తెలంగాణ

telangana

ETV Bharat / city

నగ్న దృశ్యాలతో మూడేళ్లుగా యువతికి వేధింపులు - గుంటూరు యువతిపై అత్యాచారం

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు... సహ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు. మూడు సంవత్సరాలుగా ఆ యువతిని మానసికంగా కుంగదీశారు. వేధింపులు తాళలేక బాధిత యువతి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించటంతో నిందితులు కటకటాలపాలయ్యారు.

crime news
నగ్న దృశ్యాలతో మూడేళ్లుగా యువతికి వేధింపులు

By

Published : Jun 28, 2020, 12:24 AM IST

యువతి నగ్న దృశ్యాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఏపీలోని గుంటూరు అర్బన్ దిశ పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని.... తన సహచర విద్యార్థితో ప్రేమలో పడింది. ఒకరోజు ఇద్దరూ ఏకాంత ప్రదేశానికి వెళ్లగా... యువతికి మత్తు మందు ఇచ్చి ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా దీనిని ఫోన్​లో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తరువాత యువతి అతన్ని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు యువతి నగ్న దృశ్యాలను తన స్నేహితుడికి పంపాడు.

నిందితుడి స్నేహితుడు సైతం కొన్నాళ్లు ఆ యువతి వెంట ప్రేమ పేరుతో తిరిగాడు. అతన్నీ దూరం పెట్టింది బాధితురాలు. కక్ష పెంచుకున్న రెండో వ్యక్తి యువతి నగ్న దృశ్యాలను పోర్న్​సైట్​లో పెట్టాడు. కొన్ని రోజులకు తీసేశాడు. ఈ వ్యవహారమంతా 2017 నుంచి జరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుంచి ఆ యువతికి ఓ అజ్ఞాత వ్యక్తి సంబంధిత దృశ్యాలను పంపించడం మొదలుపెట్టాడు. డబ్బులిస్తే వీటిని తొలిగిస్తానని వేధించాడు.

ఈ పరిణామాలతో కుంగిపోయిన బాధిత యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీసులను ఆశ్రయించారు. డిజిటల్ క్రైం, అత్యాచారం కింద కేసునమోదు చేసుకున్న గుంటూరు అర్బన్ దిశా పోలీసులు ఆధారాలతో సహా వరుణ్, కౌశిక్ అనే ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. అదే విధంగా మూడో వ్యక్తి ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపైన డిజిటల్ క్రైం, అత్యాచారం కింద కేసు నమోదు చేయటంతో పాటు.. రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

ఇవీచూడండి:కామంతో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

ABOUT THE AUTHOR

...view details