ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం.. పాల్గొన్న మంత్రులు
12:17 October 01
ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం.. పాల్గొన్న మంత్రులు
ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, మల్లారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
ఉపాధిహామీ పథకం కింద వివిధ శాఖల్లో చేపడుతున్న పనులపై చర్చిస్తున్నారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఉపాధిహామీ చేపడుతున్న పనులపై మంత్రులు సమీక్షిస్తున్నారు. రహదార్ల నిర్మాణం, పూడికతీత, వైకుంఠధామాలు, హరితహారం, ఇంకుడుగుంతలు, చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మత్తులు, ఉపాధి కల్పన పనులపై సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'