B.Tech Colleges Start From October : వచ్చే విద్యా సంవత్సరం (2022-23) కూడా ఇంజినీరింగ్ తరగతులు ఆలస్యంగానే ప్రారంభం కానున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబరు 10వ తేదీ నుంచి ఓరియంటేషన్ (అవగాహన కార్యక్రమం) ప్రారంభించనున్నట్లు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సుప్రీంకోర్టుకు తెలిపింది. అంటే అప్పటి నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నట్లు లెక్క. ఏఐసీటీఈ విద్యా క్యాలెండర్‌కు ఇటీవల సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
B.Tech Colleges Start From October : అక్టోబర్‌లో బీటెక్ తరగతులు ప్రారంభం - అక్టోబర్‌లో ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభం
B.Tech Colleges Start From October : గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఇంజినీరింగ్ తరగతులు వచ్చే ఏడాది అదే పంథాలో సాగనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి అక్టోబర్‌లో ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించనున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది.
B.Tech Colleges Start From October
విద్యా క్యాలెండర్ ఇలా..
- జులై 10 నాటికి: కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇస్తుంది. అప్పీల్‌కు వెళితే వాటిని అదే నెల 30వ తేదీ నాటికి పరిష్కరిస్తుంది.
- ఆగస్టు 31 నాటికి: ఆయా విశ్వవిద్యాలయాలు కళాశాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వాలి.
- సెప్టెంబరు 15 నాటికి: పాత విద్యార్థులకు తరగతుల ప్రారంభం
- అక్టోబరు 10 లోపు: తొలి ఏడాది విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రారంభించాలి.
- అక్టోబరు 25 లోపు: తరగతుల ప్రారంభం
- ఇదీ చదవండి :సాధారణ పౌరులను తరలించేందుకు ప్రత్యేక కారిడార్లు