ఈఎస్‌ఐ కుంభకోణంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఐఎంఎస్ నిధులను అడ్డగోలుగా దోచుకోవడంలో ఆరితేరిన ఓమ్నీమేడీ కంజర్ల శ్రీహరిబాబు అలియాస్ బాజ్జీ లీలలు ఏసీబీ అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఔషధాల ధర పెంచుకోవడం కోసమే డొల్ల కంపెనీలు సృష్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతమైంది. స్వీడన్‌కు చెందిన హీమెక్యూ అనే కంపెనీ ఔషదాలను కొనుగోలు చేసేందుకు లెజెండ్ అనే సంస్థకు కట్టబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. డీలర్‌షిప్ ప్రకారం హిమెక్యూ సంస్థ నుంచి ఔషధాలు నేరుగా లెజెండ్ సంస్థకే సరఫరా కావాల్సి ఉంది. కానీ మధ్యలో మరో మూడు సంస్థలు చేతులు మారినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
ఈఎస్‌ఐ స్కాం: ఔషధాల ధర పెంచేందుకే డొల్ల కంపెనీలు - esi scam update on babji
కార్మిక బీమా సంస్థలో అక్రమాలు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఓమ్నిమెడీ సంస్థ ఎండీ శ్రీహరిబాబు ఔషధాల ధరలు పెంచేందుకే పలు సంస్థలు సృష్టించినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.
లెజెండ్ సంస్థ ఎండీ కృష్ణసాగర్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో ఏసీబీ ఈ ఔషధాల కుట్రను బహిర్గతం చేసింది. చివరగా లెజెండ్ సంస్థ నుంచి అక్రమ నిధుల్ని తిరిగి బాజ్జీ ఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించారు. ఇలా కొల్లగొట్టిన నిధులతో బాజ్జీ తనతో పాటు తన భార్య పేరుమీద రూ.150 కోట్ల విలువ చేసే షేర్లు, ఎఫ్‌డీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ లావాదేవీలను అధికారులు స్తంభింపజేశారు. కేవలం ఔషధాల ధర పెంచేందుకే ఈ పన్నాగం పన్నినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.
ఇవీ చూడండి:దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
TAGGED:
esi scam update on babji