తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - news in telugu

etv bharat headline news
etv bharat headline news

By

Published : Aug 10, 2021, 5:44 AM IST

Updated : Aug 10, 2021, 9:58 PM IST

21:54 August 10

టాప్​ న్యూస్​ @ 10PM

494 మందికి పాజిటివ్

రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​ బారినపడి మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 8,112 యాక్టివ్​ కేసులున్నాయి.


20వేలు దాటిన కరోనా కేసులు

కేరళలో మరోసారి కరోనా విజృంభించింది. కొత్తగా ఆ రాష్ట్రంలో 21 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​తో మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్తగా 5 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి.

పరీక్షల తేదీలొచ్చేశాయ్

10,12వ తరగతి విద్యార్థుల మార్కుల ఇంప్రూవ్​మెంట్​కు సంబంధించి సీబీఎస్​ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనుంది.


కేంద్రం హెచ్చరిక!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ పౌరులంతా వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని హెచ్చరించింది. అక్కడ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు కూడా తమ సిబ్బందిని భారత్​కు తీసుకురావాలని సూచించింది.


ప్రాక్టీస్​ కోసమే

ఐపీఎల్​ (IPL 2021) రెండో దశలో భాగంగా ప్రాక్టీస్​ కోసం చెన్నై చేరుకున్నాడు సీఎస్కే కెప్టెన్ ధోనీ (MS Dhoni). అతడితో పాటు భార్య సాక్షి, కుమార్తె జీవా వెంటవచ్చారు. దీనిపై స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ.. ప్రపంచ సింహాల దినోత్సవమైన ఆగస్టు 10న తమ సింహం చెపాక్​ చేరుకుందని పేర్కొంది.

20:42 August 10

టాప్​ న్యూస్​ @ 9PM

ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ, నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు ఆయా జిల్లా కలెక్టర్లు సారథ్యం వహించగా.. రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇతరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

సీన్​ రిపీట్​ కావాలి

హుజూరాబాద్​లో ఉప ఎన్నికలు కేవలం తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికే తీసుకొచ్చారని వైఎస్​ఆర్​టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఈ ఉప ఎన్నికలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. సిరికేడులో చేపట్టిన నిరుద్యోగ దీక్షను ఆమె విరమించారు.


తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేదు

పోడు భూములకు పట్టాలివ్వాల్సిందేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్​ చేశారు. నిన్న ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.


ఓబీసీ బిల్లుకు ఆమోదం

వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఓకే చెప్పాయి విపక్షాలు. బిల్లుకు మద్దతుగా 385 మంది ఎంపీలు ఓటేశారు. 

ఫైట్ మాస్టర్ మృతి..

ప్రముఖ ఫైట్ మాస్టర్ వివేక్​ మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. అనుమతులు లేకుండా షూటింగ్స్​లో ప్రమాదకర స్టంట్స్​ చేయొద్దని అన్నారు.

19:45 August 10

టాప్​ న్యూస్​ @ 8PM

  • వ్యవసాయ రంగ బలోపేతమే సర్కార్ లక్ష్యం

హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయ రంగంపై ఆ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్​ రెడ్డి పాల్గొన్నారు.

  • తెలంగాణ నంబర్​ వన్​

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లో మంత్రి గంగుల కమలాకర్​ పర్యటించారు. సీటీ సెంట్రల్ హాల్‌లో పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పద్మశాలి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎకరం స్థలం, రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్‌ కాపీలను పద్మశాలి సంఘం నాయకులకు అందించారు.

  • జరిమానా!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయనందుకుగానూ భాజపా, కాంగ్రెస్‌, మరో ఐదు పార్టీలకు రూ. లక్ష చొప్పున సుప్రీంకోర్టు జరిమానా విధించింది. సీపీఎం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.

  • సిక్స్​ కొడితే బంతి మార్చాల్సిందే!

కొవిడ్ నేపథ్యంలో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) (IPL News) కోసం భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై బంతి సిక్స్​ పడిందంటే చాలు మరో కొత్త బంతిని ఇవ్వనుందట.

  • ఘాటు చూపులతో కట్టిపడేస్తూ

'దబంగ్​ 3' చిత్రంతో వెండితెరకు పరిచయమైన సయీ మంజ్రేకర్​.. ఇప్పుడు టాలీవుడ్​లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్​మీడియాలోనూ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోలను ఓ సారి చూసేద్దాం..


 

18:59 August 10

టాప్​ న్యూస్​ @ 7PM

  • చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. నోటి తీటను తీర్చుకునేందుకు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ పనిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.

  • పోలీసుల సేవకు అంకితం

విశ్వ క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన తెలుగుతేజం పీవీ సింధు (PV SINDHU)ను హైదరాబాద్​ కమిషనరేట్​ పోలీసులు ఘనంగా సన్మానించారు. సీపీ అంజనీకుమార్ ఆమెకు​ పుష్పగుచ్ఛం అందించి.. శాలువాతో సత్కరించారు.

  • బిలియనీర్లు 136 మందే!

2020-21 సమయంలో దేశవ్యాప్తంగా 136 మంది బిలియనీర్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019-20తో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. సంపద పన్ను రద్దు కారణంగా బిలియనీర్ల సంపద వివరాలు ఆర్థిక శాఖ వద్ద లేవని వెల్లడించింది.

  • 50% కేసులు ఆ రాష్ట్రం నుంచే!

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం కేసులు కేరళ నుంచే వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ఆర్​-ఫ్యాక్టర్​ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.

  • ద్రవిడ్​.. టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ అవుతారా?

దిగ్గజ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​.. టీమ్​ఇండియా కోచ్​గా బాధ్యతలు అందుకుంటారా? ప్రస్తుతం అభిమానులకు వస్తున్న సందేహం ఇది. జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. మరోసారి ఆ పదవికి దరఖాస్తు చేస్తారా? లేదా అనేది చూడాలి.


 

17:58 August 10

టాప్​ న్యూస్​ @ 6PM

  • 30 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్'

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ నిర్వహించనున్నారు.

  • అమెరికాపై కరోనా పంజా

డెల్టా వేరియంట్ల ఉద్ధృతితో ప్రపంచ దేశాల్లో మళ్లీ పంజా విసురుతోంది కరోనా. అమెరికాలో రోజుకు లక్ష మందికిపైగా వైరస్​ బారినపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హ్యూస్టన్​లోని ప్రభుత్వ ఆస్పత్రుల బయట టెంట్లు వేసి రోగులకు చికిత్స అందిస్తున్న తీరు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు.. చైనాలోనూ వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది.

  • గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్​ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు సోమవారం రాత్రి విందు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గాంధీలు లేకుండానే ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నం చేయడం వల్ల ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అదిష్ఠానానికి తెలియజేసేందుకే సిబల్ ఈ భేటీ నిర్వహించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • ప్రాణాపాయ స్థితిలో ప్రముఖ క్రికెటర్!

ప్రముఖ క్రికెట్ ఆల్​రౌండర్ క్రిస్ కైర్నస్(51) ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం అతడిని లైఫ్ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

  • నటి హేమకు షోకాజ్ నోటీసులు

'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్​పై ఆరోపణలు చేసిన నటి హేమకు క్రమశిక్షణా సంఘం షోకాజ్​ నోటీసులు (Show Cause Notice to Hema) జారీ చేసింది. 'మా' అధ్యక్ష పదవికి (MAA Elections) పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో 'మా' క్రమశిక్షణ సంఘం రంగంలోకి దిగింది.

16:48 August 10

టాప్​ న్యూస్​ @ 5PM

  • రేవంత్​ తగ్గించుకో..

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు విమర్శలు ఎక్కుపెట్టారు. తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లిలో సభను పెట్టుకున్నారని మండిపడ్డారు.

  • మమ్మల్ని కాపాడండి

జగద్గిరిగుట్ట పోలీసులు తమను రోజూ వేధిస్తున్నారని ఓ కుటుంబం హెచ్చార్సీని(HRC) ఆశ్రయించింది. సివిల్ కేసులో జోక్యం చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్చలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

  • టికెట్​ కొనాలా? ఇలా చేయకండి!

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు.. విమాన టికెట్ ధరలను సంబంధిత ఎయిర్​లైన్​ సంస్థ వెబ్​ సైట్లోనే చూసుకోవాలని డీజీసీఏ సూచించింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో ఇటీవల ధరలు అధికంగా ఉన్నట్లు చూపించిన నేపథ్యంలో ఈ సలహాలు ఇచ్చింది. విమానయాన సంస్థలు కూడా టికెట్​ ధరల విషయంలో జాగ్రత్త వహించాలని డీజీసీఏ పేర్కొంది.

  • హోదాను పునరుద్ధరించాలి

అసెంబ్లీ ఎన్నికలకు ముందే జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. దిల్లీ నుంచి జమ్ముకశ్మీర్ నేరుగా దాడికి గురవుతోందని ఆరోపించారు. తమ కుటుంబం కశ్మీర్​లోనే ఉండేదని, ప్రస్తుతం తన సొంత ఇంటికి వచ్చినట్లుగానే ఉందన్నారు రాహుల్​. శ్రీనగర్​లో పార్టీ నూతన కార్యాలయన్ని ప్రారంభించారు.

  • మీ ఎస్​బీఐ అకౌంట్ క్లోజ్​!

మీకు ఎస్​బీఐలో ఖాతా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. ఖాతాదారులంతా.. సెప్టెంబర్ 30 లోపు పాన్​-ఆధార్​ అనుసంధానం పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఎస్​బీఐ. లేదంటే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. ఎస్​బీఐ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం.

16:01 August 10

టాప్​ న్యూస్​ @ 4PM

  • పౌరసత్వాన్ని వదులుకున్నారు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. కేంద్రం తరఫున ఏఎస్​జీ రాజేశ్వరరావు, చెన్నమనేని తరఫున న్యాయవాది రామారావు, పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ తరఫున రవికిరణ్ వాదనలు వినిపించారు.

  • భారీ అగ్నిప్రమాదం

పంజాబ్​ జలంధర్​ జిల్లాలోని ప్లాస్టిక్​ పైపుల తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడగా.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

  • 8 ఏళ్ల బాలుడు.. అర్ధరాత్రి సైకిల్​పై 92 కి.మీ..

తోటిపిల్లలతో సరదాగా ఆడుతూపాడుతూ తిరిగే ఓ బాలుడు తన తల్లిని కలుసుకునేందుకు పెద్ద సాహసమే చేశాడు. తండ్రితో గొడవ పెట్టుకుని అమ్మమ్మ ఊరికి వెళ్లిన తల్లి కోసం రాత్రిపూట సైకిల్​పై బయలుదేరాడు. ఇంతకూ ఆ చిన్నోడు తన తల్లిని చేరుకోగలిగాడా?

  • ఏడు పదుల వయస్సులో...

గుజరాత్‌లోని ద్వారక నుంచి తిరుమలకు మధ్య దూరం దాదాపు 2 వేల 200 కిలోమీటర్లు. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని కాలినడకతో చెరిపేయాలనుకుంటే సాహసమే అవుతుంది. అదీ ముదిమి వయస్సులో పూనుకుంటే! ఓ రకంగా అసాధ్యమే. కానీ సుసాధ్యం చేస్తోంది.. గుజరాత్‌కు చెందిన ఓ మిథునం.

  • ప్రకాశ్​రాజ్​కు​ గాయం

నటుడు ప్రకాశ్​రాజ్​ షూటింగ్​లో​ గాయపడినట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేయించుకోవడానికి హైదరాబాద్​ వస్తున్నట్లు వెల్లడించారు.

14:57 August 10

టాప్​ న్యూస్​ @ 3PM

  • ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్​ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రవీణ్​కుమార్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్​ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. వైద్యుల సలహాలు తీసుకుని ప్రవీణ్​ కుమార్​ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

  • సీతారాముల నిత్యకల్యాణ వేడుక

భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో.. స్వామి వారి నిత్యకల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అర్చకులు పూజలు నిర్వహించారు.

  • ప్రతి ఇంటికి ఎల్​పీజీ కనెక్షన్​​

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉజ్వల 2.0 పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించారు.

  • అంతా సిద్ధం!

ఒలింపిక్స్​లో(Olympics) క్రికెట్​ను చేర్చే అవకాశాలున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) స్పందించింది. విశ్వక్రీడల్లో క్రికెట్​ను ​చేర్చేందుకు సన్నాహాలు జరుపుతున్నామని ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్​ బార్క్​లే వెల్లడించారు. 2028లో అమెరికాలోని లాస్​ఏంజెలెస్​​(Los Angeles Olympics 2028) వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో క్రికెట్​కు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

  • ట్రైలర్స్​

నరేశ్‌ కొప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పాగల్​'. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్​ని విడుదల చేసింది చిత్రబృందం. హృషికేశ్‌, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో విడుదలకు సిద్ధమైన 'బొమ్మల కొలువు' ట్రైలర్​ కూడా విడుదలైంది.

13:47 August 10

టాప్​న్యూస్​ @2 PM

  • తల్లిని కొట్టి చంపిన తనయుడు

రంగారెడ్డి: చేవెళ్ల మం. కుమ్మర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిని బండరాయితో కొట్టి చంపిన కుమారుడు హతమార్చాడు. తాగి వస్తున్నాడని తల్లి మందలించడంతో క్షణికావేశానికి గురయ్యాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో.. బండరాయితో కొట్టి హత్య చేశాడు.

  • రియల్టర్ దారుణ హత్య

ఓ వ్యక్తిని హత్యచేసి... కారు డిక్కీలో పెట్టి దుండగులు నిప్పుపెట్టిన ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది. కారుతో పాటు పూర్తిగా దగ్ధమైన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • లీటరు పాలు రూ.10వేలు

లీటరు పాల ధర ఏకంగా రూ. 10 వేలు పలుకుతోంది. అయితే.. ఆ పాలు ఏ గేదెవో, ఆవువో కాదు.. ఓ గాడిదవి అంటే నమ్మగలరా? మరి గాడిద పాలకు ఇంత ధర ఎందుకు ఉందో తెలుసుకోండి.

  • దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

దక్షిణ కొరియాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి కిమ్​ యో జోంగ్​. అమెరికాతో సైనిక విన్యాసాలు ఆక్రమణ ఉద్దేశంతో చేసేవిగా అభివర్ణించారు. ఈ ప్రదర్శనల ద్వారా అణ్వాయుధ చర్చల వెనక అమెరిక కపటత్వం కనిపిస్తోందన్నారు. దక్షిణ కొరియా నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ జరిగే వరకు కొరియన్​ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు.

  • అందువల్లే సెమీస్​లో ఓడిపోయా

టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics 2021)లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా(bajrang punia bronze) తన అనుభవాలను పంచుకున్నాడు. మోకాలి గాయంతో సాధించిన ఈ కాంస్యం కుటుంబ సభ్యులకు బంగారంతో సమానమని వెల్లడించాడు.


 


 


 


 

12:31 August 10

టాప్​న్యూస్​ @1 PM

  • మరో ప్రాణాంతక వైరస్​

ఆఫ్రికా దేశం గినియాలో ప్రాణాంతక మార్​బర్గ్​​ వైరస్ తొలి కేసు నమోదైంది. ఈ మేరకు గినియా సర్కారు ప్రకటించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది.

  • కేంద్రం తీరుపై సుప్రీం అసహనం!

ప్రజాప్రతినిధులపై కేసుల స్టేటస్​ రిపోర్టును అందించేందుకు కేంద్రం 2 వారాల గడువు కోరగా.. అసహనం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. నివేదిక అందించేందుకు ఎందుకింత సమయం? అని ప్రశ్నించింది. చట్టసభ్యుల కేసుల విచారణను వేగంగా జరపాలని కోరుతూ పిటిషన్ల పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం.

  • సిరిసేడులో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) దీక్ష ప్రారంభమైంది. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి షబ్బీర్ కుటుంబసభ్యులను తొలుత ఆమె పరామర్శించారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 6:00 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రజాభిప్రాయ సేకరణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశలో కాల్వల నిర్మాణాలపై రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నారాయణపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఆయా ముంపు గ్రామాల ప్రజలు.. కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. సమావేశ ప్రాంగణాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించలేదు.

  • జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ మరోసారి బీఎస్​ఈ-సెన్సెక్స్​  జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా దిగ్గజ కంపెనీల్లో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో బీఎస్​ఈ సెన్సెక్స్​ 292 పాయింట్లు లాభంతో 54,694 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 72 పాయింట్లు ఎగబాకి 16,331 వద్ద ట్రేడవుతోంది. 


 


 


 


 

12:01 August 10

టాప్​న్యూస్​ @12PM

  • 'పెగసస్​'పై విచారణ వాయిదా

కోర్టుల విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ. విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరమన్నారు. పెగసస్​పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణను సోమవారానికి(ఆగస్టు 16) వాయిదా వేశారు.

  • కరోనాతో పిల్లల్లో కాలేయవాపు!

కరోనా వైరస్ కొందరి పిల్లల్లో వివిధ అవయవాలను ప్రభావితం చేస్తోంది. తాజాగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రెండోసారి వైరస్​ విజృంభించిన సమయంలో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు పిల్లల్లో బయటపడినట్లు తేలింది.

  • చిన్నారుల కోసం ఫేస్​బుక్​ జట్టు

ప్రస్తుతం విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో చిన్నారులకు ఆన్​లైన్​ పాఠాలే శరణ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన ఆన్​లైన్ వాతావరణం ఎంతో ముఖ్యం. అందువల్ల ఆఫ్​లైన్​తో పాటు ఆన్​లైన్​లో చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేయటం, సురక్షితమైన ఆన్​లైన్​ కోసం యూనిసెఫ్​ ఇండియా, సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ జట్టుకట్టాయి. ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

  •  భాజపా నేత అరెస్టు

గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న భేతి మహేందర్​ రెడ్డిని పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

  • పాపం హేల్స్​

ఇంగ్లాండ్​ క్రికెటర్​ అలెక్స్​ హేల్స్​ ఆయువు పట్టుపై వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. దీంతో అతడు విలవిల్లాడాడు. ది హండ్రెడ్​ టోర్నీలోని ఓ మ్యాచ్​లో ఈ సంఘటన జరిగింది.


 


 


 


 

10:54 August 10

టాప్​న్యూస్​ @11AM

  •  భారీగా తగ్గిన కరోనా​ కేసులు

భారత్​లో రోజువారి నమోదవుతున్న కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 28,204 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 373 మంది మరణించారు. కొత్తగా 41,511 మంది కరోనా​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.

  • తనిఖీలు వద్దనుకుంటే పైసలివ్వాలి

ఆయనో మండల వ్యవసాయాధికారి. పురుగుల మందులు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతూ రైతులకు మేలు చేయాలి. కానీ డబ్బు కోసం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. పైసలిస్తేనే దుకాణాల్లో తనిఖీలు చేయకుండా ఉంటానని యజమానులతో బేరసారాలు ఆడారు. పైగా వసూళ్ల కోసం ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ నెలకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలంటూ సందేశాలు పంపించారు. కట్‌ చేస్తే సీన్ రివర్స్ అయింది. అనిశాకు(ACB) అడ్డంగా దొరికిపోయారు.

  • అయితే పెట్రోల్​ ఫ్రీ!

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. ఓ పేరు గల వ్యక్తులకు మాత్రం పెట్రోల్​ ఉచితంగా లభిస్తోంది. అంతేకాదు క్షౌరం ఫ్రీగా చేస్తున్నారు. ఎందుకంటే ఆ పేరున్న వ్యక్తి గడించిన ఘనత అలాంటిది మరి. ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేసిన.. అతని పేరు ఉన్నవాళ్లకు బంపర్​ ఆఫర్​ ప్రకటించాడు గుజరాత్​లోని ఓ పేట్రోల్​ బంకు యజమాని. ఆ పేరేమిటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే!

  • టీ20 ప్రపంచకప్​ న్యూజిలాండ్ జట్టిదే.. 

అక్టోబర్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. కేన్​ విలియమ్సన్​ సారథ్యం వహిస్తుండగా.. జట్టులో నుంచి వెటరన్​ క్రికెటర్​ రాస్​ టేలర్​ను తప్పించారు.

  • బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.


 


 


 


 

10:00 August 10

టాప్​న్యూస్​@ 10AM

  •  కరవైన టీకా

కనీసం మొదటి డోసు కరోనా టీకా(Corona Vaccination) వేయించుకోవాలనుకుంటే వేయడం లేదు.. పోనీ ఇప్పటికే మొదటి డోసు వేయించుకున్నవారు రెండో డోసుకు వెళ్తే లేదంటున్నారు. అసలు టీకా వేయించుకోనివారు, ఒకసారి వేయించుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు కరోనా రోగుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయం మొదలైంది. వేలాదిమంది వ్యాక్సిన్‌ కోసం కేంద్రాలకు ప్రతిరోజూ ఉదయమే పరుగులు తీస్తున్నారు.

  • యాచకరహితనగరమేది?

పని చేయగలిగే శక్తి ఉన్నా కొందరు యాచిస్తూ బతకడానికే ఇష్టపడుతున్నారు. రోజూ దాదాపు 1000 రూపాయలు వస్తుండటంతో ఆ వృత్తిని వదలలేకపోతున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 20 వేలకు పైగా యాచకులున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

  • సింహాల సంఖ్య పెరిగింది

భారత్​లో గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ధైర్యానికి సింహం నిదర్శనం అని, ఆసియా సింహాలకు నిలయంగా ఉన్నందున భారత్​ గర్విస్తోందని మోదీ ట్వీట్ చేశారు.

  •  లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 189 పాయింట్ల లాభంతో 54,592 కి చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 47 పాయింట్లు బలపడి 16,305 వద్ద కొనసాగుతుంది. 

  •  మహేశ్-త్రివిక్రమ్ పాన్ ఇండియా చిత్రం

సూపర్​స్టార్ మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా సోమవారం ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.
 

08:42 August 10

టాప్​న్యూస్​@ 9AM

  •  గస్తీ సిబ్బందికి శిక్షణ

నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కంటే.. అసలు నేరాలు జరగకుండా అడ్డుకోవడంపై తెలంగాణ పోలీసు శాఖ(Ts Police) దృష్టి పెట్టింది. ఇందుకోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7వేల మంది గస్తీ సిబ్బందికి మూడు దశల్లో శిక్షణను ప్రారంభించింది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం నేడు రెండో రోజు కొనసాగుతోంది.

  • విష జ్వరాల కలవరం

ఆ గ్రామాన్ని విష జ్వరాలు కలవరపెడుతున్నాయి. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పైగా వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా నడికుడలో గతేడాది ఇదే పరిస్థితి నెలకొనగా.... మళ్లీ జ్వరాలు వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

  • రెజ్లర్ రవిని కొరికాడు

ఒలింపిక్స్​ సెమీఫైనల్​లో రెజ్లర్​ సనయేవ్​.. రవి దహియాను గట్టిగా కొరికిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తాజాగా.. దీనిపై ఒలింపిక్స్​ రజత పతక విజేత రవి స్పందించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఘటన తర్వాత సనయేవ్​ క్షమాపణలు చెప్పినట్టు తెలిపాడు.

  • పతకాలు వచ్చేది ఎప్పుడు?

భారత ఒలింపిక్స్‌ చరిత్రలోనే ఈసారి టోక్యోలో అత్యధికంగా ఏడు పతకాలొచ్చాయి. రియోలో మాదిరి ఆశలు కూలిపోలేదు. ఒలింపిక్‌ చరిత్రలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇది సంతోషించదగ్గ విషయమే! కానీ ఒలింపిక్‌ ప్రపంచ పటంలో మన స్థానం ఎక్కడుందని చూస్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.  130 కోట్ల జనాభా.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్‌ది ఒలింపిక్స్‌లో 48వ స్థానం, గెలిచిన పతకాలు ఏడే కావడం చింతించాల్సిన విషయమే. మరి దీనికి పరిష్కారం ఏంటి?

  • 'కప్పెలా' రీమేక్‌లో మలయాళీ చిన్నది!

మలయాళంలో ప్రశంసలు అందుకున్న 'కప్పెలా' (kappela movie) ను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రీమేక్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం ముందు రాజశేఖర్‌ కూతురు శివాత్మికను అనుకున్నారట. తాజాగా గత నెలలో ప్రారంభమైన ఈ సినిమాలో శివాత్మికకు బదులుగా అనిఖా సురేంద్రన్​ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

07:54 August 10

టాప్​న్యూస్​@ 8AM

  •  భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు(Gold price today) మంగళవారం భారీగా తగ్గాయి. వెండి ధర రూ.65వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

  • తరుగు పేరుతో ఆగడాలు

తరుగు పేరుతో ధాన్యం తీస్తే సహించేది లేదని, రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. రైస్‌ మిల్లుల వద్దకు వెళ్లాక చాలాచోట్ల ఒక్కో బస్తాలో 5 కేజీల వరకు కోత పెడుతున్నారు. అలా మిగుల్చుకున్న ధాన్యాన్ని లెక్కేసి సొసైటీల వారు తమ వద్ద పనిచేసే సిబ్బందే పంట సాగుచేసి అమ్మినట్లు కొన్నిచోట్ల నకిలీ పర్వానికి తెరదీశారు.

  • కావాలని కేసు సాగదీత

భార్య హత్య కేసులో విచారణ జరగకుండా ఏళ్ల తరబడి కావాలని సాగదీస్తూ వస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ.. 14 ఏళ్లుగా సాగదీస్తుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

  • ఐక్యంగా ఉంటేనే సాగర భద్రత సాధ్యం

ప్రపంచ దేశాలు ఏకమైతేనే సముద్ర భద్రత సాధ్యమవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఐరాస భద్రతా మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విధంగా మాట్లాడారు.

  •  పతకాలు ఎలా వస్తాయి?

సరైన వ్యవస్థ లేకుండానే ఒలింపిక్స్​లో భారత్​కు ఎక్కువ సంఖ్యలో పతకాలు ఆశించడం సరికాదని ప్రముఖ బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​ పేర్కొన్నాడు. ప్రస్తుత వ్యవస్థ గందరగోళంగా ఉందని, దానిని సరిచేస్తేనే భవిష్యత్తులో మంచి ఫలితాలు దక్కుతాయని తెలిపాడు.

07:00 August 10

టాప్​న్యూస్​@ 7AM

గంటకో ఫిర్యాదు!

తెలంగాణలో సైబర్ నేరాలపై గంటకో ఫిర్యాదు వస్తోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఖాతాలో డబ్బు పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అందులో భాగంగానే 155260 నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసుల నిర్ణయం తీసుకున్నారు.

 పిల్లలకు సురక్షిత టీకాలు!

విద్యార్థులు ఇప్పటికే వరసగా రెండో ఏడాది కూడా బడులకు, సహవాసులకు దూరంగా ఇళ్లలో నాలుగు గోడల మధ్య ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో నిత్య సావాసం చేస్తున్నారు. ఫలితంగా చదువులు సరిగ్గా సాగక, ఆటాపాటల్లేక, శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో కుంగిపోతున్నారు. సహజసిద్ధమైన ప్రత్యక్ష తరగతి అభ్యసనకు దూరమైన చిన్నపిల్లలు ఆన్‌లైన్‌ తరగతులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు తల్లిదండ్రుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. చిన్న తరగతుల విద్యార్థులు ప్రాథమిక స్థాయి అంశాలను మరచి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హక్కుల హననాన్ని అరికట్టలేమా?

శాంతిభద్రతలు సహా మానవహక్కులను పరిరక్షించడమూ పోలీసుల బాధ్యతే. అయితే వారే పౌరహక్కులకు ప్రథమ శత్రువులుగా అవతరించారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవలే ఆక్షేపించారు. పోలీస్‌ స్టేషన్లలో పెచ్చరిల్లుతున్న హింసకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పులూ ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే చట్టబద్ధమైన పాలన సుసాధ్యమవుతుంది.

లార్డ్స్​కు టీమ్‌ఇండియా.. 

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు కోసం లండన్​ బయలుదేరింది టీమ్​ఇండియా. అయితే యువ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం ఈ నెల 13వరకు తొలి టెస్టు జరిగిన నాటింగ్​హామ్​లోనే ఉండనున్నారు.

'కథ వింటున్నప్పుడే కంటతడి పెట్టేశా'

విశ్వక్ సేన్‌ హీరోగా నటించిన 'పాగల్‌' సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్‌.

05:13 August 10

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

టాప్​న్యూస్​@ 6AM

  • ఆగస్టు 15 తర్వాత బడులు తెరుద్దాం!

ఈనెల 15 నుంచి బడులు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపై నివేదిక సమర్పించింది. రోజు విడిచి రోజు తగిన జాగ్రత్తలతో బడులు తెరవాలని తాజాగా విద్యపై పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది.

  • KRMB, GRMB: 'గెజిట్​లోని అభ్యంతరాలపై కేంద్రాన్ని సంప్రదించండి'

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కృష్ణా, గోదావరి బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హాజరు కాగా, తెలంగాణ గైర్హాజరైంది. ట్రైబ్యునల్‌, కోర్టు కేసుల కారణంగా సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా గెజిట్‌ నోటిఫికేషన్ల అమలుకు గడువుందంటూ వాయిదా వేయలేదు.

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశ పనుల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధమైంది. నేడు ఆరు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వాసితులు సైతం పరిహారానికి సంబంధించి తమ వాణి వినిపించాలని భావిస్తున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల నిరాహార దీక్ష

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నేడు వైఎస్​ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ఆమె పాల్గొంటున్నారు.

  • ఉజ్వల 2.0 పథకం ప్రారంభించనున్న ప్రధాని

ఉజ్వల 2.0 పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లో మంగళవారం ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నారు.

  • చైనాలో ప్రమాదకర ఆంత్రాక్స్ నిమోనియా కేసు

చైనాలో మరో ప్రాణాంతక వ్యాధి వెలుగుచూసింది. చెంగ్డే నగరంలో తొలి ఆంత్రాక్స్​ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.

  • గ్యాస్​ కనెక్షన్​ కావాలా? ఒక్క మిస్డ్​కాల్​ ఇవ్వండి

కొత్త వంట గ్యాస్ కనెక్షన్‌ కోసం ఇకపై ఇంధన సంస్థ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఒక్క నెంబరుకు మిస్డ్​కాల్​ ఇవ్వడం ద్వారా కొత్త ఎల్​పీజీ కనెక్షన్ పొందే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

  • అమలులో లోపాలే జీఎస్టీకి శాపాలు

ఆగస్టులో వస్తుసేవల పన్ను వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లకు చేరాయి. ఇటీవలే కాలంలో ధరల పెరుగుదల, కరోనా ఆంక్షల సడలింపులతో సహజంగానే ఆదాయం పెరిగింది. అయితే జీఎస్టీలో మోసాలు లేకుంటే ఈ వసూళ్లు మరింత పెరిగేవని నిపుణులు అంటున్నారు. 

  • ఒలింపిక్ పతక​ విజేతలకు అదిరిపోయే సన్మానం

దిల్లీలోని హోటల్​ అశోకలో ఒలింపిక్ పతక విజేతలను ఘనంగా సన్మానించారు. పోటీలు ముగిసిన తర్వాత కూడా తనకు ఒళ్లు నొప్పులు అధికంగా ఉన్నాయని పసిడి విజేత నీరజ్​ చోప్డా వెల్లడించాడు. కానీ, స్వర్ణం సాధించాననే ఆనందం ముందు అది తక్కువేనని తెలిపాడు.

  • దీపికా పదుకొణె 'బాడీగార్డ్' జీతం ఎంతో తెలుసా?

బాలీవుడ్ భామ దీపికా పదుకొణె అత్యంత పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. మరి ఆమె వద్ద పనిచేస్తున్న బాడీగార్డ్​ నెలజీతం ఎంత ఉంటుందో తెలుసా? అది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు!

Last Updated : Aug 10, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details