ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిని అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు అధికారికంగా ప్రకటించారు. సంయుక్త సంచాలకురాలు పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరలను అరెస్టు చేసినట్లు దృవీకరించారు. వీరితో పాటు ఫార్మాసిస్ట్ రాధిక, శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్‌ను లను కూడా అరెస్టు చేసిన అధికారులు వెల్లడించారు. ఏడుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కాసేపట్లో ఏసీబీ కోర్టుకు ఈఎస్‌ఐ నిందితులు - ACB
ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిని అనిశా అధికారులు కాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈకేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మొత్తం ఏడుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాసేపట్లో ఏసీబీ కోర్టుకు ఈఎస్‌ఐ నిందితులు
అసలేం జరిగిందంటే..!
ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో అనిశా చర్యలు వేగం పెంచింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దేవికారాణి నివాసంలో సోదాలు నిర్వహించారు. దేవికారాణితో పాటు పలువురు అధికారుల ఇళ్లల్లో దాదాపు 23 ప్రాంతాల్లో సోదాలు చేసి.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : Sep 27, 2019, 3:18 PM IST