- రెండో రోజు ఆశీర్వాదం కోసం..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. తొలి రోజు విజయవంతంగా ముగిసింది. జన ఆశీర్వాద యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. కోదాడ, సూర్యాపేటలో సాగిన యాత్రలో... కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూనే కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలిరోజు యాత్రను ముగించుకున్న కిషన్‌రెడ్డి... సూర్యాపేటలోనే బస చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.
దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తోంది. ఇంద్రవెల్లిలో సమర శంఖం పూరించిన పీసీసీ... రాహుల్ సభతో వచ్చే నెల 17న ముగించనుంది. ముగింపు భారీ బహిరంగసభను.. వరంగల్ సెంటిమెంట్‌తో నిర్వహించేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార ఆరోపణల కేసులను... పోలీసులు చాకచక్యంగా చేధించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత, వైద్య నివేదికల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రెండు కేసుల్లోనూ అత్యాచారం జరగలేదని తేల్చారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఫిర్యాదు చేసిన మహిళ మానసికస్థితి సరిగ్గా లేదని స్పష్టం చేశారు. సంతోష్‌నగర్ కేసులో... యువతి తన ప్రియుడి సానుభూతి పొందాలనే... సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేల్చారు.
పాము కనిపిస్తే ఏం చేస్తాం? భయపడి పారిపోతాం. ప్రాణానికి ప్రమాదమని భావిస్తే ఏకంగా చంపేస్తాం. చెట్టుపై నుంచి తనపైపడ్డ పాముని చూసి అతడూ.. అలాగే భయపడ్డాడు. ప్రాణభయంతో చంపేశాడు. ఆ తర్వాత అది విషంలేని పామని తెలిసి చాలాబాధపడ్డాడు. అప్పటినుంచి పాముల్నిచంపబోనని స్నేహితులకు మాటిచ్చాడు. ఇప్పటివరకు ఒక్కపామును చంపలేదు సరికదా... 4 వేలకు పైగా పాముల్నిరక్షించి అడవుల్లో వదిలాడు.
భాగ్యనగరంలోని ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. నర్సరీ మేళాలోని మొక్కల కనువిందుతో.... సందర్శకులు మధురానుభూతి పొందుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న... జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన సందర్శకులను కట్టిపడేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు, అంకుర కేంద్రాల స్టాళ్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చక్కటి ఆహ్లాదం,ఆనందం, విజ్ఞానం పంచుతున్న ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరిగింది.
శత్రుక్షిపణులకు భారత యుద్ధ విమానాలు చిక్కకుండా చూసే చాఫ్ సాంకేతికతను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీపై జరిగిన ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయని.. దీన్ని వాయుసేనలో ప్రవేశపెడుతున్నట్లు డీఆర్డీఓ తెలిపింది.
- మేడపై శబ్దం ఏంటా అని వెళితే..
తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి ప్రజలు శతవిధాల ప్రయత్నించారు. విమానాలు ఎక్కి వేలాది మంది దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా రెక్కలతో పాటు విమాన పైభాగాన ఉంటూ ప్రయాణించి కింద పడ్డారు. చాలా మందికి వారు ఎక్కడ పడ్డారో తెలియదు. కానీ వారు పడింది కాబుల్ విమానాశ్రయానికి 4 కిమీ దూరంలో ఉంటున్న సలేక్ అనే వ్యక్తి ఇంటి పైన.
- అమెరికా క్యాపిటల్ వద్ద ఉద్రిక్తత
అమెరికాలోని క్యాపిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ వద్ద ఓ వాహనాన్ని గుర్తించిన అధికారులు అందులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
'సెమీకండక్టర్ల' విభాగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మనదేశం కృషి చేయకపోతే 'చిప్'ల కొరత మాదిరి సవాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించడంతోనే చైనా సెమీకండక్టర్ల పరిశ్రమపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. దేశీయంగా టాటా గ్రూపు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
- ప్రియ, పూర్ణ మాస్ డాన్స్..
వచ్చే వారం ఢీ షో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం. తీన్మార్ డప్పుకు లంగాఓణిలో ప్రియమణి, పూర్ణ వేసిన మాస్ డ్యాన్స్.. కార్యక్రమం మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ ప్రోమోను మీరు చూసేయండి..