ఏపీలోని నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆడియో టేపులు సంచలనంగా మారాయి. 7 నెలల ముందు జీజీహెచ్‌లోని హౌస్ సర్జన్‌ను.. వెద్యాధికారి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడంతో ఇంఛార్జి కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణ చేయాలని కమిటీలు నియమించారు.
Audio viral: జీజీహెచ్‌లో డాక్టర్ కాముడు.. ఆడియో వైరల్! - నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులపై విచారణ వార్తలు
ఏపీలోని నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటనపై కలకలం రేకెత్తిస్తోంది. 7 నెలల క్రితం వైద్య విద్యార్థిని... వైద్యాధికారి మధ్య జరిగిన వేధింపుల ఆడియో బయటకు రావడంతో ప్రభుత్వం స్పందించి.. విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన కమిటీలు విచారణ పూర్తి చేశాయి. నివేదికను ప్రభుత్వానికి అప్పగించనున్నాయి.
nellore ggh sexsual harrasment
ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో కమిటీలు విచారణ చేపట్టాయి. ఈ రోజు ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నాయి. ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇద్దరు బాధితులను కమిటీ సభ్యులు విచారించారు. నేరం రుజువైతే అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.