ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అసలైనా సూత్రధారుల పేర్లను వెల్లడించాలని పీపుల్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈఎస్‌ఐ చందాదారుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఎంతో మంది ఉద్యోగుల డబ్బులను ఇలా దుర్వినియోగం కావడంపై ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి ప్రసాద్ హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఏసీబీ అధికారులు కేవలం పాత్రదారులను మాత్రమే అరెస్ట్ చేశారని... అసలైన సూత్రదారులకు అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్తే ఉద్యోగులకు సరైన వైద్యం అందడం లేదని...అక్కడ సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈఎస్‌ఐకి డబ్బులు చెల్లిస్తున్న తమని కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. పట్టుబడిన అధికారుల ఆస్తులు మొత్తం జప్తు చేయాలన్నారు. అందులో పాలుపంచుకున్న రాజకీయ నాయకుల పేర్లు బయట పెట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు.
'ఈఎస్‌ఐ కేసులో అసలైన నేరస్థుల పేర్లు బయటపెట్టాలి' - హైదరాబాద్
ఈఎస్‌ఐ కుంభకోణంలో అనిశా అధికారులు అసలైన నేరస్థుల పేర్లు బయటపెట్టాలని ఈఎస్‌ఐ చందాదారుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఏసీబీ అధికారులు కేవలం సూత్రధారులను మాత్రమే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
'ఈఎస్‌ఐ కేసులో అసలైన నేరస్థుల పేర్లు బయటపెట్టాలి'