ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రక్రియపై విద్యార్థులు అనుమానాలు, ఆందోళన పెట్టుకోవద్దని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు. నిశ్చింతగా పరీక్షలు సిద్ధమై విజయం సాధించాలని సూచించారు. ఫలితాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నట్లు చెబుతున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కొత్త ఏజెన్సీ, సాఫ్ట్‌వేర్‌తో పరీక్షలకు సిద్ధం: ఇంటర్ బోర్డు
గతేడాది తలెత్తిన సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని.. మార్చి 4 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కొత్త ఏజెన్సీ, సాఫ్ట్‌వేర్‌తో ఈ ఏడాది పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు. మూల్యాంకనం చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
inter exams