ఉపఎన్నికకు సీఎం దిశానిర్దేశం..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఉపఎన్నికపై మంత్రులు, నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా ఇతర నేతలతో ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.
న్యాయమైన వాటాకు కృషి చేయండి..
నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం... నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో 50 శాతం జలాలు కావాలన్న విషయమై.. అన్ని ఆధారాలతో భేటీ ముందు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మల్లన్నసాగర్ పనుల పురోగతిపైనా... సీఎం కేసీఆర్ ఆరా తీశారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులను... ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉంది.
మూడో రోజుకు కిషన్‌రెడ్డి యాత్ర...
జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు విజయవంతంగా సాగింది. సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యాత్ర.. మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల మేదుగా... యాదాద్రి చేరుకుంది. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం... యాత్ర ఘట్‌కేసర్, ఉప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభతో... యాత్ర ముగియనుంది.
సాయం చేయటమే తప్పా...
రేపిస్టు అని వార్తలు, కథనాలు రావటం తననేంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు గాంధీ ఆసుపత్రి రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్. దూరపు బంధువులని సాయం చేసినందుకు ఇలా ఎలా నాపై ఇంతటి ఘోరమైన ముద్ర వేస్తారని కన్నీరుమున్నీరయ్యారు. నిజాన్ని తెలుసుకుని తనను వదలి పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
మండిపోతున్న గ్యాస్ బండలు..
గ్యాస్ బండ మండిపోతోంది. కేవలం తొమ్మిది నెలల్లోనే సిలిండర్‌పై ఏకంగా సుమారు రూ.265.50 పెరిగింది. పెరిగిన ధరలతో రాష్ట్రంలోని వినియోగదారులు సుమారు రూ.150 కోట్లకుపైగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.
కొత్తగా వందే భారత్ రైళ్లు...
స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. వంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
కేరళలో కేసుల కొనసాగింపు..
కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 20,224 కేసులు వెలుగుచూశాయి. ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే 4వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,667 మందికి వైరస్ సోకింది.
విమాన హైజాక్ ఘటనలాగే ఉన్నాయి...
కాబుల్ విమానాశ్రయంలోని ప్రస్తుత పరిస్థితులు.. 'కాందహార్ విమాన హైజాక్ ఘటన'ను తలపిస్తున్నాయని కెప్టెన్ దేవీ శరణ్ పేర్కొన్నారు. వేలాది మంది అఫ్గాన్ నుంచి బయటపడాలని చూస్తున్నారని చెప్పారు.
బీసీసీ పెద్దలతో కోహ్లీ మీటింగ్...
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా కోహ్లీ.. బీసీసీఐ పెద్దలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలిసింది.
హ్యాపీ బర్త్‌డే భూమిక...
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా.. శనివారం 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం మీకోసం..