ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తికాకపోవడం, బోధన రుసుములపై ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల కౌన్సెలింగ్‌పై అస్పష్టత ఏర్పడింది. కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిపోతుండటంతో కన్వీనర్ కోటా తర్వాత కోరుకున్న బ్రాంచిలో సీట్లు ఉంటాయో లేదోననే ఆందోళన విద్యార్థుల్లో మొదలైంది.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు బ్రేక్.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన - ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆగిపోవటంతో విద్యార్థుల ఆందోళన
ఏపీలోని ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిపోతుండటంతో కన్వీనర్ కోటాలో కోరుకున్న బ్రాంచిలో సీట్లు ఉంటాయో లేదోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
కళాశాలల ప్రవేశాల జాబితా... కన్వీనర్‌కు చేరకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలన నిలిపివేసి, సహాయ కేంద్రాలను మూసివేశారు. గడువు ముగియడంతో ప్రాసెసింగ్ రుసుము చెల్లించేందుకే అవకాశం కల్పిస్తున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఐచ్ఛికాలకు అవకాశం కల్పించలేదు. ఏపీ వ్యాప్తంగా 86,869 మంది ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారు. వీరిలో 85,702 మంది కళాశాలల ఎంపికకు అర్హత సాధించారు.
ఇవీచూడండి:డిమాండ్‌కు అనుగుణంగా కొత్తకోర్సులు... సంప్రదాయ చదువులకు స్వస్తి!