తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - top ten news

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS

By

Published : Aug 18, 2021, 5:54 AM IST

Updated : Aug 18, 2021, 10:06 PM IST

22:01 August 18

టాప్​ న్యూస్​ @10PM

  • అష్రఫ్​ ఘనీ అరెస్టు కోసం..

అఫ్గానిస్థాన్​ అధికార పగ్గాల్ని తాలిబన్లు హస్తగతం చేసుకునే సమయంలో దేశాన్ని వీడిన అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ ఆచూకీపై స్పష్టత వచ్చింది. ఆయన కుటుంబసభ్యులతో కలిసి తమ దేశంలోనే ఉన్నట్టు యూఏఈ వెల్లడించింది. మరోవైపు.. ఆయన్ను అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అఫ్గాన్ రక్షణ మంత్రి తెలిపారు.

  • రూ.10 లక్షలు భిక్ష కాదు..

తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్​ బిడ్డల చేతిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ప్రసంగించారు.

  • హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు..

న్యాయాధికారుల కోటాలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి జస్టిస్‌ పి.శ్రీరాధ, జ్యూడీషియల్‌ అకాడమీ డైరక్టర్‌ సి.సుమలత, తెలంగాణ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ జి.రాధారాణి, ఖమ్మం ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్‌, తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి తుకారాంజీ, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులు పి.మాధవిదేవి పేర్లను సిఫారసు చేశారు. 

  • రేపటి నుంచే యాత్ర..

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లబండ గూడానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభిస్తారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను జనఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజలకు కిషన్ రెడ్డి వివరించనున్నారు.

  • ఆరు జట్లతో మహిళల ఐపీఎల్..

మహిళల ఐపీఎల్​ ఆరు​ జట్లతో నిర్వహించాలని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన కోరింది. ఓ యూట్యూబ్​ ఛానల్​లో మాట్లాడిన ఆమె మరిన్ని ఆసక్తికరమైన అంశాలపై చర్చించింది.

20:42 August 18

టాప్​ న్యూస్​ @9PM

  • అష్రఫ్​ ఘనీ అరెస్టు కోసం..

అఫ్గానిస్థాన్​ అధికార పగ్గాల్ని తాలిబన్లు హస్తగతం చేసుకునే సమయంలో దేశాన్ని వీడిన అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ ఆచూకీపై స్పష్టత వచ్చింది. ఆయన కుటుంబసభ్యులతో కలిసి తమ దేశంలోనే ఉన్నట్టు యూఏఈ వెల్లడించింది. మరోవైపు.. ఆయన్ను అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అఫ్గాన్ రక్షణ మంత్రి తెలిపారు.

  • హుజూరాబాద్​ బిడ్డల చేతిలో..

తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్​ బిడ్డల చేతిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ప్రసంగించారు.

  • మాయలే(లా)డి వలపు వలలో..

మాయలే(లా)డి మాయలో పడిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఫ్రెండ్ షిప్​ పేరు మీద బాధితుడితో ఓ యువతి సన్నిహితంగా మెలిగింది. తనతో పాటు మరో ఇద్దరిని ఫోన్​లో పరిచయం చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పరిచయమైన మరో ఇద్దరు కూడా ఈమె అవతారమే. అదెలాగంటారా?

  • అయ్యో పాపం..

ది హండ్రెడ్​ లీగ్​లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్​రౌండర్ లివింగ్​స్టోన్ దుమ్మురేపాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు బాదిన ఓ బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి కుర్చీపై పడిపోయాడు ఓ అభిమాని.

  • కొండచిలువతో మహిళ ఫేస్​2ఫేస్​..

సరకుల కోసం సూపర్​మార్కెట్​కు వెళ్తారు. మీకు కావాల్సినవి వెతుకుతున్నారు. ఓ షెల్ఫ్​ వద్ద అటుఇటూ చూస్తున్న మీకు అందులోంచి ఒక్కసారిగా 10అడుగుల కొండచిలువ ఎదురుపడితే? వెన్నులో వణికిపుట్టి హడలిపోతారు కదూ! సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఆస్ట్రేలియాలో ఓ మహిళకు ఎదురైంది. అయితే ఆమె భయపడలేదు. ఏం చేసిందో తెలిస్తే వారెవ్వా అనకమానరు.

19:52 August 18

టాప్​ న్యూస్​ @8PM

  • హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు..

హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటాలో ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. 

  • జనసంద్రంగా రావిర్యాల..

ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ‘దండోరా’ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ నిర్వహిస్తోంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులతో రావిర్యాల జనసంద్రంగా మారింది.

  • గోదాంలో అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మా పరిశ్రమ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. 

  • ఏపీ సీఎం జగన్‌కు సమన్లు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డికి సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వాన్ పిక్ ఈడీ కేసులో సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని జగన్​ను న్యాయస్థానం ఆదేశించింది.

  • ఎస్​బీఐ కొత్త డిపాజిట్​ స్కీం..

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ సరికొత్త డిపాజిట్ స్కీంను తీసుకొచ్చింది. ప్లాటినమ్​ టర్మ్​ పేరుతో వివిధ కాలపరిమితులతో ఈ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సాధారణ డిపాజిట్లతో పోలిస్తే అదనపు వడ్డీ ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

18:47 August 18

టాప్​ న్యూస్​ @7PM

  • జీతాలు పెంపు..

రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి వేతనాలు పెరిగాయి. టీచర్లు, కార్యకర్తలకు 30 శాతం మేర వేతనాలు పెంచారు. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు జులై నుంచి అమలులోకి రానున్నాయి.

  • ప్రతి అంగుళం భూమికి సాగునీరు..

సిరిసిల్ల జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్​లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా ఎమ్మెల్యేలకు, అధికార యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. 

  • డెల్టా వైరస్​కు చెక్..

కొవిడ్ టీకాతో లభించే ప్రతిరక్షకాల నుంచి డెల్టా వేరియంట్​ తప్పించుకోలేదని అమెరికాలోని ఓ అధ్యయనం తెలిపింది. అందుకే వ్యాక్సినేషన్ చేయించుకున్న ఎక్కువమంది ప్రజలు డెల్టా ఉద్ధృతికి గురికావడం లేదని వెల్లడించింది.

  • వచ్చే ఐపీఎల్​లో 10 జట్లు..

ఐపీఎల్-2022​లో 10 జట్లు ఉంటాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇక యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్​కు ప్రేక్షకుల అనుమతిపై ఆ దేశంతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • జియో కొత్త స్మార్ట్‌ఫోన్‌..

జియో, గూగుల్‌ కలసి తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో స్మార్ట్​ఫోన్‌ను తీసుకొస్తామని కొన్ని నెలల క్రితం ప్రకటించాయి. అయితే.. ఈ ఫోన్ ధర ఇదేనంటూ ఆన్​లైన్​లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ మొబైల్​ ధర ఎంతంటే?

17:45 August 18

టాప్​ న్యూస్​ @6PM

  • తాలిబన్లకు బైడెన్ షాక్..

తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షాక్ ఇచ్చారు. భారీ స్థాయిలో నిధులపై ఆంక్షలు విధించారు. తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, అఫ్గాన్ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. జీ7 దేశాలు సైతం భేటీ కానున్నాయి.

  • అనుకోని అతిథి..

కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతోంది. అన్ని పనులు పూర్తయ్యాయి. బంధుమిత్రులు అందరూ పెళ్లి మండపానికి విచ్చేశారు. పెళ్లి వారు అతిథి మర్యాదలు చేస్తున్నారు. మండపంలో బంధువుల కోలాహలం నెలకొంది. కాసేపట్లో వరుడు... వధువుకు తాళి కట్టబోతున్నాడు. సీన్ కట్ చేస్తే పెళ్లి మండపంలోని అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సమయానికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగిందంటే!

  • అవార్డులు ప్రకటించిన కేంద్రం..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • ఇవి తెలుసుకోవాల్సిందే..!

అత్తలేని కోడులుత్తమురాలు ఓ యమ్మా... కోడల్లేని అత్త గుణవంతురాలు.. ఇది కేవలం పాటేనండోయ్. నిజజీవితంలో అత్తాకోడల్లు, తల్లీ కూతళ్లలా కలిసిపోవాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. పెళ్లై అత్తారింటికి వెళ్తున్న ప్రతీ కొత్త కోడలికి ఈ చిట్కాలు బాగా పనికొస్తాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.

  • నటుడు సూర్యకు హైకోర్టు షాక్..

తమిళ నటుడు సూర్యకు మద్రాస్​ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ 3.11 కోట్ల పన్ను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

16:50 August 18

టాప్​ న్యూస్​ @5PM

  • రైతులకు గుడ్​న్యూస్..

దేశీయంగా పామాయిల్​ పంటను ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్స్​- ఆయిల్​ పామ్ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. వంట నూనె అవసరాలకు విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశమని కేంద్రం పేర్కొంది.

  • "ధర్మపురి" వారి కుటుంబ కథా చిత్రమ్!

వాళ్లది ఒకే కుటుంబం.. కానీ జెండాలు మాత్రం మూడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ మూడు జెండాలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మూడు ప్రధాన పార్టీలకు ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • దరఖాస్తుల హడావిడి..

ఆసరా పింఛన్ల అర్హత వయస్సును ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించడంతో మీ సేవ కేంద్రాలకు అర్హులు బారులు తీరారు. నెలాఖరువరకే గడువు ఉండటంతో కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. వయసు నిర్ధరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు, ఆధారు కార్డు, బ్యాంకు పుస్తకం, పాస్​పోర్టు సైజు ఫొటోతో అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • గడీలు బద్దలుకొడతాం..

సర్వాయి పాపన్న గౌడ్​ స్ఫూర్తితో గడీలు బద్దలు కొడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​(bandi sanjay) అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

  • స్టార్ హీరో సంచలనం..

ఓ స్టార్ హీరో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తను సంపాదించిన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తన పిల్లలకు ఇవ్వనని ఆయన స్పష్టం చేయడమే కారణం.

15:41 August 18

టాప్​ న్యూస్​ @4PM

  • ఎయిర్​పోర్ట్​ కాల్పుల్లో 40 మంది మృతి..

అఫ్గాన్​లోని కాబుల్​ విమానాశ్రయంంలో సోమవారం జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్​ కమాండర్​ వెల్లడించారు. విదేశాలకు వెళ్లిపోవటంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. మరోవైపు.. సోమవారం కాబుల్​ నుంచి కతార్​ వెళ్లిన అమెరికా వాయుసేన విమానం చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించింది.

  • సెకండ్ వేవ్ ముగిసిపోయింది..

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని డీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. అన్ని జ్వరాలు కొవిడ్​ జ్వరాలు అనుకోవద్దని పేర్కొన్నారు. సీజనల్​ వ్యాధులు పెరగకుండా చర్యలు చేపట్టామని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • నిమజ్జనంపై చర్యలేంటి?

కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండగకు ఇళ్లల్లోనే ఉంటూ నిరాడంబరంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గణేశ్​ ఉత్సవాలపై సూచనలు కాదని... స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

  • మహిళలను అనుమతించాల్సిందే..

ఎన్‌డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షకు మహిళలను అనుమతించకపోవడం లింగ వివక్షేనని సుప్రీం ఆక్షేపించింది.

  • ఎన్టీఆర్​ గ్యారేజ్​లో లగ్జరీ కారు..

ఎన్టీఆర్​ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దేశంలో లాంబొర్గిని కొత్త మోడల్​ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ విలాసవంతమైన కారు ధర రూ. 3 కోట్ల పైమాటే ఉంటుందని సమాచారం.

13:46 August 18

టాప్​ ​న్యూస్ @ 2PM

  • 24 గంటల్లో వెబ్​సైట్​లో పెట్టాలి

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు(Dalitha bandhu)పై హైకోర్టు(high court)లో విచారణ జరిగింది. వాచ్​ వాయిస్​ ఆఫ్​ పీపుల్​ సంస్థ.. దళితబంధుపై దాఖలు చేసిన పిల్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది.  ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లోనే వైబ్​సైట్​లో ఉంచాలని ఆదేశించింది. 

  • ఆ వార్తలు బాధాకరం

సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంపై మీడియాలో వస్తున్న వార్తలు బాధాకరమని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఇంకా ఖరారు చేయకుండానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

  • తాలిబన్ 2.0 అరాచకాలు షురూ

అఫ్గానిస్థాన్​లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్లు తమ అరాచకాలను మొదలుపెట్టారు. హజారా నాయకుడు అబ్దుల్​ అలీ మజారీ విగ్రహాన్ని పేల్చి వేశారు. ప్రజల భయాలను నిజం చేస్తూ విధ్వంసాలకు దిగుతున్నారు.

  • ఇంగ్లాండ్ కోచ్ ఘాటు వ్యాఖ్యలు

లార్డ్స్​ టెస్టు ఓటమిపై ఇంగ్లాండ్ కోచ్​ క్రిస్ సిల్వర్ హుడ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చిన్న చిన్న విషయాలకు తమ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత్-ఇంగ్లాండ్​ మధ్య మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి మొదలుకానుంది.

  • ఎన్టీఆర్​ గ్యారేజ్​

ఎన్టీఆర్​ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దేశంలో లాంబొర్గిని కొత్త మోడల్​ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ విలాసవంతమైన కారు ధర రూ. 3 కోట్ల పైమాటే ఉంటుందని సమాచారం.

12:44 August 18

టాప్​ ​న్యూస్ @ 1PM

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సెలవుల్లో కోతలు విధించారు. రెండో శనివారం తరగతులు కొనసాగుతాయి. టర్మ్ సెలవులు ఉండవు.

  • 73వ రోజు విచారణ

ఏపీ మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అనుమానితులను పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా హత్య కేసు పురోగతిపై ఆయన కుమార్తె సునీత.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • రాజకీయాల్లోకి మహిళలా?

తాలిబన్లు మహిళలను ఎంత తక్కువ చేసి చూస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అఫ్గాన్​ తమ అధీనంలోకి వచ్చాక మహిళలకు ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయా? అని ఓ జర్నలిస్టు అడగ్గా వారు అవును అని సమాధానమిచ్చారు. 

  • ప్రపంచ దేశాల మల్లగుల్లాలు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకోగా.. ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజలు భయంతో ఇతర దేశాలకు పారిపోతున్నారు. అఫ్గాన్​ పరిణామాలపై ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

11:45 August 18

టాప్​ ​న్యూస్ @ 12PM

  • ఎస్సీ కమిషన్ ఆగ్రహం

గాంధీ ఆస్పత్రి ఘటనను ( Gandhi Hospital Rape Case ) జాతీయ ఎస్సీ కమిషన్ (national sc commission) తీవ్రంగా పరిగణించింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్​ఐఆర్​ (FIR) నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మహేందర్​రెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి.. కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హల్దార్ నోటీసులు జారీచేశారు.

  • ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను వెల్లడించారు. ఈసెట్‌లో 95.16 శాతం మంది విద్యార్థుల అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసెట్ ర్యాంకులతో బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 

  • సీబీఐకి స్వయం ప్రతిపత్తి

పార్లమెంటుకు మాత్రమే నివేదిక ఇచ్చేలా సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని మద్రాసు హైకోర్టు అభిప్రాయ పడింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

  • శశి థరూర్​కు ఊరట

కాంగ్రెస్ నేత శశి థరూర్​కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య సునంద పుష్కర్ డెత్ కేసు నుంచి ఆయన్ను డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తీర్పునిచ్చిన స్పెషల్ జడ్జికి థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. 

  • 'లవ్​స్టోరి' వినాయక చవితికే

లాక్​డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన 'లవ్​స్టోరి' ఎట్టకేలకు రిలీజ్​ డేట్ ఫిక్స్ చేసుకుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

10:44 August 18

టాప్​ ​న్యూస్ @ 11AM

  • తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తే!

సుప్రీంకోర్టులో ఖాళీలను భర్తీ చేసేందుకు 9 మంది న్యాయమూర్తల పేర్లను జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. వీరిలో ముగ్గురు మహిళా జడ్జిలు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు భవిష్యుత్తులో మొట్ట మొదటి మహిళా సీజేఐ కానున్నారు. న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నకు ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

  • తెలంగాణలో ప్రభుత్వ భూములెన్ని?

రాష్ట్రంలో గుట్టుగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్​తోపాటు హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు కొన్నిచోట్ల కబ్జాలకు గురయ్యాయి.

  • రెండుగా చీలిపోయే బ్రిడ్జ్​

పగటి పూట అది నదిపై ఉండే.. ఓ మామూలు వంతెన. దానిపై ప్రజలు ఎప్పటిలానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే.. రాత్రయిందంటే చాలు.. ఆ వంతెన రెండుగా చీలిపోతూ తెరుచుకుంటుంది. ఆ సమయంలో శ్రావ్యమైన సంగీతం కూడా వినిపిస్తుంది. వింతగా అనిపిస్తోంది కదూ! అయితే.. ఈ వంతెన విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.

  • అఫ్గాన్​కు పయనమైన వ్యూహకర్త!

తాలిబన్‌ రాజకీయ వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అఫ్గాన్​కు పయనమైనట్లు తెలుస్తోంది. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడైన ఆయన దోహా శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సందర్భంగా పలు దేశాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపాడు.

  • సమంత డ్రీమ్​హౌజ్!

తమ పెళ్లి జరిగిన చోటే డ్రీమ్​హౌస్​ నిర్మించేందుకు సమంత-నాగచైతన్య సిద్ధమవుతున్నారు. స్థలం చూసేశారని, త్వరలో నిర్మాణం ప్రారంభిస్తారని సమాచారం.

09:46 August 18

టాప్​ ​న్యూస్ @ 10AM

  • తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి(80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఈ రోజు తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతి చెందారు.

  • అఫ్గాన్​కు అతిపెద్ద దాతల్లో భారత్​

దశాబ్దాల తరబడి యుద్ధం.. రక్తపాతం.. అశాంతి.. పేదరికంతో ఛిద్రమైన అఫ్గానిస్థాన్‌ ముఖచిత్రాన్ని మార్చేందుకు భారత్‌ శతవిధాలా ప్రయత్నించింది. 'ఇరుగు-పొరుగు చల్లగా'.. అనే తన సంస్కృతికి అనుగుణంగా ఆ దేశానికి కొన్నేళ్లుగా ఆపన్న హస్తం అందించింది. ఇందుకుగాను 3 వందల కోట్ల డాలర్లు వెచ్చించింది. అఫ్గాన్‌ను ఆదుకున్న అతిపెద్ద దాతల్లో ఒకటిగా నిలిచింది.

  • లెక్కింపునకు సన్నాహాలు

పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల గణన ఈసారి ముందస్తుగా చేపట్టనున్నారు. ఏడాదిపాటు జరిగే 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీతో నివేదికను విడుదల చేయించాలని కేంద్ర పర్యావరణశాఖ నిర్ణయించింది.

  • సెన్సెక్స్ 250 ప్లస్

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 260 పాయింట్లు వృద్ధి చెంది 56 వేల మార్కుని దాటింది. ప్రస్తుతం జీవితకాల గరిష్ఠం 56,096 వద్ద ట్రేడవుతోంది.

  • పేరు కాదు రికార్డులకు కేరాఫ్

టీనేజర్​ కెరీర్​ మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మెన్​, కెప్టెన్​గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. వాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు క్రికెటర్​గా 13 ఏళ్ల కెరీర్​ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం.

08:44 August 18

టాప్​ ​న్యూస్ @ 9AM

  • మరో ఎనిమిది కలెక్టరేట్లు సిద్ధం

నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, యాదాద్రి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలు సిద్ధమయ్యాయి. శ్రావణమాసంలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

  • అవగాహన లేక.. అంతంత మాత్రంగా!

పట్టణాలు, నగరాల్లోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతుంటే... ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు మాత్రం టీకాకు ఆమడ దూరంలో ఉంటున్నారు. అవగాహన లేక కొందరు, అపోహలతో మరికొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు.

  • దుస్థితి దయనీయం..

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగా ప్రాజెక్టు నుంచి వదిలే నీరు ఆయకట్టుకు చేరడం కష్టంగా మారుతోంది. ఫలితంగా సాగు నీరందక రైతన్న అవస్థలు పడుతున్నారు. అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

  • చిప్‌ల కొరత..

చిప్​ల కొరత కారణంగా దేశీయ వాహన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. బుక్ చేసుకున్న కార్ల డెలివరీ కోసం 2-3 నెలలు ఎదురుచూసే పరిస్థితి ఎదురైంది. మరికొన్ని నెలల పాటు చిప్‌ల కోరతతో తంటాలు తప్పకపోవచ్చని కార్ల కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

  • టెయిలెండర్లా.. మజాకా

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​ సహా అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్​ సిరీస్​లో కూడా టీమ్​ఇండియాను లోయర్​ ఆర్డర్​ కీలక పాత్ర పోషించింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసి.. ఇక అద్భుతం జరిగితే తప్ప టీమ్‌ఇండియా కోలుకోదనిపించిన సందర్భాల్లో లోయర్​ఆర్డర్​ జట్టును ఆదుకుంటోంది. టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా.. మేమున్నాం అంటూ ఆదుకుని జట్టును గట్టెక్కిస్తున్నారు.

07:40 August 18

టాప్​ ​న్యూస్ @ 8AM

  • ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది

దిల్లీలోని జేఎన్​యూ గోడలపై రాసిన ఓ వ్యాక్యం.. తనను రాజకీయాల వైపు నడిపించిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఐఏఎస్​ అధికారిగా చూడాలని తన తండ్రి కేసీఆర్​ అనుకున్నారని.. కానీ.. తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. గీతం విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు... జాతీయ అంతర్జాతీయ అంశాలను ఉదహరిస్తూ సమాధానాలు చెప్పారు.

  • టాటా స్టీల్‌ ఆసక్తి

ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును కొనుగోలు చేయాలన్న ఆసక్తి తమకు ఉందని టాటా స్టీల్‌ తెలిపింది. 22,000 ఎకరాల భూమి ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్‌కు గంగవరం పోర్టు దగ్గర కావడంతో, కోకింగ్‌ కోల్‌ వంటి ముడి పదార్థాలను సులువుగా రవాణా చేసే వీలుంది.

  • రూ.456 కోట్లు కేటాయింపు

కొవిడ్‌ మూడో దశను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల వైద్యానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా పిల్లల ఐసీయూలను నెలకొల్పనుంది. రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అత్యవసర నిధులను మంజూరు చేసింది కేంద్రం. మొత్తం రూ.456 కోట్లను కేటాయించింది. 1,119 పీజీ మెడికల్‌ రెసిడెంట్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించింది.

  • వ్యక్తిగత గోప్యత.. గాలిలో దీపం!

దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2019లో తెరపైకి తెచ్చింది. దేశంలో లావాదేవీలు నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాలు, ఈ-కామర్స్‌ కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని విదేశాలకు అమ్ముకోకుండా కట్టుదిట్టం చేయాలన్నది దీని ముఖ్యోద్దేశం. అయితే..2020 మార్చి నుంచి ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందు పెండింగ్‌లో ఉంది.

  • ఎన్టీఆర్​ కోసం బాలీవుడ్​ నుంచే!

'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనున్న తారక్​ తర్వాతి సినిమా కోసం బాలీవుడ్​ భామనే తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం ఎంపిక జరుగుతోంది.

06:49 August 18

టాప్​ న్యూస్@ 7AM

  • కొవిడ్ సిండ్రోమ్​కు కారణమేంటంటే?

కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో దీర్ఘకాలం పాటు వైరస్​ లక్షణాలు కనిపిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై పరిశోధన ఐర్లాండ్​ పరిశోధకులు పలు కారణాలను విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న వారి రక్తంలో గడ్డకట్టే కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

  • పర్యాటక రంగానికి పూర్వవైభవం

కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త ప్యాకేజీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ఇతర చర్యలు తీసుకుంటోంది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం సర్క్యూట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

  • తెరవెనక చైనీయులు..

పూచీకత్తు లేకుండానే రుణాలు.. ఆటాడితే చాలు రూ.లక్షలు.. మదుపు చేస్తే కళ్లు చెదిరే లాభాలంటూ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులకు ఆశచూపి.. యాప్‌ల ద్వారా రూ.వేలకోట్ల లావాదేవీలు నడిపించి, అందినంతా కొల్లగొట్టిన నేరస్థుల వెనుక చైనీయులున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

  • గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ

తయారీ రంగ కార్యకలాపాలు పెరగుతుండడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఓ వ్యాసంలో తెలిపింది. కరోనా ఆంక్షలు సడలించాక.. గిరాకీ పెరిగిందని, సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పింది.

  • హాకీకి ఒడిశా అండ

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను ఘనంగా సన్మానించింది ఒడిశా ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇరుజట్లకు మరో పదేళ్ల పాటు స్పాన్సర్​షిప్​ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​.

04:26 August 18

టాప్​ టెన్​ న్యూస్@ 6AM

  • పొద్దున్నే అగ్నిప్రమాదం...

తెల్లవారు జామున కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆనంద్​ షాపింగ్​ మాల్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే.. నాలుగు ఆంతస్తులకు మంటలు వ్యాపించాయి. రెండు గంటలకుపైగా రెండు ఫైర్​ ఇంజిన్​లు ప్రయత్నించినా.. మంటలు అదుపులోకి రాలేదు.

  • బడుల విలీనంపై కసరత్తు...

బడుల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై కసరత్తుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బోధన సిబ్బంది హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. విద్యార్థుల సంఖ్యను ప్రతీ పాఠశాలలో కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండాలని సర్కారు స్పష్టం చేసింది.

  • దండోరాకు సర్వం సిద్ధం..

కాంగ్రెస్‌ రెండో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహణకు సర్వం సిద్ధమయ్యాయి. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో.... ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఈ దండోరా సభకు లక్షమందికిపైగా జనం వస్తారన్న అంచనాతో... కాంగ్రెస్‌ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. మరోవైపు వర్షం పడుతోందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతోంది.

  • ఇంకా ఆచూకీ దొరకలేదు..

గాంధీ ఆస్పత్రి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అదృశ్యం అయిన బాధితురాలి సోదరి కోసం.. పలు చోట్ల గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో తమతో పాటు వచ్చిన రోగిని చేర్పించేందుకు వచ్చిన వీరి దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. కానీ బాధితురాలు, ఆమె సోదరి ఎక్కడికి వెళ్ళారు అనే దానికి సంబంధించిన.. దృశ్యాలు మాత్రం లభ్యం కాకపోవడం వల్ల పోలీసులకు కేసు క్లిష్టంగా మారింది. మరోవైపు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న.. టెక్నీషియన్ ఉమా మహేశ్వర్, సెక్యూరిటీ గార్డుతో పాటు.. మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • నేడే ఫలితాలు...

తెలంగాణలో ఈ-సెట్​ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

  • అఫ్గాన్​లో మంచిర్యాల వాసి...

విమాన టికెట్లు సిద్ధమై.. మరికొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనుకున్న ఇంటి పెద్ద అనూహ్యంగా అఫ్గానిస్థాన్​లో చిక్కుకుపోవటంతో ఆయన కుటుంబం భయాందోళనలో మునిగిపోయింది. ఆయన్ను క్షేమంగా ఇంటికి చేర్చాలని కేంద్ర సర్కారును వేడుకుంటోంది.

  • స్వేచ్ఛ కోరుకోవటం తప్పా...

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు స్వేచ్ఛ కోరుకుంటున్నారని సమాజ్​వాదీ పార్టీ ఎంపీ షఫికర్​ రహమాన్​ బార్క్​ వ్యాఖ్యానించారు. వారి చర్యలను భారత స్వాతంత్య్రోద్యమంతో పోల్చి చెప్పారు. దీనిపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎంపీ సిగ్గులేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

  • తెలుగు రాష్ట్రాలకు సుప్రీం జరిమానా...

రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. పది రోజుల్లోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయాలని, లేదంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • చిరుతో సినీపెద్దల భేటీ...

చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినీపెద్దలు స్పందించాలని టాలీవుడ్​ దర్శకనిర్మాత నట్టి కుమార్​ డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించేందుకు ప్రముఖ నటులంతా చిరంజీవి నివాసంలో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • వాళ్లది టెస్టు జట్టులా లేదే...

ఇంగ్లాండ్​ ఇద్దరు ఆటగాళ్ల జట్టు అని అన్నాడు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. జట్టులో కెప్టెన్​ జో రూట్​, పేసర్​ అండర్సన్​ మినహా మిగతా వారు పేలవంగా ఆడుతున్నారని తెలిపాడు.



 

Last Updated : Aug 18, 2021, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details