తెలంగాణ

telangana

ETV Bharat / city

ED On IMS Scam: ఐఎంఎస్​ కుంభకోణంలో హైకోర్టుకు ఈడీ

ED On IMS Scam: ఐఎంఎస్​ కుంభకోణంలో ఈడీ... హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో నిందితుడు కంచర్ల శ్రీహరిబాబు అరెస్ట్​పై నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్​ వేసింది.

ED On IMS Scam
ED On IMS Scam

By

Published : Dec 23, 2021, 5:43 AM IST

ED On IMS Scam: బీమా వైద్య సేవల కేసు (ఐఎంఎస్​) నిందితుడు కంచర్ల శ్రీహరి బాబు రిమాండ్ కోసం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ హైకోర్టును ఆశ్రయించింది. ఐఎంఎస్ కుంభకోణంలో ఓమ్ని మెడి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల శ్రీహరి బాబును ఇటీవల ఈడీ అరెస్టు చేసి, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచింది. శ్రీహరి బాబుకు రిమాండ్ విధించి చంచల్​గూడ జైలుకు తరలించాలన్న ఈడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టు సందర్భంగా సీఆర్​పీసీ 41- ఏ సెక్షన్ ప్రకారం ఈడీ వ్యవహరించలేదని తప్పుపట్టింది.

శ్రీహరిబాబును అరెస్టును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్​ చేస్తూ ఈడీ.. హైకోర్టును ఆశ్రయించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదించారు. ఈడీ పిటిషన్​పై స్పందించాలని శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీచూడండి:Madhucon Director Arrest Issue : మధుకాన్, రాంచీ ఎక్స్​ప్రెస్ డైరెక్టర్​కు రిమాండ్​ విధించకపోవడంపై హైకోర్టులో పిల్​

ABOUT THE AUTHOR

...view details