Eluru corporation office pending power bills issue: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థకు విద్యుత్ బకాయిలు ఉండటంతో అధికారులు.. నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. విద్యుత్ శాఖ సిబ్బంది కార్యాలయంలో మీటర్ వద్ద ఫీజులు తొలగించి.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు పదికోట్ల రూపాయలు వరకు విద్యుత్ బకాయిలు ఉండటం వల్ల.. విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా విద్యుత్ బకాయిలను నగర పాలక సంస్థ అధికారులు చెల్లించట్లేదని అంటున్నారు.
బకాయిలు చెల్లించలేదని కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ తొలగింపు - ఏలూరు కార్పొరేషన్ విద్యుత్ కట్
Eluru corporation office pending power bills issue: ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ను అధికారులు తొలగించారు. మీటర్ వద్ద ఫీజులు తొలగించి.. కరెంట్ సరఫరా నిలిపివేశారు. సుమారు పదికోట్ల రూపాయలు వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం కార్యాలయంలో అంధకారం నెలకొంది. అత్యవసర కంప్యూటర్లు పనిచేయడానికి జనరేటర్ వినియోగిస్తున్నారు. మిగితా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, సిబ్బంది కంప్యూటర్లు పనిచేయలేదు. ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం వల్ల.. సిబ్బంది సైతం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు ముగ్గురు సిబ్బంది మాత్రమే కార్యాలయంలో కనిపించారు. అత్యవసరంగా చెల్లించాల్సిన పన్నులు, తాగునీటి ఛార్జీలు చెల్లించాల్సిన వారు సిబ్బంది లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. నిధులు కొరత వల్ల బకాయిలు చెల్లించలేదని.. త్వరలోనే బకాయిలు సర్దుబాటు చేస్తామని అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి:'తెరాసను దుర్భేద్యంగా మలిచేందుకు కృషి చేయాలి: కేటీఆర్