కార్మిక బీమా వైద్య సేవల సంస్థ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి, వసంత ఇందిర, పద్మతో పాటు శ్రీహరి, నాగరాజులను ఏసీబీ విచారించింది. మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా ఎవరెవరు ఎంత మేరకు లబ్ధి పొందారనే విషయాన్ని ఆరా తీశారు.
ఈఎస్ఐ కేసులో నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ - esi scam case custody
మందుల కొనుగోలు కుంభకోణం కేసులో నిందితులు దేవికారాణి, పద్మ, వసంత ఇందిర, మరో ఇద్దరిని అనిశా అధికారులు విచారించారు. నేటితో కస్టడీ ముగియనున్నందున వారిని అనిశా ప్రత్యేక కోర్టులో హాజరు పరచి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
ఈఎస్ఐ కేసులో నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ
దేవికారాణి బంగారం, వజ్రాలు, ఇతర ఆస్తుల కొనుగోలు వ్యవహారం తదితర అంశాలపై నిందితులను లోతుగా ప్రశ్నించారు. దేవికారాణి విచారణ బృందానికి సరిగ్గా సహకరించలేదని సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. వారిని అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
ఇదీ చదవండిః మందుల కుంభకోణంలో బయటపడుతున్న దేవికారాణి లీలలు
Last Updated : Nov 11, 2019, 7:42 AM IST