Employees Allocation: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తైంది. సీనియారిటీ, ఆప్షన్స్ ఆధారంగా కొత్త జిల్లాల వారీగా కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. చాలా చోట్ల ఉద్యోగులకు కేటాయింపులు పూర్తి చేసి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం ఇచ్చారు. కేటాయింపు ఆదేశాలు పంపించారు. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు సంబంధించిన కసరత్తు హైదరాబాద్‌లో కొనసాగుతోంది. బీఆర్కేభవన్ వేదికగా ప్రక్రియ జరుగుతోంది. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు.. సీనియారిటీ, ఆప్షన్స్ ప్రాతిపదికన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా, పొరపాట్లకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నాలుగైదు రోజుల్లో..
TS Employee bifurcation: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.... ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఎప్పటికప్పుడు ప్రక్రియను సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో చాలా శాఖలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని... ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండే పెద్ద శాఖల్లో నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. ప్రక్రియ పూర్తయ్యాక కేటాయింపు ఉత్తర్వులను ఉద్యోగులకు ఇస్తారు.
వారికి వెసులుబాటు..