Eamcet Engineering Exam:ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్నందున వర్షాల నేపథ్యంలో ఈసారి ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనలో సడలింపు ఇవ్వాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందరికీ కాకుండా వర్షాలు పడుతున్న సమయంలో, రోడ్లు దెబ్బతిని, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అందుకు సరైన కారణం చూపిస్తే మాత్రం పరీక్షలకు అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల అధికారులు కన్వీనర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల అనుమతి తీసుకొని కొద్దిగా ఆలస్యం వచ్చిన వారిని అనుమతించనున్నట్లు సమాచారం. ఒకవేళ బాగా ఆలస్యంగా వస్తే... తర్వాత రెండు రోజుల్లో ఏదో ఒక విడతలోనూ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నారు.
నేటి నుంచే ఎంసెట్... ఒక్క నిమిషం నిబంధన సడలింపు - నేటి నుంచి ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్ష
Eamcet Engineering: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే... ఎంసెట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగనుంది. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తుండగా... ఒక్కో సెషన్‌కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నందున.. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగనుంది. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తుండగా... ఒక్కో సెషన్‌కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు... రెండోపూట పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇంజినీరింగ్‌కు లక్షా 72 వేల 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 89, ఏపీలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. వాయిదాపడిన అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి త్వరలో ఖరారు చేయనుంది.
ఇవీ చదవండి: