తెలంగాణ

telangana

ETV Bharat / city

Eluru Elections results : ఏలూరు కార్పొరేషన్‌ పీఠం వైకాపాదే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైకాపా దక్కించుంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడైన ఫలితాల్లో 47 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి.

eluru-corporation-election-counting-of-votes-continues
Eluru Elections results : ఏలూరు కార్పొరేషన్‌ పీఠం వైకాపాదే..

By

Published : Jul 25, 2021, 2:09 PM IST

Updated : Jul 25, 2021, 4:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైంది. వెల్లడైన ఫలితాల్లో 47 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు, మూడు స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి.

వైకాపా విజయం..

2వ డివిజన్‌లో 730 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి కనక నరసింహారావు గెలుపొందారు. 4వ డివిజన్‌లో 744 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి డింపుల్‌ , 12వ డివిజన్‌లో 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను, 22వ డివిజన్‌లో 468 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సుధీర్‌బాబు, 23వ డివిజన్‌లో 1,823 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సాంబ, 24వ డివిజన్‌లో 853 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి మాధురి , 25వ డివిజన్‌లో 724 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి శ్రీనివాస్‌, 26వ డివిజన్‌లో 1,111 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి అద్దంకి హరిబాబు, 31వ డివిజన్‌లో 471 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి లక్ష్మణ్, 33వ డివిజన్‌లో 88 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి రామ మోహన్ , 38వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి హేమమాధురి, 39వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి జ్యోతి, 40వ డివిజన్‌లో 758 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి స్రవంతి , 41వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి కల్యాణిదేవి, 42వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి సత్యవతి, 45వ డివిజన్‌లో 1,058 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి చంద్రశేఖర్, 46వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి ప్యారీ బేగం, 48వ డివిజన్‌లో 483 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి స్వాతి శ్రీదేవి విజయం సాధించారు.

45వ డివిజన్‌ వీరిలో వైకాపా అభ్యర్థి ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతి చెందారు.


తెదేపా విజయం

37వ వార్డులో 150 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి పృథ్వీ శారద విజయం సాధించారు. 47వ డివిజన్‌లో 55 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి దుర్గా భవాని గెలుపొందారు.

ఆధిక్యంలో

మరోవైపు 50వ డివిజన్‌లో వైకాపా మేయర్‌ అభ్యర్థి నూర్జహాన్‌ 570 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. 15వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి కన్నబాబు రంగా 94 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్​లో వైకాపా అధిక్యం

అంతకుముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో వైకాపా 11, తెదేపా, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు.

ఓట్ల శాతమిలా..

నగర పాలక సంస్థ ఎన్నికల్లో 56.82 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,32,972 మంది కాగా.. 1,12,520 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు

పోటీ..

ఏలూరు కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ పడ్డారు.

ఓట్ల లెక్కింపు వాయిదాకు గల కారణాలు..

ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, జాబితా సక్రమంగా లేదని పలు రాజకీయ పార్టీల నాయకులు, కొన్ని ప్రజా సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో విలీనం చేసిన ఏడు పంచాయతీల ఓటర్లను 50 డివిజన్లలో కూర్పు చేయగా.. చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయని.. ఓ ప్రాంతంలో ఉన్న ఓట్లను సంబంధం లేని ఇతర ప్రాంతాల్లో చేర్చారని, జాబితాను మార్పు చేయాలని అప్పటివరకు ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరారు. దీంతో మార్చి 10న జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేయాలని న్యాయస్థానం అదే నెల 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయడంతో ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. కానీ లెక్కింపును నిలుపుదల చేయాలని మార్చి 23న దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో లెక్కింపు వాయిదా పడింది.ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు చేసింది.

ఇదీ చదవండి:Explosion: వికారాబాద్ జిల్లాలో పేలుడు కలకలం... ఒకరికి తీవ్ర గాయాలు..

Last Updated : Jul 25, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details