తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆన్​లైన్ టికెట్లు ఉంటేనే తిరుమలకు రావాలి' - తిరుమల శ్రీవారి వార్తలు

దూరప్రాంతాల భక్తులు ఆన్​లైన్​లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే ఈవో అనిల్​ కుమార్ సింఘాల్ సూచించారు. తిరుమలలో డయల్ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లు పొందినవారి విషయంలో.. ఆర్జిత సేవలు ప్రారంభమైన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

eo-anil-kumar-singhal-organized-the-dial-eo-program-in-tirumala
'ఆన్​లైన్ టికెట్లు ఉంటేనే తిరుమలకు రావాలి'

By

Published : Jun 15, 2020, 6:48 AM IST

దూర ప్రాంతాల భక్తులు ఆన్​లైన్​లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే ఈవో అనిల్​ కుమార్ సింఘాల్ సూచించారు. తిరుమలలో డయల్ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఆన్​లైన్​ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రోజుకు మూడువేల చొప్పున జూన్ 30 వరకు జారీ చేశామని పేర్కొన్నారు. తిరుమలలోని కౌంటర్ల ద్వారా ప్రతి రోజు సర్వదర్శనం టికెట్లు 3 వేలు చొప్పున జూన్ 22 వరకు ఇస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఓ గంట వీఐపీలకు, 12 గంటలు సామాన్యులకు దర్శనాలను కల్పిస్తున్నామని అన్నారు.

లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లు పొందినవారు తమ సేవల తేదీలను వాయిదా వేయాలని కోరారని.. దీనిపై ఆర్జిత సేవలు ప్రారంభించాక నిర్ణయం తీసుకుంటామని సింఘాల్​ తెలిపారు. ఆన్​లైన్​లో ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నవారు.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తిరుమలకు రావాలని ఈవో సూచించారు.

21న సూర్యగ్రహణం..

ఈనెల 21న ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 వరకు సూర్యగ్రహణం ఉంటుందని ఈవో సింఘాల్​ తెలిపారు. శనివారం రాత్రి ఒంటిగంట వరకు ఆలయ తలుపులు మాసివేసి.. ఆదివారం మధ్యాహ్నం 2.30 వరకు తెరుస్తామని అన్నారు. ఆలయ శుద్ధి అనంతరం సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి :'పదిరోజుల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు​'

ABOUT THE AUTHOR

...view details