తెలంగాణ

telangana

'రూ. 1000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు'

By

Published : Sep 9, 2020, 1:26 PM IST

Updated : Sep 9, 2020, 4:10 PM IST

రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఎర్లబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/09-September-2020/8734567_328_8734567_1599647859087.png
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/09-September-2020/8734567_328_8734567_1599647859087.png

ప్రజలకు అభివృద్ధి ఫలాలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12751 గ్రామ పంచాయతీలకు గాను... 1126 పంచాయతీల్లో సీసీ రోడ్లు ఉన్నాయి. మిగిలిన 717 పంచాయతీల్లో త్వరలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రూ. వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పీఎంబీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మొదడి విడతలో 2427 కి.మీ రోడ్డకు గాను... 1020 కి.మీటర్ల రోడ్లు మాత్రమే మంజూరు అయ్యాయని వివరించారు.

Last Updated : Sep 9, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details