తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CM Jagan: 'ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు' - గ్రామాలకు ఇంటర్నెట్

ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ (AP CM jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు ఇంటర్నెట్​ తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

digital library
digital library

By

Published : Aug 4, 2021, 6:58 AM IST

ఆంధ్రప్రదేశ్​లో గ్రామాలకు ఇంటర్నెట్​ తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ (AP CM jagan) స్పష్టం చేశారు. ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్‌.. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్‌ లైబ్రరీలతో ప్రాథమిక, మాధ్యమిక విద్య, డిగ్రీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ లైబ్రరీల్లో అన్ని పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ లభ్యమవుతుందని వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులకు సూచించారు.


ప్రతి గ్రామపంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని.. మొదటి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ నెల 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించి.. డిసెంబరు నాటికి డిజిటల్‌ లైబ్రరీలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించాలని సూచించారు.

ఇదీ చూడండి: CM Tour: ఇవాళ వాసాలమర్రికి సీఎం.. దళితవాడలో పర్యటన, ప్రజలతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details