మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ (Etela Rajender) బృందం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్లో ఈటలకు (Etela Rajender).. అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో భాజపా శ్రేణులు తరలిరాగా... పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో.. పోలీసులు, భాజపా శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం - దిల్లీ నుంచి హైదరాబాద్కు ఈటల
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్(Etela Rajender) దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
![Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం etela, etela rajender, etela reached Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12139065-thumbnail-3x2-aa.jpg)
ఈటల, ఈటల రాజేందర్, హైదరాబాద్ చేరుకున్న ఈటల
సోమవారం భాజపాలో చేరిన ఈటల రాజేందర్ (Etela Rajender).. దిల్లీ నుంచి అనుచరులతో కలిసి విమానంలో బయలుదేరారు. సాంకేతిక లోపం కారణంగా విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
శంషాబాద్లో ఈటలకు అభిమానుల ఘనస్వాగతం
- ఇదీ చదవండి :'రూల్స్' పాటించమన్నందుకు డీలర్తో ఫైటింగ్
Last Updated : Jun 15, 2021, 4:42 PM IST