తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ముఖ్యాంశాలు

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS

By

Published : Aug 17, 2021, 5:55 AM IST

Updated : Aug 17, 2021, 10:01 PM IST

21:56 August 17

టాప్​ న్యూస్​ @10PM

  • భారత్ వైఖరి ఇదే!

తాలిబన్ల వ్యవహారంపై భారత్​ వేచిచూసే ధోరణిని అవలంబించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని భారత్​ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అమెరికాతో పాటు అఫ్గాన్​ సైనికులు విడిచిన ఆయుధాలతో తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారడం భద్రతాపరంగా ఆందోళకర విషయమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
 

  • కీలక భేటీ..

అఫ్గానిస్థాన్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, అమిత్ షా సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • ఏం జరిగింది..

గాంధీ ఆస్పత్రిలో (Gandhi hospital) అత్యాచార ఆరోపణల ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావును కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

  • ఆ వ్యాక్యం నన్ను రాజకీయాలవైపు నడిపింది..

దిల్లీలోని జేఎన్​యూ గోడలపై రాసిన ఓ వ్యాక్యం.. తనను రాజకీయాల వైపు నడిపించిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఐఏఎస్​ అధికారిగా చూడాలని తన తండ్రి కేసీఆర్​ అనుకున్నారని.. కానీ.. తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 

  • పక్కా ఎంటర్​టైనర్​..

"నాకు సినిమా అంటే పిచ్చి, సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా" అంటున్నారు నటుడు రాజా రవీంద్ర. శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ 'క్రేజీ అంకుల్స్‌' సినిమాలో రాజా కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజారవీంద్ర విలేకరులతో ముచ్చటించారు.

20:48 August 17

టాప్ న్యూస్​ @9PM

  • ప్రెసిడెంట్​ నేనే..

అఫ్గానిస్థాన్ తొలి ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్.. తనను తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

  • విడిచిపెట్టేది లేదు..

గాంధీ ఆస్పత్రిలో (Gandhi hospital) అత్యాచార ఆరోపణల ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావును కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

  • ఈ-సెట్​ ఫలితాల విడుదల..

తెలంగాణలో ఈ-సెట్​ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

  • వెయ్యికు పైగా కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 1,063 కొవిడ్​ కేసులు నమోదవగా.. ఈ మహమ్మారి కారణంగా 11మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా.. అనంతపురంలో ఒకరు మృతి చెందారు.

  • 'లవ్‌స్టోరీ' రిలీజ్ ఖరారు!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ మేరకు వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

19:53 August 17

టాప్​ న్యూస్​ @8PM

  • కీలక భేటీ..

అఫ్గానిస్థాన్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, అమిత్ షా సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • ఎట్టకేలకు స్పష్టత..

తాలిబన్ల వ్యవహారంపై భారత్​ వేచిచూసే ధోరణిని అవలంబించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని భారత్​ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అమెరికాతో పాటు అఫ్గాన్​ సైనికులు విడిచిన ఆయుధాలతో తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారడం భద్రతాపరంగా ఆందోళకర విషయమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

  • కొత్తగా 417 కేసులు..

రాష్ట్రంలో ఇవాళ 87,230 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 417 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 6,53,202కు చేరింది.

  • వైరల్​ వీడియో..

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో దంపతుల ఆత్మహత్య కరోనా వల్ల ప్రైవేట్‌ స్కూళ్ల యజమానులు, ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను కళ్లకుగడుతోంది. కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, అతని భార్య రోహిణి ఈ నెల 15న ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

  • బన్నీ వార్నింగ్..

'పుష్ప' సినిమాలోని సన్నివేశాల లీక్​పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. లీక్ గురించి తెలియగానే బన్నీ ఆశ్చర్యపోయారని చిత్ర యూనిట్ తెలిపింది.

18:49 August 17

టాప్​ న్యూస్​ @7PM

  • అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం..

భాగ్యనగరం మరో అంతర్జాతీయ భేటీకి వేదిక కానుంది. 2022 అక్టోబరులో జరిగే గ్లోబల్​ జియోస్పేషియల్​ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది.

  • మరో జాతీయ సంస్థ..

హైదరాబాద్​లో మరో జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ రాబోతోంది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి నిర్వహిస్తోన్న ట్రస్టు దీనిని ఏర్పాటు చేయనుంది. ట్రస్టు నిర్ణయం పట్ల హర్షం సీఎస్​ సోమేశ్​కుమార్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • భార్య కోసం అడ్వెంచర్​..

తన భార్య కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు ఓ భర్త. వాగులో చిక్కుకుపోయిన తన భార్యను ప్రాణాలకు తెగించి కాపాడుకున్నాడు. ఆమెను క్షేమంగా ఒడ్డుకు చేర్చి శభాష్ అనుపించుకున్నాడు.

  • యువతి అరుదైన ఘనత..

తమిళనాడులో 28ఏళ్ల యువతి అరుదైన ఘనత సాధించింది. ఆలయంలో ఒథువార్​గా ఎంపికైన రెండో మహిళగా నిలిచింది. స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్​ ఆమెకు అపాయింట్​మెంట్ ఆర్డర్ ఇచ్చారు. శివాలయంలో తొలి రోజు ఆమె ఆలపించిన భక్తిగీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అది కాస్తా వైరల్​గా మారింది.

  • కోహ్లీ సమస్య అదే..

టీమ్​ఇండియా సారథి కోహ్లీ కొంత కాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరిగిన రెండు టెస్టుల్లోనూ రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఎందుకు విఫలమవుతున్నాడో వివరించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​.

17:51 August 17

టాప్​ న్యూస్​ @6PM

  • కేటీఆర్​ మనసులో మాట

ఎన్నో ఏళ్లుగా ఎస్సీలు వివక్షతకు గురవుతున్నారని... దళితబంధు వల్ల ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మంత్రి కేటీఆర్​ అన్నారు. దళితబంధు వచ్చాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రకటించారు. కౌటిల్య స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ పాలసీ ఎంపీపీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్​ మాట్లాడారు.

  • 'టీకా రెండు డోసులే...'

పూర్తి వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు మరోసారి టీకా పొందేందుకు అనుమతి లేదని కేంద్రం తెలిపింది. కేరళ హైకోర్టులో ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టంచేసింది.

  • వాట్సాప్​ పేమెంట్స్ ఇక​ మరింత ఆకర్షణీయం!

పేమెంట్​ సేవలకు వాట్సాప్ కొత్త అప్​డేట్ ఇచ్చింది. 'పేమెంట్స్​ బ్యాగ్రౌండ్'​ పేరుతో.. లావాదేవీలను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఇంతకీ ఏమిటీ బ్యాగ్రౌండ్​ ఫీచర్​?

  • కోహ్లీ, రోహిత్​ సంబరాలు..

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్​ మ్యాన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయన్న వార్తలు కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే రెండో టెస్టులో ఇంగ్లాండ్ తరఫున ప్రమాదకరంగా మారుతున్న జానీ బెయిర్‌స్టో ఔటైన సందర్భంగా రోహిత్​-కోహ్లీలు చేసుకున్న సంబరాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • క్రిష్‌-వైష్ణవ్‌ చిత్రం విడుదల తేదీ ఖరారు!

క్రిష్​-వైష్ణవ్​తేజ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది.

16:49 August 17

టాప్​ న్యూస్​ @5PM

  • ఆ ప్రకటనల ఆంతర్యమేంటి?

కరుడుగట్టిన మత ఛాందసవాదం... క్రూర పాలన... భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపడం... అఫ్గాన్​లో తాలిబన్ల శకం గురించి మాట్లాడుకుంటే ముందుగా వినిపించే మాటలివి. కానీ ఇదంతా గతం! ఇప్పుడు తాలిబన్లు మారిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరు నిజంగానే మారిపోయారా? అసలేంటి కథ?

  • దేశమంతా లాక్​డౌన్..

డెల్టా వైరస్​ విజృంభణతో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. తమ దేశంలో కొత్తగా ఒక కరోనా కేసు రాగా... పూర్తి లాక్​డౌన్​ విధించింది న్యూజిలాండ్. కాగా, రెండు డోసుల టీకా వేయించుకున్నవారికి 8 నెలల తర్వాత బూస్టర్​ డోసు ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

  • 'ఆయిల్‌పామ్'పై సుంకం తగ్గించండి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఆయిల్​పామ్ విత్తన మొలకలపై పెంచిన సుంకాన్ని తగ్గించాలని ఆయన లేఖలో ప్రస్తావించారు.

  • గుండెంగిలో 'నిరుద్యోగ దీక్ష'..

ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​.షర్మిల మహబూబాబాద్​ జిల్లా గుండెంగిలో దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు.

  • అదిరే ఫీచర్లతో స్మార్ట్ టీవీలు!

ప్రస్తుతం స్మార్ట్ టీవీ అనేది దాదాపు ప్రతి ఇంట్లో కనబడుతోంది. రోజు రోజుకూ ఇంట్లో ఉండే టీవీల సైజూ పెరిగిపోతుంది. ఒకప్పటితో పోల్చితే టీవీల ధరలు కూడా చాలా తగ్గాయి. దీంతో చాలామంది 55 ఇంచుల టీవీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న మంచి టీవీల గురించి తెలుసుకుందాం.

15:49 August 17

టాప్​ న్యూస్​ @4PM

  • మాజీ ఎమ్మెల్యే కారు బోల్తా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడగా.. స్వల్ప గాయాలతో నర్సయ్య బయటపడ్డారు. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • ట్యూషన్​ టీచర్​ పైశాచికం..

 ట్యూషన్ టీచర్​ ఓ బాలుని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. హోంవర్క్ సరిగా చేయడంలేదని చితకబాదింది. బాలునికి ఒళ్లంతా వాతలు పడడంతో బాలుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్ ఠాణా పరిధిలో జరిగింది.

  • 10 రోజుల్లో సమాధానం చెప్పాలి..

జాతీయ భద్రత విషయంలో రాజీపడే ఏ అంశాన్ని కూడా కేంద్రం వెల్లడించాలని తాము కోరడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెగసస్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్​లపై వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

  • తక్కువ అంచనా వేశాం..

రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేశామని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా (34*), మహ్మద్‌ షమి (56*) తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు.

  • 'హరిహర వీరమల్లు' అప్డేట్​​..

మంగళవారం(ఆగస్టు 17) హీరోయిన్​ నిధి అగర్వాల్ ​పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది 'హరిహర వీరమల్లు' చిత్రబృందం. పవన్​కల్యాణ్​ కథానాయకుడిగా క్రిష్​ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

14:44 August 17

టాప్​ న్యూస్​ @3PM

  • సీసీ కెమెరా ఏమైందో..

గాంధీ ఆస్పత్రి ఘటనలో నలుగురు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో టెక్నిషియన్‌ ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

  • అప్పటి వరకు ఏం తెలీదు..

గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగిందనే ఆరోపణల గురించి బాధితురాలు చెబితే తప్ప ఏం చెప్పలేమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించినట్లు ఆమె వివరించారు.

  • ప్రజలందరికీ క్షమాభిక్ష..

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించిన తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు.

  • దేశానికి మీరు ఆదర్శం..

పారా ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యోలో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 24 నుంచి సెప్టంబర్ 5 వరకు పారాలింపిక్స్ (Tokyo paralympics) జరగనున్నాయి.

  • చిరుతో ప్రకాశ్​రాజ్​ భేటీ..

టాలీవుడ్​ అగ్రహీరో​ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. మెగాస్టార్​ లాంటి సోదరుడు తనకు దొరకడం అదృష్టమని పేర్కొన్నారు. దీంతో కొన్ని టాలీవుడ్​ చిత్రాల అప్​డేట్లు వచ్చేశాయి.

13:49 August 17

టాప్​ న్యూస్​@2PM

  • ఏం జరిగిందో తెలీదు..!

గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగిందనే ఆరోపణల గురించి బాధితురాలు చెబితే తప్ప ఏం చెప్పలేమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించినట్లు ఆమె వివరించారు.

  • అందుకు జీవో జారీ

ఉపాధ్యాయుల హేతుబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కలెక్టర్ల నేతృత్వంలో... ఐదుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

  • మరో 2 ఛార్జిషీట్లు దాఖలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఏడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ మరో రెండు అభియోగపత్రాలు సమర్పించింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో..... ఈడీ ఇటీవల ఛార్జ్‌షీట్లను కోర్టుకు సమర్పించింది.

  • 'మేం చనిపోతున్నాం'

కరోనా సోకిందన్న బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు స్థానిక పోలీస్​ అధికారికి ఫోన్​ చేసి.. తాము చనిపోతున్నామని, తమకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.

  • పెద్ద సినిమాల సందడి ఎప్పటికో?

12:46 August 17

టాప్​ న్యూస్​@1PM

  • సూపరింటెండెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్కచెళ్లెల్లపై సామూహిక అత్యాచారం ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. ఘటనపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఆరోపణలు రుజువయ్యే వరకు.. అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు.

  • ఆ జిల్లాల్లో ఇవాళ అతిభారీ వర్షాలు!

రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు(RAINS IN TELANGANA) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

  • కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్‌లోని ఓ కోళ్ల ఫారంలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం(Contaminated food) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మనీషా(13), కుమార్‌(10)  మృత్యువాత పడ్డారు. అదే ఆహారం తీసుకున్న తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

  • 'ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం'

అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు.

  • పసిడి మదుపరులకు యూబీఎస్​ హెచ్చరిక!

బంగారం ధరలు ఇటీవల కాస్త పుంజుకున్నట్లు కనిపించినా.. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి మదుపరులు భారీ నష్టాలను చవి చూడకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మేలని సూచించింది. ఇందుకు కారణాలు ఏమిటి? పసిడి ధరలు ఎందుకు తగ్గనున్నాయి?

12:05 August 17

టాప్​ న్యూస్​@12PM

  • తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొన్న ఫేస్‌బుక్‌!

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్‌ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోవడం గమనార్హం.

  • బలితీసుకున్న వివాహేతర సంబంధం 

నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో దంపతులు దారుణానికి ఒడిగట్టారు. ఓ యువకుడి గొంతు కోసం హతమార్చారు(MURDER). అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

  • నలుగురు సజీవదహనం

రాజస్థాన్​లోని అజ్మేర్​లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 8పై రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇంజిన్​లో భారీగా మంటలు చెలరేగాయి. నలుగురు సజీవదహనమయ్యారు.

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ ఇదే

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) విడుదల చేసింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అక్టోబరు 24న భారత్​-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నట్లు స్పష్టం చేసింది.  

  • 'చతుర్‌ ముఖం' ఎలా ఉందంటే?

మలయాళ హిట్​ మూవీ 'చతుర్​ ముఖం' సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమా కథేంటీ? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలను ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

10:19 August 17

టాప్​ న్యూస్​@11AM

  • 5 నెలల కనిష్ఠానికి కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25,166 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. గడిచిన 154 రోజుల్లో ఇవే అతితక్కువ. మరో 437 మంది మరణించారు.

  • కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చట్లేదని... దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయాన్ని... మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తూ వ్యగ్యంగా స్పందించారు.

  • సొంతదేశం వెళ్లలేం.. హైదరాబాద్‌ను వీడలేం

ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి భారత్​కు వచ్చారు. మంచిగా చదువుకుంటూ.. బంగారు భవిష్యత్​ కోసం కలలు కంటున్న వారికి కొన్నిరోజులుగా మనసు మనసులో లేదు. మాతృభూమి ముష్కర మూకల చేతుల్లో బందీ అయ్యిందన్న సమాచారంతో కంటతడి పెడుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు పరితపిస్తున్నారు. అఫ్గానిస్థాన్​లో ఉంటున్న తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు.

  • అఫ్గాన్​లో భారత ఎంబసీ మూసివేత.. 

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొస్తోంది. 120 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్​ విమానాశ్రయం నుంచి స్వదేశానికి బయల్దేరింది.

  • కథలతో ప్రయోగాలు.. సినిమాలతో సంచలనాలు!

భారతీయ వెండితెరకు భారీ హంగులతో కూడిన చిత్రాల రుచి చూపించిన దర్శకుడు శంకర్‌. తన విజన్‌తో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తూ.. దక్షిణ భారత సినిమా స్థాయిని పెంచిన ఘనత శంకర్‌కు దక్కుతుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా.. '2.0'తో సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్​ చిత్రం తెరకెక్కించిన దర్శకుడిగా శంకర్‌ గుర్తింపు పొందారు. నేడు (ఆగస్టు 17) శంకర్ 58వ​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

09:52 August 17

టాప్​ న్యూస్​@10AM

  •  అధునాతన ఆయుధాలు.. తాలిబన్‌ పాలు

అఫ్గాన్‌ సేన పలాయనం ఫలితంగా అఫ్గాన్​లో ముష్కర ముఠా చేతికి ఇప్పుడు వైమానిక దళం వచ్చి చేరింది. అష్రాఫ్‌ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. భారీ పెట్టుబడులతో ఇప్పటివరకు ఒనగూరిన ప్రయోజనాలన్నీ తాలిబన్ల పరమయ్యాయి.

  • అన్ని ఆస్పత్రుల్లోనూ రాత్రయితే అదే భయం!

చీకటి పడితే చాలు.. ప్రభుత్వ దవాఖానాల్లో భయానక వాతావరణం నెలకొంటోంది. రోగులు, వైద్యులు, సిబ్బందితో పగటి పూట హడావుడిగా ఉన్నాసరే...రాత్రి అయితే చాలు పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. డ్యూటీ డాక్టర్లు వార్డుల్లో తిరగకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.190 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ.355 ఎగబాకింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • ఈ విజయం మాకెంతో ప్రత్యేకమైనది: కోహ్లీ

క్రికెట్​ పుట్టినిల్లు లార్డ్స్​లో జరిగిన మ్యాచ్​ గెలుపొందడం చాలా ప్రత్యేకమైనదని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. రెండో టెస్టు తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. జట్టును చూసి గర్వపడుతున్నాని మ్యాచ్​ అనంతరం జరిగిన కార్యక్రమంలో వెల్లడించాడు.

  • 'టక్​ జగదీష్​' ఓటీటీ రిలీజ్​ అప్పుడేనా?

'టక్​ జగదీష్'​ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి ఇప్పటికే డీల్​ కుదరగా.. వినాయక చవితి సందర్భంగా రిలీజ్​ చేయడానికి చిత్రబృందం యోచిస్తున్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ​

08:46 August 17

టాప్​ న్యూస్​@9AM

  • సవివర ప్రమాణ పత్రం అవసరమా? లేదా?

పెగసస్​ వ్యవహారంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్పైవేర్ అంశంపై కేంద్రం సవివరమైన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలా? వద్దా? అనేదానిపై మంగళవారం నిర్ణయాన్ని వెలువరిస్తామని ప్రకటించింది.

  • ప్రకటనల్లో హీరోలు.. పాటించడంలో జీరోలు

సాయం కోసం పోలీసుస్టేషన్​కు వచ్చే బాధితులకు అండగా ఉండేందుకు జీరో ఎఫ్​ఐఆర్ విధానాన్ని డీజీపీ ఎం.మహేందర్​ రెడ్డి తీసుకొచ్చారు. మొదట్లో బాగానే అమలైన ఈ విధానం... ప్రస్తుతం అటకెక్కింది. మాకు అన్యాయం జరిగింది మొర్రో అంటూ స్టేషన్​కు వస్తున్న బాధితులను... తమ పరిధి కాదంటూ పంపేస్తున్నారు ఖాకీలు.

  • తుపాకులతో తాలిబన్ల గర్జన

కళ్లెదుట తుపాకులతో తాలిబన్ల గర్జన.. కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న రేపటి రాక్షస పాలన.. నేటి పరిస్థితులు బాగోలేవన్న ఆవేదన.. రేపన్నది మరింత దారుణంగా ఉండబోతోందన్న భయాందోళన.. పోరు మధ్యలోనే కాడి వదిలేసిన అమెరికా బలగాలు.. పోరాటమన్న పదమే తమకు తెలియదన్నట్లు దాసోహమన్న స్వదేశీ దళాలు.. అఫ్గానిస్థాన్‌ పౌరులు అల్లాడుతున్నారు. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

  • లార్డ్స్​లో ఓ అద్భుతం.. 

ఒక్కరైనా ఊహించి ఉంటారా కోహ్లీసేన గెలుస్తుందని? ఇంగ్లాండ్‌కు పొరపాటునైనా ఈ ఫలితం వస్తుందన్న ఆలోచన వచ్చి ఉంటుందా? లార్డ్స్‌లో అద్భుతమే జరిగింది. ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాక్‌! కోహ్లీసేన సంచలనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, అదిరే ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. టీమ్‌ఇండియా పోరాటం అద్వితీయం.

  • కాజల్​ ఫిట్​నెస్​ సీక్రెట్​ తెలుసా?

ముప్పై ఆరేళ్లు వచ్చినా తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది నటి కాజల్ అగర్వాల్. మరి తన అందంతో పాటు శరీర సౌష్టవాన్ని కాపాడుకునే ఫిట్​నెస్​ రహస్యాన్ని చెబుతోంది. అదేంటో మీరూ తెలుసుకోండి!

07:47 August 17

టాప్​ న్యూస్​@8AM

  • 'గాంధీ'లో సామూహిక అత్యాచారం..!

రాజధానిలో దారుణం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం ఓ రోగికి.. సహాయకులుగా వచ్చిన అక్కాచెల్లెళ్లు.. అత్యాచారానికి గురయ్యారు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు... గదిలో నిర్బంధించి మత్తు మందిచ్చి.. వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆచూకీ లభించని మరో మహిళ కోసం ప్రశ్నిస్తున్నారు.

  • ఆ కేసులో మంత్రిదే కీలకపాత్ర

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్​ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్​ గనులు లీజు కేటాయింపుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.

  • బాబాయి అత్యాచారం.. సోదరుడి వేధింపులు..

తల్లిదండ్రులు చనిపోవడంతో... పెదనాన్న, పెద్దమ్మలు ఆమెను పెంచి పోషించారు. కానీ సొంత చిన్నాన్న, పెద్ద నాన్న కుమారులే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. భరించలేని ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

  • 'కొట్టేసిన నిబంధనలతో మళ్లీ చట్టమా?'

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లును ఎందుకు తీసుకువచ్చారని కేంద్రానికి చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. దీనిపై పార్లమెంటులోనూ చర్చలు జరగలేదని అభిప్రాయపడింది.

  • లార్డ్స్​లో ఓ అద్భుతం

ఒక్కరైనా ఊహించి ఉంటారా కోహ్లీసేన గెలుస్తుందని? ఇంగ్లాండ్‌కు పొరపాటునైనా ఈ ఫలితం వస్తుందన్న ఆలోచన వచ్చి ఉంటుందా? లార్డ్స్‌లో అద్భుతమే జరిగింది. ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాక్‌! కోహ్లీసేన సంచలనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, అదిరే ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. టీమ్‌ఇండియా పోరాటం అద్వితీయం.

06:56 August 17

టాప్​ న్యూస్​@7AM

  • జీవో 111పై సర్కారుకు హైకోర్టు ఆదేశం..

కోకాపేట భూముల వేలాన్ని నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. జీవో 111 కు సంబంధించిన ప్రభుత్వం సమర్పించిన నివేదిక పరిశీలించిన మీదట ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కోకాపేట భూముల వేలంలో జోక్యానికి నిరాకరించామని, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​ను పరిశీలించిన మీదట గత ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామని వేలానికి సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దీనికి జత చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. భూములకు సంబంధించి ప్రభుత్వానివి ద్వంద్వ ప్రమాణాలని తప్పుబట్టింది.

  • సాగర భద్రతకు అనుసరణీయ సూత్రాలతో భారత్​

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారత్‌ తిరుగులేని విజయాన్ని సాధించింది. సముద్ర భద్రతకు ప్రధాని మోదీ సమర్పించిన అయిదు ప్రతిపాదనలను భద్రతా మండలి సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ వర్చువల్‌ సమావేశంలో చెప్పుకోవలసిన అంశం- 1982 డిసెంబరు 10న కుదిరిన ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒప్పందం (యున్‌క్లోస్‌)ను భద్రతా మండలి అధికారికంగా గుర్తించడం. చాలాకాలంగా యున్‌క్లోస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా కూడా ఈసారి గుర్తింపు ఇవ్వడం విశేషం.

  • ఉచిత నీటి సరఫరా పథకం అమల్లో అవస్థలు..

హైదరాబాద్ నగరంలో ఉచిత నీటి సరఫరా పథకం అమలు నత్తనడకన సాగుతోంది. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి కోసం.. ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని మొదట జలమండలి ప్రకటించడంతో నగర వాసులు ఆధార్ సీడింగ్ చేయించారు. కానీ ఇటీవల నల్లాలకు ఉన్న నీటి మీటర్లు పనిచేయకుంటే .. పథకం అమలు కాదని వెల్లడించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసినా నీటి మీటరు పనిచేయకపోవడంతో.. బిల్లులు వేలల్లో వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

  • ఆన్​లైన్ విద్యతో.. మసకబారుతున్న సృజన!

ఆన్‌లైన్‌ బోధన వల్ల పాఠాలు చదివి మననం చేసుకుని పరీక్షలు రాయాలన్న ధ్యాస విద్యార్థుల్లో క్రమేపీ తగ్గిపోతోంది. గతంలో రోజులో సగం సమయం విద్యాలయంలో గడిపే విద్యార్థులు కేవలం తరగతి గది అభ్యసనే కాకుండా గ్రంథాలయం, క్రీడలు వంటి వాటితో మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కరవై వారిలో సృజనాత్మకత, పరిశీలన, పరిశోధనా శక్తి కొరవడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

  • రిలయన్స్​లో అరామ్‌కోకు 20% వాటా!

రిలయన్స్‌లో దాదాపు 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కో(Aramco Reliance) సొంతం చేసుకోవచ్చని 'బ్లూమ్‌బర్గ్‌' వార్తా సంస్థ తెలిపింది. ప్రతిగా అరామ్‌కోలో ఆర్‌ఐఎల్‌కు వాటా దక్కనుందని చెప్పింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈమేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ షేర్లు సోమవారం లాభాలందుకున్నాయి.

04:48 August 17

టాప్​ న్యూస్​@ 6AM

  • ఉద్యోగులకూ దళిత బంధు..

సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన దళితబంధు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఉద్యోగుల కుటుంబాలకూ లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్లలో దళిత బంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వం పథకం కింద మాత్రమే మిగిలిపోకూడదని.. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలని సీఎం స్పష్టం చేశారు.

  • ఆర్టీసీ బస్సు బోల్తా...

కర్నూలు నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అలంపూర్​ చౌరస్తా సమీపంలో డివైడర్​ ఢీకొట్టటంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

  • నివేదికలు సమర్పించండి...

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి..కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటివరకు నివేదిక సమర్పించకపోవడాన్ని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తప్పుబట్టింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తమ నివేదికను మెయిల్‌లో పంపడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేఆర్‌ఎంబీ..27వతేదీ లోపు నిబంధనల ప్రకారం ట్రైబ్యునల్‌లో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.

  • ఉద్రిక్తంగా గుంటూరు నగరం..

ఏపీలోని గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య మృతదేహం తరలింపు నుంచి అంత్యక్రియల వరకు అనుక్షణం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రమ్య తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు తెలుగుదేశం నేతలతో కలిసి లోకేశ్‌ వారి ఇంటివద్దకు చేరుకోగా.. అదే సమయానికి వైకాపా నేతలు సైతం కార్యకర్తలతో కలిసి అక్కడికి రావడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల అరుపులు, కేకలు, కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, వ్యక్తిగత దూషణలు, తోపులాటలతో గుంటూరులోని జీజీహెచ్‌ సమీపంలోని ప్రధాన రహదారి రణరంగాన్ని తలపించింది.

  • మూడో దశ హెచ్చరికలు..

కొవిడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మూడో దశ కరోనా విజృంభణ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • భారత్​కు పక్కలో బల్లెం...

మధ్యయుగాల ఛాందస పాలనా పద్ధతుల అమలులో ఘనచరిత్ర కలిగిన తాలిబన్లు మళ్లీ అఫ్గాన్‌ పీఠమెక్కారు. కీలక నగరాలను కైవసం చేసుకొంటూ మెరుపు వేగంతో ఆ దేశ రాజధానిలో పాగావేశారు. కశ్మీర్‌లో లోగడ పట్టుబడిన ఉగ్రవాదుల్లో తాలిబన్లు ఉన్నారంటున్న మాజీ సైన్యాధికారులు- ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ఆవిర్భావం భారత్‌కు పక్కలో బల్లెమేనని హెచ్చరిస్తున్నారు.

  • మా బాధ్యత కాదు..

అఫ్గానిస్థాన్‌లో కేంద్రీకృత ప్రజాస్వామ్యం నిర్మించడం తమ లక్ష్యం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అఫ్గాన్​ నుంచి తమ బలగాల ఉపసంహరణ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. 20 ఏళ్ల తర్వాత అఫ్గాన్‌ నుంచి సైనికులను వెనక్కి రప్పించడానికి ఇదే సరైన సమయమని భావించినట్లు చెప్పారు.

  • అఫ్గాన్​పై ఐరాసా స్పందన...

అఫ్గానిస్థాన్‌ను ఉగ్రవాద సంస్థలు వేదికగా చేసుకునే అవకాశాన్ని మరోసారి కల్పించకూడదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. యావత్‌ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది.


  • భారత్​ చారిత్రక విజయం..

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో.. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో అద్భుత పోరాట పటిమ చూపింది. ఐదో రోజు కేవలం రెండు సెషన్లలోనే ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి, ప్రతిష్ఠ్మాతక సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

  • హ్యాపీ బర్త్​డే అందాల 'నిధి'...

అందం, అభినయంతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది నటి నిధి అగర్వాల్. ఈమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. హాటు అందాలతో.. ఘాటు ఫోజులతో.. సోషల్​ మీడియాలో సందడి చేసే... ఈ అందాల "నిధి" పుట్టినరోజు నేడు. 




 

Last Updated : Aug 17, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details