Etela Rajender Fire on CM Kcr: అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో తనను బలవంతంగా తీసుకెళ్లడంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండై సభ నుంచి బయటకు వెళ్లిన ఈటల తొలుత మీడియా పాయింట్‌కు వెళ్లేందుకు యత్నించారు. కానీ అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో... ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సొంత వాహనం కోసం వేచి చూస్తుండగా... ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుంచి తరలించారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు.
కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను: ఈటల రాజేందర్ - పోలీసులపై ఈటల ఆగ్రహం
Etela Rajender Fire on CM Kcr: కేసీఆర్‌ని గద్దె దించే వరకూ విశ్రమించబోనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని సవాల్ విసిరారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అనంతరం బయటకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. ఈ వ్యాఖ్యలు చేశారు.

etela rajender
‘‘మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు.. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’’ అని ఈటల అన్నారు.
ఇవీ చదవండి: