తెలంగాణ

telangana

ETV Bharat / city

సభాపతిపై చేసిన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణలు చెప్పాలి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Minister Prashant Reddy Fires on Etela: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈటల వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను అవమానిస్తే మెుత్తం శాసనసభను అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు. బీఏసీలో సభ్యుల సంఖ్య ప్రకారం పార్టీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభాపతిని గౌరవాన్ని కాపాడడానికి నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని అన్నారు.​

Minister Prashant Reddy Fires on Etela
Minister Prashant Reddy Fires on Etela

By

Published : Sep 6, 2022, 10:59 PM IST

Updated : Sep 7, 2022, 6:18 AM IST

Minister Prashant Reddy Fires on Etela: శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా సభ్యుడు ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈటల అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. ఆయన 20 ఏళ్లు అనుభవం ఉందని చెబుతూ సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడడం దుర్మార్గపు చర్యగా భావించారు. తన అనుభవంలో నేర్చుకునేది ఇదేనా అని ప్రశ్నించారు. సభాపతి నిబంధనల మేరకు తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు.

సభ్యుల సంఖ్యను ప్రకారం బీఏసీలో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు భాజపాకు బీఏసీలో అవకాశం ఇవ్వవద్దన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. దేశమంతటా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న భాజపాలో ఉన్న ఈటలతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలను దిగజారుస్తున్న భాజపా సభాపతిని అవమానపరచడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదని అన్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఆయనకు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు.

వార్తల్లో ఉండేందుకే ఈటల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని భాజపాకు భయపడి అసెంబ్లీ నిబంధనలు మారుస్తామా అని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే మరి లోక్ సభ స్పీకర్ పీఎం మోదీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ విషయం లో మాట్లాడేముందు సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆయన హితవు పలికారు. సభాపతిని అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచిట్లే అని అన్నారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మరమనిషి అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సభాపతి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈటల క్షమాపణ చెప్పకపోతే సభాపతి స్థానం గౌరవాన్ని కాపాడేందుకు నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details