ముళ్లను ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు కబళించింది. అతివేగంగా దూసుకువచ్చిన బస్సు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్క అక్కడికక్కడే మరణించగా.. తమ్ముడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా దూలపల్లిలో జరిగింది.

  • యూనివర్సిటీలో శోభనమా...?

ఏపీలోని జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో ఓ జంట శోభనానికి ఏర్పాట్లు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఇటువంటి కార్యక్రమాలకు అతిథిగృహాన్ని.. అది కూడా చదువులకు నిలయమైన యూనివర్సిటీలోని గదులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి.

  • అఫ్గాన్​ నుంచి భారత్​కు సేఫ్​గా..

అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్నవారిలో దాదాపు 300 మంది సురక్షితంగా ఆదివారం భారత్​కు చేరుకోనున్నారు. ఈ మేరకు 87 మందితో ఓ ఎయిర్​క్రాఫ్ట్ స్వదేశానికి​ బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. మరో 135 మందిని దోహా నుంచి భారత్​కు తరలించినట్లు భారత దౌత్యకార్యాలయం పేర్కొంది.

  • రూ.200 కోట్ల హెరాయిన్​..

భారత్‌-పాక్‌ సరిహద్దు సమీపంలో భారీఎత్తున మాదకద్రవ్యాలను పంజాబ్‌ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా తరలిస్తున్న 40కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని...

కాబుల్​ విమానాశ్రయం వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్​ వదిలెళ్లడానికి ఎయిర్​పోర్టు బయట చిన్నారులతో కలిసి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ఆకలిదప్పికలు మరచి, ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.

  • ఐపీఎల్​లో తొలి సింగపూర్​ ప్లేయర్​..

జట్టులో మార్పులు చేసిన ఆర్సీబీ.. సింగ్​పూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​ను తీసుకుంది. అతడి పేరు ప్రకటించినప్పటి నుంచి ఆ ప్లేయర్​ గురించి ఆరా తీయడం ప్రారంభించారు అభిమానులు. ఇంతకీ అతడు ఎవరు? అతని రికార్డులు ఏంటి?

  • హ్యాపీ బర్త్​డే 'గాడ్​ఫాదర్​'...

మెగాస్టార్ చిరంజీవి అనగానే అద్భుతమైన సినిమాలు, అబ్బురపరిచే డ్యాన్సులు, విజిల్స్ కొట్టించే ఫైట్లు.. ఇలా మనకు చాలా గుర్తొస్తాయి. కానీ ఆయన జీవితంలో ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? ఆదివారం మెగాస్టార్​ 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.


 

Last Updated : Aug 22, 2021, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details