EMPLOYEES PROTEST:పీఆర్సీపై నిరసనల్లో భాగంగా ఏపీ సచివాలయంలో ఉద్యోగులు పెన్ డౌన్, యాప్ డౌన్ చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లన్నీ షట్ డౌన్ చేసి నిరసన తెలిపారు. దీనివల్ల సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం ఆగదని.. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఉద్యోగులు పునరుద్ఘాటించారు. మరోవైపు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Employees Union: చర్చలకు రావాలన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందించారు. నేడు స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం.. చర్చలకు వెళ్లాలా ? వద్దా ? అనే విషయాన్ని వెల్లడిస్తామని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు చెప్పారు. చలో విజయవాడ సందర్భంగా.. అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.