తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కృష్ణా నదీ జలాల పంపకాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్ సూచించారు. ‘పాలమూరు అధ్యయన వేదిక - తెలంగాణ విద్యావంతుల వేదిక’ ఆధ్వర్యంలో ‘కృష్ణా జలాల వివాదం- గెజిట్ పర్యవసానాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Krishna water: 'కేంద్రం తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోంది' - Environmentalist Medha Patkar
కృష్ణా నదీ జల వివాదాన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోందని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్ అన్నారు. కేంద్రం అనుకుంటే రెండు రాష్ట్రాల సమస్యను పరిష్కరించగలదని.. ఆమె తెలిపారు.
'కేంద్రం తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోంది'
కృష్ణా నదీ జల వివాదాన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. కేంద్రం అనుకుంటే రెండు రాష్ట్రాల సీఎంలను చర్చలకు పిలిచి మధ్యవర్తిగా ఉండి ఏకాభిప్రాయం సాధించి సమస్యను పరిష్కరించి ఉండవచ్చన్నారు. ఆచార్య హరగోపాల్, ఆచార్య కోదండరాం, మాడభూషి శ్రీధర్ తదితరులు మాట్లాడారు.
ఇదీ చూడండి.Nagarjuna Sagar Dam: 22క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల