కొవిడ్ - 19 నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అమలు చేసిన సమయంలో 4రేట్ల వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్‌కు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. రూ. 350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జికి.. రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి పేజ్-2 సెకండ్ లేవల్లో నిర్మించనున్న 3 లేన్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశామన్నారు. వీటిని శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. వైరస్ వ్యాప్తిస్తున్నా జీహెచ్ఎంసీ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే రోడ్ల విస్తరణ చేయాల్సిందే... దానికి అందరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం..
అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు... వీలైనంత త్వరగా వంతేనను పూర్తి చేస్తాం. కొన్ని రోడ్ల విస్తరణ పనులకు రక్షణ రంగానికి సంబంధించిన స్థలాలు అవసరమవుతాయి. కాబట్టి అందుకు కేంద్రం సహకరించాలి. 36 కిలో మీటర్ల స్కై వే నిర్మించాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం. - కేటీఆర్, పురపాలక శాక మంత్రి