ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యంగా.. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కొత్త కోర్సులకు అనుమతి, అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం కారణంగా.. ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వెబ్ ఆప్షన్ల కోసం విద్యార్థులు రెండు రోజులుగా ఎదురు చూశారు.
ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ.. - విద్యాశాఖ
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పలు కారణాల వల్ల జాప్యమైనట్టు అధికారులు తెలిపారు. ఈసారి వెబ్ ఆప్షన్లలో కొత్త కోర్సులు ఉండనున్నట్టు అధికారులు ప్రకటించారు.
ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షా 32 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు సమర్పించారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్ 22 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉన్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో 45 కోర్సుల్లో 69,116 సీట్లతో పాటు.. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3352, ఫార్మా-డిలో 530 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఐఓటీ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటుకి వచ్చాయి.
ఇదీ చదవండిఃశ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు