తెలంగాణ

telangana

ఈఎస్​ఐ కుంభకోణం.. కోట్లు కొల్లగొట్టారు..!

By

Published : Dec 28, 2019, 5:20 AM IST

Updated : Dec 28, 2019, 8:01 AM IST

తీగ లాగితే డొంక కదులుతోంది... బీమా వైద్య సేవల సంస్థ-ఐఎంఎస్​ మందుల కొనుగోలు కుంభకోణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నిందితులపై ఆదాయపుపన్ను శాఖ దృష్టి సారించింది. దండుకున్న కోట్ల రూపాయలు, బినామీల పేరిట కూడబెట్టిన ఆస్తుల గురించి లోతుగా ఆరా తీస్తోంది.

ఈఎస్​ఐ కుంభకోణం.. కోట్లు కొల్లగొట్టారు..!
ఈఎస్​ఐ కుంభకోణం.. కోట్లు కొల్లగొట్టారు..!

ఈఎస్​ఐ కుంభకోణం.. కోట్లు కొల్లగొట్టారు..!

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసుపై ఆదాయపు పన్ను శాఖ బినామీ ఆస్తుల అంశంపై విచారణ చేపడుతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో బీమా వైద్య సేవల ద్వారా సుమారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టగా.. వాటిలో 200 కోట్ల వరకు సొమ్ము కొల్లగొట్టినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

నీకింత.. నాకింత..!

  • ఐఎంఎస్​ అధికారులు, సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు కలిసి ఇష్టారాజ్యంగా సొమ్ములు అడ్డగోలుగా దోచుకున్నారు.
  • ప్రతిపాదనలు సిద్దం చేయడం, కొనుగోళ్లు జరపడం, బిల్లులు మంజూరు, తదితర అంశాలను ఏకపక్షంగా... నిబంధనలను పక్కనబెట్టి జరిపినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
  • దేవికారాణి ఒక్కరే 25 డొల్ల కంపెనీలు స్థాపించినట్లు, ఒక్కో సంస్థ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తేలింది.
  • కొల్లగొట్టిన మొత్తాన్ని రకరకాల పద్ధతుల్లో దారి మళ్లించారు.

21 మంది అరెస్టు

దేవికారాణి తన భర్త గురుమూర్తి.. తల్లి పేరుతో వ్యాపార సంస్థ స్థాపించి భారీగా లాభాలు అర్జించినట్లు చూపించారు. విచారణ అధికారులు గురుమూర్తి తల్లిని ప్రశ్నించిన సమయంలో తన పేరుతో ఉన్న సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని, సంస్థ గురించే తనకు తెలియదని ఆమె తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేశారు. మరింత మందిని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అడ్డగోలుగా నొక్కేశారు..

నిందితులు కొల్లగొట్టిన సొమ్మును బినామీల పేరిట దారి మళ్లించినట్టు అనిశా భావిస్తోంది. ఒక్క దేవికారాణి దండుకున్న సొమ్ముతో పోగేసిన ఆస్తుల విలువ 15 కోట్లుగా తేలింది. బినామీ ఆస్తుల నిషేధిత చట్టం ద్వారా వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగనుంది.

నిందితులకు త్వరలో ఐటీ నోటీసులు

ఏసీబీ ద్వారా వివరాలు సేకరించడంతోపాటు... ఆదాయపన్ను అధికారులు కూడా దర్యాప్తు చేపట్టి బినామీల గుట్టు రాబట్టనున్నారు. త్వరలో ఐటీ శాఖ నిందితులందరికీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

ఇవీ చూడండి:ఈఎస్ఐలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం

Last Updated : Dec 28, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details