అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. సభ్యులుగా ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా, సెస్ సంచాలకులు ప్రొఫెసర్ రేవతి తో సహా మరో ఏడు మందిని కమిటీ సభ్యులుగా నియమించారు.
మహిళా దినోత్సవ వేడుకల కోసం కమిటీ ఏర్పాటు - Telangana news
మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నేతృత్వం వహించనున్నారు.
మహిళా దినోత్సవ వేడుకల కోసం కమిటీ ఏర్పాటు
మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. మార్చి 8న రాష్ట్ర, జిల్లా స్థాయిలో వేడుకల నిర్వహణతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖ మహిళలను ప్రభుత్వం సన్మానించనుంది.
ఇదీ చూడండి:మగువలు ఏం కోరుకుంటున్నారు?