తెలంగాణ

telangana

ETV Bharat / city

GPF ACCOUNTS: ఉద్యోగుల ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం.. అసలేలా జరిగింది? - ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై అధికారులతో చర్చలు

GPF ACCOUNTS: ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా కావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం కావడంపై ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు.

GPF ACCOUNTS
ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు

By

Published : Jun 29, 2022, 8:51 PM IST

GPF ACCOUNTS:ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయమైన ఘటనపై ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా కావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీనికి ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు.

పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, కింద స్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. సాయంత్రంలోగా అన్ని విషయాలపైనా స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు వేయడం, తీయ్యడంపై సీఎఫ్ఎంఎస్​లో టెక్నికల్ ప్రాబ్లం ఉండవచ్చని తెలిపారు. జరిగిన పొరపాటుపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నట్లు తెలిపారు.

సాంకేతికంగా మార్చి నెలలో క్రెడిట్ జరగదని.. అలాంటిది ఎలా జరిగింది? అన్న విషయంపై ఆరా తీస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు వివరించారని ఏపీజేఏసీ అమరావతి నేత బొప్ప రాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎఫ్ఎంఎస్​లో జరిగిన ఈ పొరపాటును ఆర్థిక శాఖ అధికారులు అంగీకరించారని తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయం:జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయమైనట్లు భావిస్తున్నామని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. జీపీఎఫ్‌ ఖాతాలో నిధులు మాయంపై అధికారులను అడిగామని.. ఆర్థికశాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఉద్యోగుల అకౌంట్‌ను హ్యాకింగ్ చేసినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గతేడాది వలే ఈ ఏడాదీ మా ఖాతాల్లో సొమ్ము పోయిందిని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని పొరపాట్లు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details