తెలంగాణ

telangana

ETV Bharat / city

కిడ్నాప్ కథ సుఖాంతం... - kachiguda kidnapping story

సోమవారం చాదర్​ఘాట్​ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి బిడ్డను ఎత్తుకెళ్లిన కేసును కాచిగూడ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

కిడ్నాప్ కథ సుఖాంతం

By

Published : Nov 12, 2019, 11:22 PM IST

కాచిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని చాదర్​ఘాట్​ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కిడ్నాప్​కు గురైన పాప కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ గుడి వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి సంవత్సరంన్నర వయసు గల మహేశ్వరి అపహరణకు గురైంది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల గాంధీనగర్​కు చెందిన మిరియాల కృష్ణవేణి భర్త నర్సింహులుతో విభేదాల కారణంగా నగరంలోని లంగర్​హౌస్​ పరిధిలోని బాబునగర్​లో నివాసం ఉంటు భిక్షాటన చేస్తూ.. జీవనం కొనసాగిస్తోంది.

సోమవారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో చాదర్​ఘాట్ కూడలి వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు అలిసిపోయి నిద్రిస్తున్న సమయంలో శంకర్​నగర్​కు చెందిన అవినాశ్​, సంధ్య దంపతులు కృష్ణవేణి పక్కలో నుంచి మహేశ్వరి ఎత్తుకెళ్లారు. గంట తర్వాత నిద్రలేచిన కృష్ణవేణి పక్కలో కూతురు లేకపోవడం గమనించి చుట్టుపక్కల వెతికి కాచిగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా 24 గంటల్లో కేసును ఛేదించి బిడ్డను తల్లిచెంతకు చేర్చారు. కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులను ఈస్ట్​జోన్ ఏసీపీ సుధాకర్ అభినందించి రివార్డు ప్రకటించారు.

కిడ్నాప్ కథ సుఖాంతం

ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details