ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో అవినీతి అక్రమాలు పక్క రాష్ట్రాలకూ.. విస్తరించాయి. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఐఎంఎస్‌లోనూ నిధులను కొల్లగొట్టిన వైనం కూడా బయటపడింది. అక్కడ జరిగిన గోల్‌మాల్‌పై ఏపీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణలో జరిగిన అక్రమాలపై ఏపీ అధికారులు అనిశా నుంచి వివరాలు సేకరించారు. మరో వైపు కర్నాటక, మహారాష్ట్రలో కూడా శ్రీహరి బృందం ఇదే తరహాలో కుంభకోణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీహరి డొల్ల కంపెనీ అక్రమాల గురించి ఆరా తీస్తున్న క్రమంలో అతని ఇళ్లు, కార్యాలయాల్లో కోట్ల రూపాయల షేర్లు, ఎఫ్‌డీ పత్రాల పరిశీలించగా ఈ అక్రమాల లీలలు బయటపడ్డాయి. ఏపీ విజిలెన్స్ విభాగం లాగానే కర్ణాటక, మహారాష్ట్ర విచారణ బృందాలు కోరితే ఐఎంఎస్ కుంభకోణం వివరాలు సమర్పించడానికి అనిశా అధికారులు సిద్దంగా ఉన్నారు.
పక్కరాష్ట్రాలకు విస్తరించిన ఈఎస్‌ఐ కుంభకోణం - esic scam latest news
బీమా వైద్య సేవల కుంభకోణం కేసులో తవ్వుతున్న కొద్ది రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కుంభకోణం మూలాలు ఇతర రాష్ట్రాలకు విస్తరించినట్టు ఏసీబీ విచారణలో తేలింది. కుంభకోణంలో విచారణ అధికారులు కీలక నిందితుడిగా భావిస్తున్న శ్రీహరిబాబు లీలలు వెలుగు చూస్తున్నాయి. డొల్ల కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అతని బాగోతం ఏసీబీ అధికారులనే ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
స్వీడెన్‌కు చెందిన హిమోక్యూ సంస్థ నుంచి పరీక్ష కిట్ల కొనుగోళ్ల పేరుతో లెజెండ్ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో శ్రీహరిబాబు చక్రం తిప్పినట్టు ఏసీబీ గుర్తించింది. స్వీడెన్ సంస్థ కృష్ణసాగర్‌రెడ్డి పేరిట ఉంది. ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే కోసం ప్రయత్నించగా... విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అతను విచారణకు హాజరవుతున్నాడు. మందుల కొనుగోలు కుంభకోణంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం