మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న తరుణంలోనూ ప్రజలు గత పోరాటాన్ని పునరావృతం చేస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. 'మానుకోట తిరుగుబాటుకు పదకొండు ఏళ్లు' పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా తెజస చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ చర్చలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీమంత్రి ఈటల రాజేందర్, అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానుకోట పర్యటనను అడ్డుకునేందుకు చేసిన ఆనాటి పోరాట ఘట్టాలను ఈ చర్చాగోష్ఠిలో వక్తలు పంచుకున్నారు.
'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం' - ఓదార్పు యాత్ర
'మానుకోట తిరుగుబాటుకు పదకొండు ఏళ్లు' పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా తెజస చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ చర్చలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీమంత్రి ఈటల రాజేందర్, అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానుకోట పర్యటనను అడ్డుకునేందుకు చేసిన ఆనాటి పోరాట ఘట్టాలను ఈ చర్చాగోష్ఠిలో వక్తలు పంచుకున్నారు.
మానుకోట ఘటన సమైక్యాంధ్రుల మీద విజయం సాధించిన గొప్ప ఘట్టమని ఈటల అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకఘట్టం మానుకోట పోరాటమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం గుర్తు చేశారు. మానుకోట స్ఫూర్తితో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాధ్యం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఫలాలు స్థానిక ప్రజలకు దక్కడం లేదన్న కోదండరాం... రాష్ట్ర వనరులను కాపాడుకునే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మానుకోట స్ఫూర్తితో ఆత్మగౌరవ బావుటా ఎగరవేయాలని ఆకాంక్షించారు.