టాప్ న్యూస్@6AM
- దళిత బంధు నగదుతో ఏమి చేయవచ్చో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం నిధులను ఏ విధంగా వినియోగించుకోవచ్చో సూచిస్తూ.. ప్రభుత్వం కొన్ని వివరాలను వెల్లడించింది. వాసాలమర్రిలో పథకం ప్రారంభమైనా... పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు.
- గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపునకు సన్నాహాలు
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపునకు రంగం సిద్ధమవుతున్న వేళ... కమీషన్ ఏజెంట్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన బాట సింగారం లాజిస్టిక్ పార్కు క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం విఫమైంది. అధికారులెవరూ రాకపోవడంతో కమీషన్ ఏజెంట్లు పెదవి విరుస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్లాలంటే ఎలా అంటూ మండిపడుతున్నారు.
- రూ.500, 1000కే హత్యలు.. నివ్వెరపోయిన పోలీసులు
డబ్బుల కోసం కొంత మంది హత్యలు చేస్తుంటారు. లక్షలు, కోట్లు కాజేస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం 500, 1000 రూపాయల కోసం హత్యలు చేశాడు. ఓ కేసు విచారణలో నిందితుడిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.. అతడు మరో రెండు హత్యలు చేశానని..అంగీకరించడంతో కంగుతిన్నారు.
- నేతలపై ఉన్న కేసుల ఎత్తివేతపై హైకోర్టుల సమీక్ష!
హైకోర్టుల అనుమతితోనే ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుల విచారణ జరుపుతున్న జడ్జిలను బదిలీ చేయకూడదని ఆదేశించింది. రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఉపసంహరించుకున్న క్రిమినల్ కేసులను హైకోర్టులు సమీక్షించాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది. భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా అడ్డగించిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో ఓ మహిళను గర్భవతిని చేసి పారిపోయిన వ్యక్తిని బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు.
- మనిషి నిర్లక్ష్యం... ధరణికి శాపం!
అభివృద్ధి పేరిట మనిషి ఏళ్లుగా ప్రకృతి వినాశనానికి పాల్పడుతున్నాడు. వ్యక్తిగత వాహనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం, విద్యుచ్ఛక్తి, పెట్రోలియం ఉత్పత్తులను విచ్చలవిడిగా వినియోగిస్తూ ఒకవైపు కాలుష్యానికి, మరోవైపు భూతాపం పెరిగిపోవడానికి ప్రధాన కారణం అవుతున్నాడు. దీంతో భూమ్యాకాశాలే కాక సముద్రాలూ వేడెక్కి జీవవైవిధ్యం పూర్తిగా దెబ్బతింటోంది.
- మంటలను అదుపు చేస్తూ 25మంది సైనికులు మృతి!
అల్జీరియాలో భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసే క్రమంలో 25 మంది జవాన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది.
- 'ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా'
ఏటీఎంలలో నగదు కొరత కారణంగా బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యంత్రాల్లో నగదు అందుబాటులో లేని సమయం.. నెలకు 10 గంటలు దాటితే సంబంధిత బ్యాంకుపై 10 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
- '15 నెలలుగా పడ్డ కష్టానికి ఫలితమే ఈ కాంస్యం'
ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపై పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. గత 15 నెలల కష్టానికి ప్రతిఫలం ఇది అని అన్నాడు.
- ఎంగేజ్మెంట్ పూర్తి.. నెక్ట్స్ పెళ్లే అంటున్న నయన్
స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నారని మనకు తెలుగు. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. నయన్ వేలికి ఉంగరం, విఘ్నేశ్ షేర్ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా? అన్న చర్చ అప్పటినుంచే మొదలైంది. ఇప్పుడదే విషయంపై స్పష్టతనిచ్చింది నయన్.